CM Revanthreddy: ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడానికి శుక్రవారం వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలతో సమావేశం కానున్నారు.శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన తీరికలేని షెడ్యూల్‌తో బిజీ అయ్యారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి.. న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీని తాజ్ ప్యాలెస్ లో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడుల గురించి, ఆ ప్రాంతంలో ఉన్న అవకాశాలను వివరించనున్నారు. అమెరికా అభివృద్ధికి తెలుగు ప్రవాసులు ఎలా దోహద పడుతున్నారో ఆయన వివరించనున్నారు.
అమెరికా కంపెనీలకు తెలంగాణలో వ్యాపార అవకాశాలు గురించి వివరించనున్నారు సీఎం. ఇదే క్రమంలో ఫ్యూచర్ సిటీ గురించి తెలియజేనున్నారు. ఆ తర్వాత మీడియా హౌస్ వార్షిక ఫోరమ్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై దృష్టి సారించనున్నారు.
అమెజాన్, కార్ల్స్‌బర్గ్, కార్లైల్, గోద్రేజ్, ఉబర్ వంటి కంపెనీల సీనియర్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO బోర్జ్ బ్రెండేతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈ టూర్‌లో పలువురు కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు.
ALSO READ: ఎవరు ఎక్కడైనా బతకొచ్చు.. మార్వాడీ గో బ్యాక్ పై మైనంపల్లి రియాక్షన్
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించనున్నారు. శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఉదయం నుంచి వరుసగా షెడ్యూల్ ఉండడంతో వీలు కుదిరితే కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశముందని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్..
రేపు ఉ.11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో భేటీ
ఉ. 11:30కు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరమ్‌లో ప్రసంగం
మ. 12 గంటలకు అమెజాన్, కార్ల్స్ బర్గ్, కార్లైల్, గోద్రెజ్, ఉబెర్ కంపెనీల… pic.twitter.com/eUdvlI1XZV
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2025