Gundeninda GudiGantalu Today episode April 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఊరిని చూసి రావాలని బాలు రాజేష్ ఇద్దరు అనుకుంటారు.. ఊరిని చూడక చాలా రోజులైంది పల్లెలు ఉంటే నాకు కూడా చాలా ఇష్టం వెళ్లి చూసొద్దాం పదండి అని మాణిక్యం అంటాడు. రోహిణి మాత్రం బాలుతో వెళ్తున్నాడు కచ్చితంగా నిజాలు బయట పెడతాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మావయ్య నువ్వు బాగా అలసిపోయావు కదా వెళ్లి పడుకుందువు రా అనేసి అంటుంది. ఎంతసేపు ఏం పడుకుంటావమ్మా కాసేపు అలా ఊరు తిరిగేస్తామని అనగానే రోహిణి వద్దు అంటుంది. లేదు నేను వెళ్లాల్సిందే అని మాణిక్యం అనడంతో మనోజ్ నీ తోడుగా పంపిస్తుంది. బాలు రాజేష్ అందరూ మాట్లాడుకుంటూ వెళ్లిపోతారు. ఒకచోట ఆగి రాజేష్ ఫారిన్ సర్కుందానే అడుగుతాడు. కస్టమ్స్ అధికారులు పట్టేసుకున్నారని ఏదో అబద్దాలు చెప్పేస్తాడు. ఇక ఈ ఊర్లో కళ్ళు ఉంటుందని అడిగితే ఈ ఊర్లో చాలా ఉంటుంది మీకు ఎంత కావాలో అంత తాగొచ్చు అని బాలు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి అరేంజ్ చేయమని చెప్తాడు. అందరూ అక్కడికి వెళ్తారు మనోజ్ మాత్రం మాణిక్యం నీ తాగకుండా ఆపుతాడు. మాణిక్యం మనోజ్ చేత కూడా మందు తాగిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కల్లు తాగి అందరు ఇంటికి వెళ్తారు. మనోజ్ ని అక్కడ కూర్చోబెడతారు. ప్రభావతి ఏమైందిరా వాడికి సోయ లేకుండా ఉన్నాడేంటి అనిఅడుగుతుంది. తాగొచ్చారా అని అంటే కళ్ళు తాగాడని బాలు చెప్తాడు. వాన్ని కూడా నీలాగే తయారు చేస్తున్నావా అని ప్రభావతి అరుస్తుంది. రోహిణి నువ్వంటే ఎలాగో తాగి అందర్నీ బాధ పెడుతున్నావ్ ఇప్పుడు మనోజ్ ని కూడా తాగుబోతుని చేయాలనుకుంటున్నావా అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతుంది. బాలు మాత్రం మౌనంగా ఉంటాడు. మేక మావయ్య అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అని మాణిక్యం ని అడిగితే, మాణిక్యం మాత్రం బాలుదే తప్పు.. మనజ్ వద్దని అన్నా బలవంతంగా తాగించాడని అడ్డంగా ఇరికిస్తాడు…
బాలుని రోహిణి దారుణంగా తిడుతుంది. మనోజ్ కి మందు అలవాటు లేదని తెలుసు కదా నీలాగా పచ్చి తాగుబోతు లాగా చేద్దామని అనుకుంటున్నావా అని మరిదని కూడా చూడకుండా తిట్టేస్తుంది. ప్రభావతి వాణ్ణి కూడా నీలాగా తయారు చేద్దామని అనుకుంటున్నావా అని దారుణంగా తిడుతుంది. నువ్వు చెడిపోయేది కాక వాణి కూడా చెడగొట్టాలని చూస్తున్నావా.. ఇంట్లో మీ నాన్న లేరు కాబట్టి సరిపోయింది అదే మీ నాన్న ఉంటే ఈపాటికి ఇండ్లు పంది వేసేవాడు.. ఎందుకురా ఇలా చేసావని ప్రభావతి అడుగుతుంది.
సుశీల నీకు చదువు అవ్వకపోయినా మంచి బుద్ధులు నేర్పించాను కదరా ఎందుకురా తాగుబోతు లాగా తయారయ్యావ్ అంటూ బాలుని చంప పగలగొడుతుంది. నానమ్మ నేను చెప్పేది విను అనేసి ఎంత చెప్పినా ఆమె వినదు. ఇప్పుడేంటి మనోజ్ కి తాగింది దిగాలి కదా అది నేను దిగేలా చేస్తాను అనేసి ఇంట్లో మజ్జిగ ఉందేమో వెళ్లి తీసుకురమ్మని చెప్తారు. మీనా వెళ్లి మజ్జిగ తెచ్చి ఇస్తుంది.
మజ్జిగను బలవంతంగా మనోజ్ నోట్లో పోస్తాడు. మనోజ్ మాత్రం మత్తు దిగకుండా ఇంకో పెగ్గు కావాలి ఇంకో బాటిల్ కావాలి అంటూ నానా రచ్చ చేస్తాడు. ఒక్కసారిగా మనోజ్ బాలు లాగా మారిపోతాడు. షీలా డార్లింగ్ నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని భామను పట్టుకొని వింతగా మాట్లాడతాడు.. అదేవిధంగా అందరితోనూ అలాగే వాగుతూ ఉంటాడు. మందావతి బుద్ధిలేనివతి అంటూ బాలు లాగే అచ్చం తిడుతూ మాట్లాడతాడు.. ఇక రోహిణి, ఏంట్రా మందు ఒక్కరోజు తాగితేనే వాడిలాగా తయారయ్యావ్ అంటూ ప్రభావతి అడుగుతుంది. మనోజ్ మాత్రం పాలరమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను వదిలేసి నువ్వు మలేషియాకి వెళ్ళిపోవు కదా అనేసి అంటాడు..
రోహిణి ఇవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళమ్మా అని ప్రభావతి అంటుంది. మనోజ్ నీ లోపలికి తీసుకెళ్లి పడుకోమంటే నాకు ఇంకొక బాటిల్ కావాలని రోహిణి తో నానా రచ్చ చేస్తాడు. రోహిణి మాత్రం ఆ బాలు వల్ల ఇదంతా చేసింది ఆ బాలుకు చెప్తాను ఇప్పుడు అనేసి కోపంగా వెళుతుంది. బాలు రాజేష్ తో మాట్లాడటం విని షాక్ అవుతుంది.. మనోజ్ తో మందు తాగించింది బాలు కాదని తెలుసుకొని, మాణిక్యమని తెలిసి కొట్టడానికి తన రూమ్ కి వెళుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మాణిక్యం నుంచి నిజాన్ని రాబడుతుంది. మరి బాలు మాణిక్యం గుట్టు రట్టు చేస్తాడేమో చూడాలి..