E-Paper
Advertisement

In-Call Scam Alert: సైబర్ దొంగల గేమ్ ఓవర్.. పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ వచ్చేసింది

In-Call Scam Alert: సైబర్ దొంగల గేమ్ ఓవర్.. పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ వచ్చేసింది
Advertisement

In-Call Scam Alert| భారత్‌లో రోజూ లక్షల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫ్రాడ్ కాల్స్, స్పామ్ కాల్స్ బారిన పడి మోసపోతున్నారు. ఈ తీవ్ర సమస్యకు పరిష్కారంగా ఒక పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ తీసుకొచ్చింది గూగుల్. ఇది ఒక అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్ తెచ్చింది. దీని పేరు “ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్”. ఈ ఫీచర్ సైబర్ మోసగాళ్ల నుంచి మీ డబ్బును 100 శాతం కాపాడుతుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో చూద్దాం!

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది?

మీకు కొత్త నెంబర్ లేదా తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే ఈ ఫీచర్ ఆటోమాటిక్‌గా ఆన్ అవుతుంది. కాల్‌లో ఉండగానే మీరు ఏదైనా బ్యాంక్ యాప్ లేదా పేమెంట్ యాప్ (Google Pay, Paytm, PhonePe) ఓపెన్ చేయగానే స్క్రీన్‌పై పెద్ద వార్నింగ్ వస్తుంది – “జాగ్రత్త! ఇది మోసం కావచ్చు!” అని రాసి ఉంటుంది.

రెండో సారి ఓపెన్ చేసినా లేదా పొరపాటున ఓపెన్ చేసినా..

Advertisement

మొదటి వార్నింగ్‌ను కొందరు పట్టించుకోరు. మళ్లీ యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే… ఫోన్ 30 సెకన్ల పాటు లాక్ అయిపోతుంది! ఆ 30 సెకన్లలో మీరు ఆలోచించే అవకాశం వస్తుంది – “నిజంగానే బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందా? లేదా మోసమా?” అని మీరు ఆ సమయంలో పరిశీలించాలి. ఈ చిన్న ఆలస్యం వల్ల మీ బ్యాంక్ లో ఉండే డబ్బును ఎవరూ దోచుకోకుండా కాపాడుతుంది.

30 సెకన్ల ఆలస్యం ఎందుకు ముఖ్యం?

మోసగాళ్లు ఎప్పుడూ “త్వరగా చెయ్… అకౌంట్ లాక్ అయిపోతుంది… ఇప్పుడే డబ్బు పంపు” అని ఫోన్ లో మాట్లాడుతూ ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడిని ఈ ఫీచర్ 30 సెకన్లు పూర్తిగా ఆపేస్తుంది. ఆ సమయంలో మీరు కాల్ కట్ చేసి సురక్షితంగా ఉండవచ్చు.

ఏ యాప్స్‌తో ఈ ఫీచర్ పని చేస్తుంది?

Advertisement

ఇప్పటికే గూగుల్ పే, పేటిఎం, Navi వంటి పెద్ద పేమెంట్ యాప్స్‌తో ఈ ఫీచర్ లింక్ అయింది. త్వరలో ఫోన్‌పె, భారత్‌పే, లాంటి మిగతా యాప్స్ కూడా ఈ ఫీచర్ తో లింక్ అవుతాయి. ప్రస్తుతం ఇది ఇంకా పైలట్ ప్రాజెక్ట్‌గా ఉంది, కానీ చాలా బాగా పని చేస్తోంది.

మీ ఫోన్‌లో ఈ ఫీచర్ రావాలంటే ఏం చేయాలి?

మీ ఫోన్ ఆండ్రాయిడ్ 11 లేదా అంతకంటే కొత్త వెర్షన్‌లో ఉండాలి. పాత ఫోన్ ఉంటే ఈ ఫీచర్ పని చేయదు. ఇప్పుడే సెట్టింగ్స్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోండి. ఈ ఫీచర్ ప్రస్తుతం కేవలం భారత్‌లోనే లభిస్తోంది.

మోసగాళ్లు సాధారణంగా ఇలా చేస్తారు

తాము బ్యాంక్ సిబ్బంది అని ఫోన్ చేసి.. “సర్ మీ అకౌంట్‌లో రూ.50 వేలు డిపాజిట్ అయింది… త్వరగా Google Pay ఓపెన్ చేసి OTP చెప్పండి” అని చెప్పి భయపెట్టడం లేదా ఒత్తిడి చేస్తారు. ఆ తొందరపాటులోనే చాలామంది వారు చెప్పినట్లు చేసి మొత్తం అకౌంట్‌లోని డబ్బులు పోగొట్టుకుంటారు. అందుకే ఇకపై ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు గూగుల్ ఫీచర్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మోసగాళ్లకు ఇక చాన్స్ ఉండదు.

Also Read: స్వయంగా పనులన్నీ చేసే ఫోన్ లాంచ్.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏజెంటిక్ AI  స్మార్ట్‌ఫోన్.. టచ్ చేయాల్సిన అవసరం లేదు

Related News

శాంసంగ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ఫోన్ల ధరలు విపరీతంగా పెంపు!

లెనోవో నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్.. 165Hz స్క్రీన్, RTX 3050తో అదరగొట్టే ఫీచర్లు!

రూ.908కే అదిరిపోయే సౌండ్..యూత్ ఫిదా అయ్యే ట్రెండింగ్ బ్లూటూత్ స్పీకర్!

iPhone 18 Proలో బ్లాక్ కలర్ ఉండదా? తాజా లీక్‌తో యాపిల్ ప్రియుల్లో పెరిగిన టెన్షన్!

స్టైలిష్ సిల్వర్ స్ట్రాప్‌తో అద్భుతమైన గాడ్జెట్.. ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ రివ్యూ!

యూత్ మైండ్ బ్లాక్ చేసే ఫీచర్లతో.. బోట్ స్మార్ట్ వాచ్, ధర ఎంతంటే ?

కొత్త టీవీని గోడకు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ 5 విషయాలు ముందే తెలుసుకోండి!

రూ. 27వేలకే ఏఐ వాషింగ్ మెషీన్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!

Big Stories

Advertisement
×