GST on UPI payments: యూపీఐ చెల్లింపులపై కేంద్రం జీఎస్టీ విధించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, తదితర యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధించనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రూ.2000 కంటే ఎక్కువ డబ్బులు లావాదేవీలు చేస్తే 18 శాతం మేర జీఎస్టీ విధించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దేశంలో యూపీఐ చెల్లింపులపై 18 శాతం జీఎస్టీ విధించనున్నారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇక నుంచి రూ.2వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ పై జీఎస్టీ విధించబోతున్నారన్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ రియాక్ట్ అయ్యింది.
కొన్ని నేషనల్ మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రసారం చేయగా అవన్నీ అబద్దాలని.. నిరాధర ఆరోపణలు అని కొట్టిపారేసింది. యూపీఐ పేమెంట్స్ పై జీఎస్టీ విధించే ఆలోచనలు ఏవీ లేవని.. చిన్న చిన్న చెల్లింపులపై ఎలాంటి టాక్స్ లు విధించేది లేదని ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది.
Also Read: ADA Recruitment: బీటెక్ అర్హతతో 133 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే భారీ జీతం.. దరఖాస్తుకు 3 రోజులే గడువు