E-Paper
Advertisement

శవంతో బయటపడ్డ నివ్వెరపోయే నిజాలు… షాకింగ్ ట్విస్టులున్న సీట్-ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

శవంతో బయటపడ్డ నివ్వెరపోయే నిజాలు… షాకింగ్ ట్విస్టులున్న సీట్-ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్
Advertisement

Crime Mystery OTT: ఒకే కుటుంబానికి చెందిన కవలలు… ఇద్దరూ ఒక్కసారిగా కిడ్నాప్ అవుతారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఒకరి మృతదేహం మిస్సిస్సిప్పి నదిలో కనిపిస్తుంది. మరి మరో అమ్మాయి ఎక్కడికి వెళ్లింది ? ఆమెను కూడా చంపేశారా ? లేక ఈ కేసు వెనుక ఊహించని పెద్ద మిస్టరీ దాగుందా ? పోలీసులను సైతం మైండ్ గేమ్స్‌తో తప్పుదోవ పట్టించే ఓ సీరియల్ కిల్లర్ కథే ‘ది గర్ల్ ఇన్ ది రివర్’ (The Girl In The River). మరి ఆ కిల్లర్ చేతికి ఈ కవలలు ఎలా చిక్కారో కథలో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అమెరికాలోని మిస్సిస్సిప్పి నది పరివాహక ప్రాంతంలోని ఓ చిన్న గ్రామీణ పట్టణం. ప్రశాంతంగా కనిపించే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగుతుంది. నగరంలో నివసించే కవలలైన ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు అదృశ్యమవుతారు. పోలీసులు గాలింపు మొదలు పెట్టిన కొద్దిసేపటికే మిస్సిస్సిప్పి నదిలో ఓ అమ్మాయి మృతదేహం బయట పడుతుంది. అయితే మరో అమ్మాయి జాడ మాత్రం కనిపించదు. ఈ కేసును ఛేదించేందుకు అనుభవజ్ఞుడైన క్రైమినాలజిస్ట్ అలాన్ క్రామెర్ (Devon Sawa) రంగంలోకి దిగుతాడు.

Advertisement

పోలీస్ కెప్టెన్ ఎరికా గ్రేస్మిత్ (Tiffany Haddish) ఆదేశాలతో, కొత్తగా అకాడమీ పూర్తి చేసుకున్న ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ అమేలియా పెంబ్రోక్ (Maggie Grace) కూడా అతనితో కలిసి దర్యాప్తు ప్రారంభిస్తుంది. మొదట ఇది సాధారణ కిడ్నాప్, హత్య కేసులాగే కనిపిస్తుంది. కానీ దర్యాప్తు ముందుకు వెళ్లేకొద్దీ అసలు విషయం బయట పడుతుంది. ఈ ఘటన వెనుక చాలా తెలివిగా ప్రతి అడుగును ప్లాన్ చేస్తున్న ఓ ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ ఉన్నాడని క్రామెర్, అమేలియా గుర్తిస్తారు.

కిల్లర్ పోలీసుల కళ్లెదుటే తిరుగుతూ ఆధారాలను మాయం చేస్తుంటాడు. ఒకవైపు అతని మైండ్ గేమ్స్… మరోవైపు ప్రాణాలతో ఉన్న కవల కోసం సమయంతో పోరాటం. అసలు కిల్లర్ ఎవరు ? అతని టార్గెట్ ఆ ఇద్దరు అమ్మాయిలేనా ? కనిపించకుండా పోయిన రెండో అమ్మాయి ప్రాణాలతో ఉందా ? చివరికి క్రామెర్, అమేలియా ఆ సైకో కిల్లర్‌ను ఎలా పట్టుకున్నారు ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలు ట్విస్ట్.

ఓటీటీలో ఇంగ్లీష్‌లోనే…

Advertisement

బ్రాండో బెనెట్టన్ (Brando Benetton) దర్శకత్వం వహించి, రచించిన ఈ అమెరికన్ క్రైమ్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్‌లో మ్యాగీ గ్రేస్, డెవన్ సావా, టిఫనీ హడిష్, రాల్ఫ్ మాచియో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం Amazon Prime Videoలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమాకు ప్రస్తుతం తెలుగు ఆడియో లేదు. కేవలం ఒరిజినల్ ఇంగ్లీష్ భాషలోనే చూడాలి. కిడ్నాప్, సీరియల్ కిల్లర్, సైకలాజికల్ మైండ్ గేమ్స్ కలగలిసిన క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ సినిమా ఓసారి ట్రై చేయొచ్చు.

Read Also: అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

Related News

నగరంలో బాంబ్ డిఫ్యూజన్ హడావుడి… అదిరిపోయే హై-వోల్టేజ్ హీస్ట్ థ్రిల్లర్

ప్రాణ స్నేహితుల మధ్య అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఆవేశం… మనుషుల నైజానికి అద్దం పట్టే మైండ్ బెండింగ్ డ్రామా

చీకటి కోనలో చిత్రమైన రాక్షసి… క్షణం క్షణం వణికించే హర్రర్ మిస్టరీ

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

Big Stories

Advertisement
×