E-Paper
Advertisement

ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!

ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!
Advertisement

Nubia Phone Cooler: మనలో చాలామంది మొబైల్‌లో గంటల తరబడి గేమ్స్ ఆడేటప్పుడు లేదా ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ విపరీతంగా వేడెక్కిపోతుంటుంది. కొన్నిసార్లు ఫోన్ వేడికి చేతులు కూడా కాలిపోయినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా గేమర్స్ ఈ సమస్యతో బాగా సతమతమవుతుంటారు. ఈ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టడానికి నుబియా కంపెనీ ఒక అద్భుతమైన మ్యాగ్నెటిక్ ఫోన్ కూలర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అచ్చం ఐస్‌క్రీమ్ లాగా కనిపించే ఈ చిన్న గ్యాజెట్ గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఐస్‌క్రీమ్ లాంటి డిజైన్..

ఈ కొత్త కూలర్ లుక్ పరంగా చాలా క్యూట్‌గా ఉంటుంది. ఐస్‌క్రీమ్ స్పూర్తితో దీనిని వైట్ కలర్‌లో, చూడటానికి చాలా అందంగా డిజైన్ చేశారు. దీని బరువు కేవలం 90 గ్రాములు మాత్రమే ఉండటంతో ఫోన్ వెనక భాగంలో తగిలించుకుంటే అదనపు బరువు మోస్తున్న ఫీలింగ్ అస్సలు రాదు. ఫోన్ వేడెక్కకుండా చూడటానికి ఇందులో ప్రత్యేకమైన థెర్మోఎలెక్ట్రిక్ కూలింగ్ ప్లేట్, అల్యూమినియం హీట్‌సింక్ ఇచ్చారు.

Advertisement

Also Read: నెలకు రూ.399 మాత్రమే.. 3300GB డేటాతో పాటు 500+ టీవీ ఛానెల్స్ ఫ్రీ!

60 డిగ్రీల వరకు తగ్గింపు..

చూడటానికి చిన్నగా ఉన్నా దీని పనితనం మాత్రం మామూలుగా ఉండదు. ఇది గరిష్టంగా మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరుస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు.. గేమింగ్ లేదా ఫాస్ట్ చార్జింగ్ సమయంలో ఫోన్ ఉష్ణోగ్రతను ఏకంగా 60 డిగ్రీల వరకు తగ్గిస్తుంది. ఇందులో ఉండే 7 బ్లేడ్ల ఫ్యాన్ నిమిషానికి 6000 రొటేషన్స్‌తో పనిచేస్తూ వేడి గాలిని పక్కలకు నెట్టేస్తుంది. దీంతో మనం ఫోన్‌ను అడ్డంగా పట్టుకుని గేమ్స్ ఆడేటప్పుడు వేడి తగలకుండా హాయిగా ఉంటుంది.

4 రకాల మోడ్స్, ఆటోమేటిక్ కంట్రోల్..

Advertisement

ఈ కూలర్‌ను ఆపరేట్ చేయడానికి ఎలాంటి యాప్ అవసరం లేదు. దీని పక్కనే చిన్న బటన్స్ ఇచ్చారు. వాటి ద్వారా సైలెంట్, పవర్‌ఫుల్, ఓవర్‌క్లాకింగ్, టెంపరేచర్ కంట్రోల్ అనే 4 మోడ్స్‌ను మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. ఇందులో ప్రత్యేకంగా ఉండే టెంపరేచర్ కంట్రోల్ మోడ్.. ఫోన్ వేడిని బట్టి దానంతట అదే కూలింగ్ లెవెల్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే వెనక వైపు ఉండే సర్క్యులర్ ఆర్‌జీబీ లైటింగ్ దీనికి మరింత స్టైలిష్ గేమింగ్ లుక్‌ను ఇస్తుంది.

ధర ఎంతంటే?

ప్రస్తుతం ఈ నుబియా మ్యాగ్నెటిక్ ఫోన్ కూలర్‌ని చైనా మార్కెట్లో విడుదల చేశారు. అక్కడి ధర ప్రకారం ఇది రూ.2200కే వచ్చేస్తుండగా.. తొలి సేల్ సందర్భంగా ఆఫర్‌లో కేవలం రూ.1400 కే ఇస్తున్నారు. ఐస్‌క్రీమ్ డిజైన్, మ్యాగ్నెటిక్ అటాచ్‌మెంట్, ట్రిపాడ్ స్టాండ్ పెట్టుకునే ఆప్షన్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ కూలర్ భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Also Read: జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

Tags

Related News

ఇంట్లోని గాలిని శుభ్రంగా ఉంచుకోవాలా? బడ్జెట్ ఎయిర్ ప్యూరిఫయర్ వచ్చేసింది

నెలకు రూ.399 మాత్రమే.. 3300GB డేటాతో పాటు 500+ టీవీ ఛానెల్స్ ఫ్రీ!

రూ.50 వేలలోపు కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కడం ఖాయం

పార్టీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్..చూడటానికి క్లాస్, సౌండ్‌లో మాస్

ట్రెండింగ్‌లో బెస్ట్ స్లిమ్ పవర్ బ్యాంక్.. అసలు ధర తెలిస్తే షాక్ అవుతారు!

జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

ఈ స్మార్ట్ టీవీ ఉంటే.. థియేటర్ ఎందుకు చెప్పండి!

Big Stories

Advertisement
×