E-Paper
Advertisement

OTT Movie : కూతుర్ని ప్రేమించాడాని ప్రైవేట్ పార్ట్ కట్ … ఉంపెడు గత్తెగా మారే ప్రియురాలు .. ఇదెక్కడి అరాచకంరా అయ్యా

OTT Movie : కూతుర్ని ప్రేమించాడాని ప్రైవేట్ పార్ట్ కట్ … ఉంపెడు గత్తెగా మారే ప్రియురాలు .. ఇదెక్కడి అరాచకంరా అయ్యా
Advertisement

OTT Movie : హిస్టారికల్ సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలలో స్టోరీ ఎక్కువగా రాజ కుటుంబం నుంచి తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలు ప్రేక్షకులందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ మూవీలో కుట్ర, కుతంత్రం, శృంగారం అన్ని కలిపి ఉంటాయి. ఈ కొరియన్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…

రెండు ఓటీటీ లలో

Advertisement

ఈ చారిత్రక శృంగార థ్రిల్లర్ మూవీ పేరు ‘ది కన్‌క్యూబిన్’ (The Concubine). 2012 లో వచ్చిన ఈ మూవీకి కిమ్ డే-సెయుంగ్ దర్శకత్వం వహించారు. జోసెయోన్ రాజవంశం నేపథ్యంలో ఈ స్టోరీ హ్వా-యియోన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), ఆపిల్ టివి (Apple TV) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులో విడుదల కాలేదు. కానీ ఇది కొరియన్ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

హ్వా-యియోన్ ఒక ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి . క్వాన్-యూ అనే ఒక పెదవాడి ప్రేమలో ఉంటుంది. అయితే రాజు ఆమె అందాన్ని చూసి తన ఉంపుడుగత్తెగా చేసుకోవాలని కోరుకుంటాడు. హ్వా-యియోన్ తన ప్రేమికుడు క్వాన్-యూని రక్షించడానికి, రాజ ఆస్థానంలోకి వెళ్లడానికి అంగీకరిస్తుంది. అయినాకూడా ఆమె ప్రేమికుడి మగతనాన్ని కోసేస్తారు సైనికులు. ఇదంతా హ్వా-యియోన్ తండ్రి కనుసన్నల్లో జరుగుతుంది.    ఆ తరువాత హ్వా-యియోన్ రాజుకు ఉంపుడుగత్తె గా ఉండి, ఒక కుమారుడిని కని రాణిగా మారుతుంది. అక్కడ ఉంపుడుగత్తెలకు మగసంతానం కలిగితే రాణి హోదా వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, రాజు ఒక వింత వ్యాధితో మరణిస్తాడు. రాజు సవతి తల్లి (పార్క్ జి-యంగ్) తన కుమారుడు సంగ్-వాన్‌ను రాజుగా చేస్తుంది. రాజును తన ఆధీనంలో పెట్టుకుని, తల్లిగా అధికారాన్ని చేపడుతుంది. సంగ్-వాన్ కూడా హ్వా-యియోన్‌పై మోహంతో ఉంటాడు. కానీ ఆమె అతని ప్రేమను తిరస్కరిస్తుంది.

ఈ సమయంలో, హ్వా-యియోన్ తన మాజీ ప్రేమికుడు క్వాన్-యూని రాజభవనంలో నపుంసకుడిగా చూస్తుంది. క్వాన్-యూ గతంలో హ్వా-యియోన్ తండ్రి వల్ల మగతనం కోల్పోయాక ఆమెపై కోపంతో ఉంటాడు. రాజ ఆస్థానంలో రాజకీయ కుట్రలు, అధికార పోరాటాలు, వ్యక్తిగత ప్రతీకారాలు తీవ్రమవుతాయి. హ్వా-యియోన్ తన కుమారుడిని, తన స్థానాన్ని రక్షించుకోవడానికి క్రమంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సంగ్-వాన్ తన తల్లి ఆధిపత్యం మధ్య చిక్కుకుంటాడు. హ్వా-యియోన్ తన శత్రువులను అంతం చేసి, తన కుమారుడిని రాజుగా చేయడానికి తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది. చివరికి హ్వా-యియోన్ తన కొడుకుని రాజును చేస్తుందా ? ఆ పద్మ వ్యూహంలో చిక్కు కుంటుందా ? నపుంసకుడిగా మారిన ప్రియుడు ఏం చేస్తాడు ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ కొరియన్  సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : గేమ్ ఆడుతూ హత్యలు చేసే సైకో కిల్లర్… క్లూ వదిలి చుక్కలు చూపిస్తూ… మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×