E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలో నలుగురమ్మాయిల రచ్చ… పోస్టర్ లోనే మ్యాటర్… ఇలాంటి సిరీస్ తో నిద్ర కరువే మావా

OTT Movie : ఓటీటీలో నలుగురమ్మాయిల రచ్చ… పోస్టర్ లోనే మ్యాటర్… ఇలాంటి సిరీస్ తో నిద్ర కరువే మావా
Advertisement

OTT Movie : ఈ మధ్య ఇండియన్ సిరీస్ లలో బో*ల్డ్ కంటెంట్ మితిమీరి ఉంటోంది. ఇలాంటి సిరీస్ లను ఒంటరిగానే చూడాల్సి వస్తోంది. అయితే ఇలాంటి బో*ల్డ్ కంటెంట్ తో వివాదాల్లో నిలిచిన సిరీస్ ‘Four More Shots Please’. నలుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ సిరీస్ లో మతిపోగొట్టే సీన్స్ ఉన్నాయి. దీనిని ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ‘సెక్స్ అండ్ ది సిటీ’ కి ఇండియన్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు. గత మూడు సీజన్లలో హాట్ సీన్స్ హీటు పెంచాయి. ఈ సారి అంతకు మించి అన్నట్లు ఉండబోతోందని తెలుస్తోంది. ఇది ఇండియన్ సిరీస్ లలో అత్యంత బో*ల్డ్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచిపోయింది. మరి కొద్ది రోజుల్లో డిజిటల్ ఆడియన్స్ ని పలకరించబోతోంది. ఇది ఏ ఓటీటీలోకి వస్తుంది ? ఎప్పుడు వస్తుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే

‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ (Four More Shots Please) అనే ఈ బోల్డ్ వెబ్ సిరీస్ 2019 నుంచి ఇప్పటి వరకు మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు చివరిదైన నాలుగో సీజన్ కూడా డిసెంబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ కూడా చేశారు. అంతేకాకుండా ఒక హాట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తేనే అసలు మ్యాటర్ ఎలా ఉంటుందో తెలిసిపోతోంది. ఈ సిరీస్‌ను రంగితా ప్రీతిష్ నంది రూపొందించారు. సీజన్ 1కు అనూ మీనన్, సీజన్ 2కు నుపూర్ ఆస్థానా, సీజన్ 3కి జోయితా పట్పటియా దర్శకులుగా ఉన్నారు. ఈ సిరీస్ ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ కామెడీ సిరీస్’ విభాగంలో నామినేట్ అయింది.

Advertisement

Read Also : జాబ్ కోసం బాస్ తో యవ్వారం… ఆ సీన్స్ తో చలికాలంలో హీటు పుట్టించే సినిమా

స్టోరీ ఏమిటంటే

ఈ సిరీస్ దామిని, అంజన, ఉమంగ్, సిద్ధి అనే నలుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు తమకు నచ్చినట్లుగా బతకాలను అనుకుంటూ ఉంటారు. ముంబై మహానగరంలో తమకంటూ ఒక గుర్తింపు కోసం పోరాడుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటారు. ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు. సీజన్ 1లో దామిని తన బాస్‌తో అఫైర్, అంజనా డైవోర్స్ తర్వాత కొత్త రిలేషన్, ఉమంగ్ తన బయిసెక్షువల్ ఐడెంటిటీ స్ట్రగుల్, సిద్ధి తన వర్జినిటీ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. సీజన్ 2లో దామిని ప్రెగ్నెంట్ అవుతుంది, అంజనా తన కూతురితో బాండ్ పెంచుకుంటుంది, ఉమంగ్ తన గర్ల్‌ఫ్రెండ్ సమీరాతో రిలేషన్ సీరియస్ అవుతుంది. సిద్ధి స్టాండప్ కరీర్ స్టార్ట్ చేస్తుంది. సీజన్ 3లో పాండమిక్ బ్యాక్‌డ్రాప్‌లో వాళ్లు లాక్‌డౌన్ ఫేస్ చేస్తారు. చివరికి నలుగురూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని లైఫ్‌లో ముందుకు సాగిపోతారు. లైఫ్ ఎంత కష్టమైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే సరిపోతుందని ఈ సిరీస్ చూపిస్తుంది. ఇక నాలుగో సీజన్ లో బోల్డ్ సీన్స్ ను ఆడియన్స్ కి చూపించడానికి కొంత సమయమే మిగిలి ఉంది.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×