RCB VS PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament )
భాగంగా… ఇప్పటివరకు చాలా కీలకమైన మ్యాచులు జరిగాయి. ఇక ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ 34వ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ (Royal Challengers Bangalore vs Punjab Kings ) జట్లు తలపడబోతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. సొంతగడ్డ అయిన చిన్నస్వామి స్టేడియం వేదికగా (Chinnaswamy Stadium ).. ఈ మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ( Rain) తీవ్ర అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలోనే టాస్ ప్రక్రియ తో పాటు మ్యాచ్ కూడా ఆలస్యమైంది.
టాస్ గెలిచి బౌలింగ్ చేయనున్న పంజాబ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరుగుతున్న రాయల్ చాలెంజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం పడిన నేపథ్యంలో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇది పంజాబ్ జట్టుకు బాగా అడ్వాంటేజ్ కానుంది.
14 ఓవర్లకే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్
చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో…. ఈ మ్యాచును 14 ఓవర్లకే కుదించారు. అంటే పవర్ ప్లే కేవలం 4 ఓవర్లు మాత్రమే ఉంటుంది. ఆరు ఓవర్లు ఉండాల్సిన పవర్ ప్లే నాలుగు ఓవర్లకు కుదిస్తారు. ఇది ఇలా ఉండగా… 14 ఓవర్ల మ్యాచ్ లో మొత్తం నలుగురు బౌలర్లు.. 3 ఓవర్ల చొప్పున బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. మరో రెండు ఓవర్లు మరో బౌలర్ వేయాల్సి ఉంటుంది. అలా 14 ఓవర్ల కోటా నింపాలి. క్రికెట్ రూల్స్ ప్రకారం… వర్షం పడి ఓవర్లు కుదిస్తే… ఇలాగే వేయాల్సి ఉంటుంది. కాదని ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే… చర్యలు కచ్చితంగా ఉంటాయి. అటు రెండు జట్ల మధ్య రికార్డులు పరిశీలిస్తే… పంజాబ్ కింగ్స్ కు మంచి రికార్డు ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కంటే ఒక మ్యాచ్ ఎక్కువగానే గెలిచి ఉంది పంజాబ్ కింగ్స్. కానీ ప్రస్తుత ఫామ్ ప్రకారం మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బలంగా ఉంది. పాయింట్స్ టేబుల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడవ స్థానంలో ఉంటే నాలుగో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉంది.
RCB VS PBKS జట్ల వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, యశ్ దయాల్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, నేహాల్ వధేరా, శ్రేయాస్ అయ్యర్ (సి), శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (w), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్