OTT Movie : ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చివరి వరకు ప్రేక్షకులకి ఊపిరి ఊపిరి ఆడకుండా చేస్తాయి. ఈ డిటెక్టివ్ సినిమాలను తెరకెక్కించే విధానం ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మూవీలో ఒక గేమ్ ఆధారంగా హత్యలు చేస్తుంటాడు. ఒక సైకో కిల్లర్. ఈ సినిమా చివరి వరకు సస్పెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ పేరు’హ్యాంగ్‌మాన్’ (Hangman). 2017 లో వచ్చిన ఈ మూవీకి జానీ మార్టిన్ దర్శకత్వం వహించారు. దీనిని చార్లెస్ హట్టింగర్, మైఖేల్ కైసీ రచించారు. ఈ సినిమాలో అల్ పాసినో, కార్ల్ అర్బన్, జో ఆండర్సన్, సారా షాహి మరియు బ్రిటనీ స్నో వంటి నటులు నటించారు. ఇందులో పిల్లల గేమ్ హ్యాంగ్‌మ్యాన్ ను ఉపయోగించి, ఒక సీరియల్ కిల్లర్ హత్యలు చేస్తుంటాడు. అతన్ని గుర్తించడానికి ప్రయత్నించే డిటెక్టివ్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఇది డిసెంబర్ 22, 2017న విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
డిటెక్టివ్ రే ఆర్చర్, విల్ రుయినీ ఇద్దరూ కలసి ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ కిల్లర్ మనుషుల్ని హ్యాంగ్‌మ్యాన్ అనే గేమ్ ఆధారంగా హత్యలు చేస్తుంటాడు. ప్రతి హత్య స్థలంలో ఒక అక్షరాన్ని వదిలివేస్తూ, పోలీసులకు సవాల్ విసురుతాడు. రే, ఇటీవల రిటైర్‌మెంట్ నుండి తిరిగి మళ్ళీ ఈ కేసును సాల్వ్ చేయడానికి వస్తాడు. డిటెక్టివ్ రే, విల్ ఈ కేసును ఛేదించడానికి, జర్నలిస్ట్ క్రిస్టీ డేవిస్ సహాయంతో కలిసి పనిచేస్తారు. వారు కేసును లోతుగా తవ్వుతున్నప్పుడు, కిల్లర్ చేస్తున్న హత్యలు రే గతంతో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ కిల్లర్ డిటెక్టివ్ రేను గేమ్‌లో భాగంగా చేస్తూ, అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అయితే డిటెక్టివ్ రే, విల్ ఆ కిల్లర్ సందేశాన్ని డీకోడ్ చేస్తూ, తదుపరి హత్యను ఆపడానికి ప్రయత్నిస్తారు.
ఈ సినిమాలో రే వ్యక్తిగత పోరాటాలు కూడా ఉంటాయి. కిల్లర్ మానసిక గేమ్‌లు ఆడి అందరినీ ముప్ప తిప్పలు పెడతాడు. వీళ్ళంతా హ్యాంగ్‌మ్యాన్ పజిల్‌ను పరిష్కరించడంపై దృష్టి సారిస్తారు. ఈ స్టోరీ అంతా ఒక సీరియల్ కిల్లర్ హ్యాంగ్‌మ్యాన్ గేమ్‌తో హత్యలు చేస్తుంటే, ఇద్దరు డిటెక్టివ్ లు ఒక జర్నలిస్ట్ తో కలసి అతన్ని ఆపడానికి ట్రై చేస్తుంటారు. చివరికి ఆ సీరియల్ కిల్లర్‌ను వీళ్ళు పట్టుకుంటారా ? హ్యాంగ్‌మ్యాన్ గేమ్ తోనే కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.