E-Paper
Advertisement

OTT Movie : అమ్మో బొమ్మ… ముట్టుకుంటే మసే… కలలోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : అమ్మో బొమ్మ… ముట్టుకుంటే మసే… కలలోనూ వెంటాడే హర్రర్ స్టోరీ
Advertisement

OTT Movie : హారర్ ప్రియులను భయపెట్టడానికి కొత్త కొత్త స్టోరీలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. దెయ్యాలకు కొత్త రూపాలను ఇస్తూ, ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఈ జానర్ ని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమా ఒక బొమ్మ చుట్టూ తిరుగుతుంది. ఈ బొమ్మలో ఒక ఆత్మ ఉంటుంది. అది ఎక్కడ ఉంటే అక్కడ వినాశనమే జరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ది కమ్యూనియన్ గర్ల్’ (The communion girl) 2022లో విడుదలైన స్పానిష్ హారర్ చిత్రం. ఇది విక్టర్ గార్సియా దర్శకత్వంలో రూపొందింది. ఇందులో కార్లా కాంప్రా (సారా), ఐనా క్వినోన్స్ (రెబె), మార్క్ సోలర్ (పెడ్రో), కార్లోస్ ఒవియడో (చివో) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 39 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 5.2/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 10న స్పెయిన్‌లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫండాంగో ఎట్ హోమ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

1987 స్పెయిన్‌లోని టార్రగోనా ప్రాంతంలోని ఒక చిన్న ఊరిలో ఈ కథ జరుగుతుంది. సారా అనే యువతి ఈ ఊరికి కొత్తగా వచ్చిన అమ్మాయి. ఆమె తన స్నేహితురాలు రెబెతో కలిసి సరదాగా గడపడానికి ఒక రాత్రి నైట్‌క్లబ్‌కి వెళ్తుంది. వీళ్ళు డ్రగ్స్ తీసుకుని, పార్టీ అయిపోయాక ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, రోడ్డు మీద ఒక బొమ్మను చూస్తారు. ఈ బొమ్మను తీసుకున్న తర్వాత వారి జీవితాలు నరకంగా మారతాయి.ఈ బొమ్మ యజమాని అయిన మారిసోల్ అనే అమ్మాయి గురించి స్థానికంగా చాలా రూమర్స్ ఉన్నాయి. మారిసోల్ ఒక రోజు హఠాత్తుగా అదృశ్యమై, ఆ తర్వాత ఆమె ఆత్మ శాపంగా మారి, బొమ్మను తాకిన వారిని వెంటాడి చంపుతుంది. ఇప్పుడు సారా, రెబె, వారి స్నేహితులు పెడ్రో, చివోలపై ఈ శాపం ప్రభావం చూపిస్తుంది. వారందరికీ శరీరంపై రాష్‌లు కనిపిస్తాయి. వీళ్ళు ఒక భయంకరమైన ఆత్మను చూడటం ప్రారంభిస్తారు. సారా ఈ శాపం నుండి బయటపడడానికి, మారిసోల్ గతంలో ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

సెకండ్ హాఫ్‌లో సారా, రెబె ఈ డాల్ వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టడానికి ట్రై చేస్తారు. ఈ డాల్ మారిసోల్ అనే అమ్మాయిదని, ఆమె చిన్నప్పుడు మిస్టీరియస్‌గా డిసప్పియర్ అయిందని తెలుస్తుంది. ఈ గోస్ట్ అమ్మాయి తన మీద జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ డాల్‌ని ఉపయోగిస్తుందని తెలుసుకుంటారు. సారా ఈ కర్స్‌ని బ్రేక్ చేయడానికి ఫాదర్ మాన్యుయల్, రెమెడియోస్ లాంటి వాళ్ల సహాయం తీసుకుంటుంది. కానీ ఈ గోస్ట్ వాళ్లని కూడా వదలదు. క్లైమాక్స్‌లో మారిసోల్ గతంలో జరిగిన ఒక షాకింగ్ ట్రాజెడీ బయటపడుతుంది. సారా ఈ కర్స్‌ని స్టాప్ చేయడానికి ఒక టన్నెల్‌లోకి వెళ్తుంది. అక్కడ భయంకరమైన విజన్స్ ఫేస్ చేస్తుంది. కథ ఓపెన్ ఎండింగ్‌తో ముగుస్తుంది. ఇది సీక్వెల్‌కి దారితీసేలా ఉంటుంది. మారిసోల్ గతం ఏమిటి ? సారా, ఆమె స్నేహితులు ఈ శాపం నుంచి తప్పించుకుంటారా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : సీరియల్ కిల్లర్ వరుస హత్యలు… పోలీస్ భార్యను కూడా వదలకుండా… కళ్ళు లేని ఖాకీ రఫ్ఫా రఫ్ఫా

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×