E-Paper
Advertisement

OTT Movie : పొలిటికల్ మర్డర్ మిస్టరీ… ఇన్వెస్టిగేషన్ లో ట్విస్టులే ట్విస్టులు… మతిపోగొట్టే సీన్స్

OTT Movie : పొలిటికల్ మర్డర్ మిస్టరీ… ఇన్వెస్టిగేషన్ లో ట్విస్టులే ట్విస్టులు… మతిపోగొట్టే సీన్స్
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక థ్రిల్లర్ సిరీస్ మంచి వ్యూస్ తో ట్రెండింగ్ అవుతోంది. ఈ హాలీవుడ్ సిరీస్ తెలుగులో వచ్చిన ‘అతడు’ సినిమాని గుర్తు చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక డేంజరస్ కిల్లర్, ఒక సూపర్ స్పై మధ్య యూరప్ అంతా చేజ్ చేజింగ్ జరుగుతుంది. ఎవరు గెలుస్తారో చివరి సెకను వరకు తెలియదు! ఒక్కసారి మొదలెడితే కుర్చీ నుంచి కదలలేరు. ఒక పొలిటికల్ మర్డర్ తరువాత స్టోరీ ఊపందుకుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2024లో విడుదలైన బ్రిటిష్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ది డే ఆఫ్ ది జాకల్’. ఇది ఫ్రెడరిక్ ఫార్సైత్ 1971 నవల మీద ఆధారపడిన మోడరన్ అడాప్టేషన్. రోనాన్ బెనెట్ దీనిని క్రియేట్ చేశారు. ఈ సిరీస్ 10 ఎపిసోడ్స్‌తో 2024 నవంబర్ 7 నుంచి పీకాక్, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఎడ్డీ రెడ్మెయిన్ (ది జాకల్), లషానా లించ్ (బయాన్కా) లీడ్ రోల్స్ లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జాకల్ అనే ఒక డేంజరస్ కిల్లర్, డబ్బులు ఇస్తే ఎవర్నైనా చంపేస్తాడు. ఎలా కనిపెట్టాలో ఎవరికీ తెలియదు. ముఖం మార్చుకుంటాడు, పేరు మార్చుకుంటాడు, ఒక్క సెకనులో గాయబ్ అవుతాడు. ఇతను ఒక పెద్ద పొలిటికల్ మ్యాన్‌ని చంపేస్తాడు. ఆ కేస్ బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ MI6 ఆఫీసర్ బయాన్కాకి వస్తుంది. బయాన్కా గన్ ఎక్స్‌పర్ట్, చాలా తెలివైనది. జాకల్‌ని పట్టుకోవాలని ప్రాణం పెట్టి హంట్ మొదలెడుతుంది. జాకల్ ఇంట్లో భార్య, కొడుకుతో స్విట్జర్లాండ్ అల్ప్స్‌లో దాక్కుంటాడు. అతని లైఫ్ రెండు ప్రపంచాలు: ఇంట్లో లవింగ్ హస్బెండ్ & ఫాదర్, బయట కోల్డ్ బ్లడెడ్ కిల్లర్.

Read Also : ఓటీటీలో నలుగురమ్మాయిల రచ్చ… పోస్టర్ లోనే మ్యాటర్… ఇలాంటి సిరీస్ తో నిద్ర కరువే మావా

Advertisement

బయాన్కా జాకల్‌ని ట్రాక్ చేస్తూ వస్తుంది. జాకల్ తెలివిగా ఎస్కేప్ అవుతూ ఉంటాడు. ఇద్దరూ ఒకరినొకరు చాలా క్లోజ్‌గా వచ్చేస్తారు. ఒకరు చంపాలని, ఒకరు పట్టుకోవాలని రేసు చాలా క్రేజీగా నడుస్తుంది. ఫైనల్ ఫైట్‌లో ఇద్దరూ ఒకరినొకరు గన్ పాయింట్‌లో పెట్టుకుంటారు. క్లైమాక్స్ మరింత రసవత్తరంగా ఉంటుంది. ఫైనల్ ఫైట్‌లో అసలేం జరుగుతుంది ? జాకల్ ని బయాన్కా పట్టుకుంటుందా ? బయాన్కా కూడా జాకల్ చేతిలో మర్డర్ అవుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×