E-Paper
Advertisement

OTT Movie : పెళ్ళాం మిస్సింగ్… పక్కింటోడిపై కన్ను… ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులోనే

OTT Movie : పెళ్ళాం మిస్సింగ్… పక్కింటోడిపై కన్ను… ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులోనే
Advertisement

OTT Movie : ఓటీటీలోకి థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో సైకలాజికల్ థ్రిల్లర్ లు మరింత ఇంటెన్స్ గా ఉంటున్నాయి. ఊహించని ట్విస్టులలతో మతి పోగొడుతుంటాయి. రీసెంట్ గా ఓటీటీలో అడుగు పెట్టిన ఒక హాలీవుడ్ సిరీస్ మైండ్ గేమ్స్ తో సస్పెన్స్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రతి మనిషిలో ఒక బీస్ట్ ఉంటుందని ఇందులో చూపించడానికి ట్రై చేశాడు దర్శకుడు. ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరిగే ఈ మైండ్ గేమ్స్ చివరికి రివేంజ్ మోడ్ లోకి వెళ్తుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఇది బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘ది బీస్ట్ ఇన్ మీ’ (The Beast in Me) 2025లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మినీ సిరీస్. ఇది గేబ్ రాటర్ క్రియేట్ చేసిన సిరీస్. అంటోనియో కాంపోస్ దర్శకత్వం వహించగా, లీడ్ రోల్స్ లో క్లైర్ డాన్స్ (అగ్గీ విగ్స్), మాథ్యూ రైస్ (నైల్ జార్విస్ ) నటించారు.
నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా 2025 నవంబర్ 13న అన్ని 8 ఎపిసోడ్‌లు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు ముప్పావు గంట పాటు ఉంటుంది. ఇది ఐయండిబిలో 7.5/10 రేటింగ్ ని కూడా పొందింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అగ్గీ విగ్స్ అనే ప్రముఖ రచయిత్రి తన ఒక్కగానొక్క కొడుకు మరణం వల్ల బాధలో మునిగి, పబ్లిక్ లైఫ్ వదిలేసి ఒంటరిగా జీవిస్తుంటుంది. కొంత కాలం తరువాత ఆమె మళ్లీ రాయడం మొదలుపెట్టాలని అనుకుంటుంది. ఒక కొత్త ఇంటికి మారిన తర్వాత రచనలు మొదలు పెడుతుంది. ఈ సమయంలో పక్కింట్లో ఒక బిజినెస్‌మెన్ నైల్ అతని భార్య మ్యాడిసన్ పరిచయమవుతారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా నైల్ మిస్సింగ్ అవుతుంది. పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తారు. అప్పటి నుంచి అగ్గీకి నైల్ మాటలు, బిహేవియర్ అనుమానస్పదంగా కనిపిస్తాయి. అతడు భార్యను చంపినట్లు భావిస్తుంది. ఆమె తన రైటింగ్ స్కిల్స్, ఇన్‌వెస్టిగేటివ్ మైండ్ ఉపయోగించి నైల్ ఫ్రెండ్స్ నుంచి సీక్రెట్స్ బయటపెట్టడం మొదలు పెడుతుంది.

Read Also : అరుదైన పాండాను కిడ్నాప్ కి అంతర్జాతీయ ముఠా ప్లాన్… సైలెంట్ గా ఓటీటీలోకి జాకీ చాన్ మూవీ

Advertisement

ఇద్దరి మధ్య మైండ్ గేమ్స్, మానిప్యులేషన్, టెన్షన్ ఎక్కువవుతూ వెళ్తుంది. నైల్ కూడా అగ్గీ గతంలోని సీక్రెట్స్ కొడుకు మరణం గురించి తెలుసుకుని ఆమెను బ్లాక్‌ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దీంతో అగ్గీ లోపల ఉండే బీస్ట్ బయటపడుతుంది. కోపంతో రివెంజ్ మోడ్ లోకి వెళ్తుంది. చివరి ఎపిసోడ్‌లలో మ్యాడిసన్ మిస్సింగ్ వెనక నిజం బయటపడుతుంది. మ్యాడిసన్ మిస్సింగ్ వెనుక కారణం ఏమిటి ? ఆమెను నైల్ చంపేశాడా ? అగ్గీ, నైల్ ల మైండ్ గెమ్ కి ముగింపు వస్తుందా ? అనే ప్రశ్నలకు సామాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×