BigTV English

The Ba*dsOf Bollywood : కౌంట్ డౌన్ బిగిన్స్.. ది బా*డ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రివ్యూ రిలీజ్.. ఎప్పుడంటే!

The Ba*dsOf Bollywood : కౌంట్ డౌన్ బిగిన్స్.. ది బా*డ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రివ్యూ రిలీజ్.. ఎప్పుడంటే!

The Ba*dsOf Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు షారుక్ ఖాన్ (Shahrukh Khan)ఒకరు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan)కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఆర్యన్ హీరోగా కాకుండా దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్(The Ba*ds of Bollywood) కు సంబంధించి బిగ్ అప్డేట్ నెట్ ఫిక్స్ విడుదల చేసింది. సిరీస్ కి సంబంధించి ఈరోజు విడుదల కాబోతుందని ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు అయితే సరైన సమయం మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేకపోయిన ఈరోజు మాత్రం విడుదల కాబోతుందని తెలియజేశారు.


ఆకట్టుకున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

బాలీవుడ్ టాకీస్ నివేదిక ప్రకారం, ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఈరోజు, ఆగస్టు 20, 2025న, ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదివరకే ఈ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే రివ్యూ పై కూడా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. మరి మొదటి సినిమా ద్వారా ఆర్యన్ ఖాన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారు ఏంటి అనేది స్పష్టం అవుతుంది. ఇక ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సిరీస్ రెడ్ చిల్లి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరీ ఖాన్(Gauri Khan) నిర్మిస్తున్నారు.


దర్శకుడిగా మారిన ఆర్యన్ ఖాన్…

ఇక ఈ సిరీస్ లో బాబీ డియోల్ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న బాబీ డియోల్ కు ఈ సిరీస్ ఎంతో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని తెలుస్తుంది. అదే విధంగా ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ వంటి వారు కూడా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. వీరితోపాటు రణబీర్ కపూర్, కరణ్ జోహార్, వంటి ప్రముఖులు అతిథి పాత్రలలో నటిస్తూ బాలీవుడ్ స్టార్స్ సమావేశంగా ఈ సిరీస్ నిలవబోతుందని చెప్పాలి.

తెరపై సందడి చేయనున్న ముగ్గురు ఖాన్స్…

ఈ సిరీస్ ద్వారా ముగ్గురు ఖాన్స్ ఒకేసారి తెరపై కనిపించబోతున్నారనే విషయం అభిమానులను ఎంతో ఆనందానికి గురిచేస్తుంది. ఈ సిరీస్ కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే నేడు విడుదల చేయబోయే రివ్యూ ఎలాంటి అంచనాలను పెంచుతుందో తెలియాల్సి ఉంది. అయితే ఏ సమయంలో రివ్యూ విడుదల కాబోతుందనే విషయంపై స్పష్టత లేకపోయినా నేడు విడుదల కానున్నట్టు అధికారకంగా ప్రకటించారు. ఇకపోతే ఆర్యన్ గతంలో పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. రేవ్ పార్టీలో పట్టుబడిన ఆర్యన్ కొద్ది రోజులపాటు జైలు జీవితాన్ని అనుభవించారు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన ఆర్యన్ ఖాన్ కు కోర్ట్ క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈ వివాదాలన్నింటిని దాటుకున్న తర్వాత ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు కూడా ఈ సిరీస్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.

Also Read: Mahesh Babu: ఛారిటీ కోసం ప్రతి ఏడాది మహేష్ ఎన్ని కోట్లు డొనేట్ చేస్తారో తెలుసా?

Related News

HHVM OTT: ఓటీటీలోకి వీరమల్లు.. క్లైమాక్స్‌లో మార్పులు… ఉన్న ఆ ఒక్క సంతృప్తి కూడా పోయింది

Superman OTT: సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ మ్యాన్..ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie: ఆ పనికి అడిక్ట్ అయిన అమ్మాయి కథ, ఒక్కడితో ఆపలేదు, నువ్వు ఒక్కడివే చూడు మామ

OTT Movie : కొత్త జాతి మనుషులు… 8 మంది చేసే నెవర్ బిఫోర్ పనులు… ఈ క్రేజీయెస్ట్ సిరీస్ వర్త్ వర్మా వర్త్

OTT Movie : IMDbలో 8.6 రేటింగ్… ‘సేక్రెడ్ గేమ్స్’ను మించిన ఉత్కంఠ… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Big Stories

×