E-Paper
Advertisement

Fantasy Drama OTT : ‘ది డెమోన్ హంటర్’ ఓటీటీ రిలీజ్ డేట్… చైనీస్ ఫ్యాంటసీ అడ్వెంచర్ డ్రామా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే ?

Fantasy Drama OTT : ‘ది డెమోన్ హంటర్’ ఓటీటీ రిలీజ్ డేట్… చైనీస్ ఫ్యాంటసీ అడ్వెంచర్ డ్రామా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే ?
Advertisement

Fantasy Drama OTT : ఫ్యాంటసీ డ్రామాలు అనగానే గుర్తొచ్చేది కొరియన్, చైనీస్ డ్రామాలే. కొరియన్ సినిమాలంటే పడిచచ్చే వారి సంఖ్య ఇండియాలో భారీగా ఉంది. అలాగే చైనీస్ సినిమాలకు కూడా ఇక్కడ అభిమానులు ఉన్నారు. మన పక్క దేశం నుంచి వచ్చే ఫ్యాంటసీ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సినిమాలను ఇష్టపడితే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్

2025 ఏప్రిల్ ‌లో చైనా థియేటర్స్‌ లోకి వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది డెమన్ హంటర్’ (The Demon Hunter). 1 గంట 39 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాలో కై హెంగ్ (లాంగ్ వుజీ), నాన్ షెంగ్, ఫెంగ్ లి జున్, లెమన్ లి (లాంగ్ వుజీ భార్య), షి జువాన్ రు, షెన్ బావో పింగ్, లువో యు యావో, యు డాంగ్ ఫెంగ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. చైనీస్ జానపద కథలు, రాక్షసుల వేట, శాపాలు, శాశ్వత ప్రేమ వంటి థీమ్స్‌తో ఫాంటసీ, యాక్షన్, రొమాన్స్ వంటి అంశాలను కలగలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్పుడు భారతదేశంలో డిజిటల్ ఎంట్రీకి సిద్ధం అవుతోంది. భారతదేశంలో ఈ మూవీ 2026 జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)లో స్ట్రీమింగ్ అవుతుంది. చైనీస్ ఫాంటసీ ప్రియులకు మంచి విజువల్స్, ఎమోషనల్ డ్రామాతో అదిరిపోయే ట్రీట్ అవుతుంది ఈ మూవీ. కాబట్టి అసలు మిస్ అవ్వొద్దు.

Advertisement

Read Also :  గోడలో దాగి ఉన్న కాళీమాత… వరుస హత్యలతో వల్లకాడుగా మారే మ్యాన్షన్… క్షణక్షణం ఉత్కంఠ రేపే మర్డర్ మిస్టరీ

స్టోరీలోకి వెళ్తే…

ఈ మూవీ స్టోరీ ప్రాచీన చైనా కథల ఆధారంగా సాగుతుంది. లాంగ్ వుజీ (కై హెంగ్) అనే కామన్ మ్యాన్ ఉంటాడు. అతనికి తన భార్య (లెమన్ లి) అంటే గాఢమైన ప్రేమ. కానీ ఆమె ఒక రోజు రాక్షసుల బారిన పడుతుంది. అనుకోని ఈ ప్రమాదం నుంచి భార్యను హీరో కాపాడాలంటే ఒక కష్టమైన పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే రాక్షసులను వేటాడి, వాళ్ళ శక్తిని తీసుకురావాలి. లాంగ్ వుజీ భార్య కోసం అడవులు, పర్వతాల గుండా ప్రమాదకరమైన ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో కత్తి యుద్ధాలతో పాటు రాక్షసులతో ఫైట్ చేస్తాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంటుంది.

Advertisement

టావోయిస్ట్ ప్రీస్ట్ బాయి యున్ అనే విలన్ హీరో కోసం ఒక దుష్ట ఉచ్చు పన్నుతాడు. లాంగ్ వుజీ ఆ ఉచ్చులో చిక్కుకుంటాడు. ఫలితంగా భయంకరమైన శాపానికి గురవుతాడు. ఆ శాపం నెమ్మదిగా హీరోని రాక్షసుడిగా మారుస్తుంది. భార్యను కాపాడాలని వచ్చిన వాడు ఇప్పుడు, ఉచ్చులో చిక్కుకుని రాక్షసుడిగా మారిపోతాడు. అతనిలోని మానవత్వం చచ్చిపోతున్న తరుణంలో హీరో భార్య ఆత్మ వచ్చి హెల్ప్ చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బాయి యున్‌ తో ఫైట్ చేస్తారు. కానీ అతన్ని గెలవలేక చేతులు ఎత్తేస్తారు. దీంతో హీరో తన భార్యను విశ్రాంతి కోసం టియాన్యూ అనే పర్వతం పైకి ఎత్తుకెళ్తాడు. ఇక ఇక్కడి నుంచి కథ మరో మలుపు తిరుగుతుంది. తన భర్త శాపాన్ని తొలగించడానికి హీరోయిన్ ప్రపంచం నలుమూలలా వెతుకుతుంది. మరి చివరికి హీరోయిన్ వెతుకుతున్నది దొరికిందా ? ఆమె తన భర్తను మళ్ళీ మామూలుగా ఎలా మార్చింది? చివరికి హీరోయిన్ బతికిందా ? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×