Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఒకరు. బాలా నటుడిగానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవెలుగు వెలుగుతున్నారు. ఇక మొదటిసారి ఈయన రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన సినిమాలు కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాయి. మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో మహేష్ బాబు సినిమా రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
వందల మంది చిన్నారులకు పునర్జన్మ…
ఇలా సినిమాల పరంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు నిజ జీవితంలో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు. మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ (Mahesh Babu charitable trust)ప్రారంభించి ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ వారికి పునర్జన్మను ప్రసాదిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని వందల మందికి సర్జరీలు చేయించిన ఘనత మహేష్ బాబుకి దక్కింది. కేవలం చిన్నారుల సర్జరీలు మాత్రమే కాకుండా ఎంతోమంది పిల్లల చదువు బాధ్యతలను కూడా తీసుకున్నారు. అలాగే బుర్రపాలెం గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా తన చారిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు.
ప్రతి ఏడాది 30 కోట్ల రూపాయలు..
ఇక మహేష్ బాబు ట్రస్ట్ కోసం పెద్ద ఎత్తున సెలబ్రిటీలు విరాళాలను అందజేస్తూ ఉంటారు. అయితే ఒక మహేష్ బాబు మాత్రమే ప్రతి ఏడాది తన చారిటబుల్ ట్రస్ట్ కోసం 30 కోట్ల రూపాయలు డొనేట్ చేస్తారని తెలుస్తోంది. ప్రతి ఏడాది చారిటీ కోసం ఈయన 30 కోట్లు ఇవ్వడంతో ఈ డబ్బు ద్వారా ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.. ఇక ఈయన పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు అన్నీ కూడా ట్రస్ట్ కే పంపిస్తారని సమాచారం.
నెలలు నిండకముందే పుట్టిన గౌతమ్…
సినిమాలలో సంపాదించి ఎంతోమంది ఆస్తులు పోగు చేసుకుంటున్నారు అలాంటిది మహేష్ బాబు మాత్రం ఎంతో గొప్ప మనసు చాటుకుంటూ ఎంతోమందికి సహాయ సహకారాలను అందిస్తున్నారు. గౌతమ్ (Gautham ) పుట్టిన తర్వాతనే ట్రస్ట్ పెట్టాలని ఆలోచన వచ్చిందని మహేష్ బాబు వెల్లడించారు. గౌతమ్ నెలలు నిండకముందే పుట్టడంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని, గౌతమ్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేశామని అయితే డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి అనే ఆలోచన నుంచే ఈ ట్రస్ట్ ప్రారంభమైందని మహేష్ బాబు పలు సందర్భాలలో తెలియజేశారు. ఏది ఏమైనా ఒక గొప్ప ఆలోచనతో మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు పునర్జన్మను ప్రసాదిస్తూ.. నిజ జీవితంలో కూడా అందరి మన్ననలు పొందుతున్నారు.
Also Read: Nara Rohith: నా ఇంటి పేరే నాకు సమస్య… నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు!