BigTV English
Advertisement

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస హత్యలు… పోలీస్ భార్యను కూడా వదలకుండా… కళ్ళు లేని ఖాకీ రఫ్ఫా రఫ్ఫా

OTT Movie : సీరియల్ కిల్లర్ వరుస హత్యలు… పోలీస్ భార్యను కూడా వదలకుండా… కళ్ళు లేని ఖాకీ రఫ్ఫా రఫ్ఫా

OTT Movie : సీరియల్ కిల్లర్ ఇన్వెస్టిగేషన్ థీమ్‌తో తెరకెక్కుతున్న సినిమాలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలలో వచ్చే ట్విస్టులకు ప్రేక్షకులు కూడా చిల్ అవుతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రీసెంట్ గా ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ చిత్రం హంటర్ హంటెడ్ అయ్యే థీమ్‌ను హైలైట్ గా చూపిస్తుంది. ఇందులో ఒక పోలీస్ అధికారి, తన భార్య చావుకి కారణమైన కిల్లర్ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో క్లైమాక్స్ వరకు ఈ సినిమా ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


కథ ఏమిటంటే

ఇంద్ర ఒక సస్పెండెడ్ పోలీసు అధికారి. తన భార్య మరణంతో బాధపడుతూ, ఆల్కహాలిక్ అయిపోతాడు. దీని వల్ల అతను సస్పెన్షన్ లో ఉంటాడు. అతని కంటికి తగిలిన గాయం వల్ల కంటి చూపు కూడా మసకబారుతుంది. అయినప్పటికీ తన భార్య హత్యకు సీరియల్ కిల్లర్ కారణమని అనుమానిస్తాడు. టౌన్‌ను టెర్రరైజ్ చేస్తున్న ఆ కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రైవేట్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఇంద్ర తన సన్నిహితులైన మెహ్రీన్, అనికా, కల్యాణ్ సహాయంతో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు.  ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్‌లు, టర్న్స్‌ల మధ్య ఇంద్ర పోరాడుతాడు.

ఈ చిత్రం ఇంద్ర స్ట్రగుల్, సీరియల్ కిల్లర్ హంట్ తో నడుస్తుంది. ఇక రివేంజ్ డ్రామాను లేయర్స్‌తో చూపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఇంద్ర ఇన్వెస్టిగేషన్ తీవ్రమవుతుంది. ఇంద్ర భార్య మరణం, కిల్లర్ మధ్య కనెక్షన్ బయటపడుతుంది. అది సీరియల్ కిల్లర్ డార్క్ పాస్ట్ కాన్సెక్వెన్స్ అని తెలుస్తుంది. క్లైమాక్స్‌లో ఇంద్ర కిల్లర్‌తో తలపడతాడు. ఈ సినిమా ట్విస్ట్‌లు కాన్ఫ్రంటేషన్స్‌తో ముగుస్తుంది. కిల్లర్ ఎవరు ? ఇంద్ర భార్యను ఎందుకు చంపాడు ? కిల్లర్ పై ఇంద్ర రివెంజ్ తీర్చుకున్నాడా ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ఇంద్ర’ (Indra)  2025లో విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. సబరిష్ నంద దర్శకత్వంలో జాఫర్ సదీఖ్, ఇర్ఫాన్ మాలిక్ దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో వసంత్ రవి (ఇంద్ర, బ్లైండ్ ఎక్స్-కాప్), మెహ్రీన్ పిర్జాద (మెహ్రీన్), సునీల్, అనికా సురేంద్రన్ (అనికా), కల్యాణ్ (కల్యాణ్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 8 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2025 ఆగస్టు 22న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : మెంటల్ మాస్ ఫ్యామిలీ ఇది… తెలియక గెలికి మరీ తన్నించుకునే పక్కింటోళ్లు… కిర్రాక్ కుటుంబం మావా

Related News

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

OTT Movie : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : ఇన్ సెక్యూర్ అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో… కితకితలు పెట్టే తమిళ కామెడీ మూవీ

OTT Movie : అబ్బాయిలతో పని కానిచ్చి చంపే లేడీ సైకో… ఏకంగా 8 మంది హత్య… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

Big Stories

×