E-Paper
Advertisement

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్
Advertisement

Dark Comedy Crime Series OTT : డబ్బు, అధికారం, డ్రగ్స్, క్రైమ్ అన్నీ ఒకే చోట కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆడియన్స్ కి చూపించిన సిరీస్ ‘The Gentlemen’ ఇప్పుడు సీజన్ 2తో మరింత పెద్ద గేమ్‌ లోకి అడుగు పెట్టింది. మొదటి సీజన్‌ లో అనుకోకుండా క్రిమినల్ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టిన ఎడ్డీ హార్నిమన్, ఇప్పుడు ఆ ప్రపంచంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకుంటాడు. కానీ బిజినెస్ పెరిగే కొద్దీ శత్రువులు పెరిగితే ? నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే ? ఇటలీ వరకు విస్తరించిన ఈ క్రైమ్ గేమ్‌ లో ప్రేమ, డబ్బు, ద్రోహం అన్నీ కలిస్తే ? గై రిచీ స్టైల్ డార్క్ కామెడీ, యాక్షన్, కాన్-గేమ్ ట్విస్టులతో వచ్చిన సిరీస్ ‘The Gentlemen Season 2’. సెప్టెంబర్ 3 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఎడ్డీ, సుసీ కలిసి బిజినెస్‌ ను ఎంత దూరం తీసుకెళ్లారు ? బాబీ నిర్ణయాలు ఎందుకు ప్రమాదకరంగా మారాయి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మొదటి సీజన్‌ లో తండ్రి మరణంతో డ్యూక్ ఆఫ్ హాల్‌ స్టెడ్‌ గా మారిన ఎడ్డీకి కుటుంబ ఎస్టేట్‌ తో పాటు దాని కింద నడుస్తున్న భారీ వీడ్ సామ్రాజ్యం కూడా వారసత్వంగా వస్తుంది. క్రిమినల్ ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్న అతడు చివరికి సుసీ గ్లాస్‌ తో చేతులు కలిపి ఆ సామ్రాజ్యంలో భాగమవుతాడు. ఇదంతా జరిగి ఏడాది గడుస్తుంది. ఎడ్డీ, సుసీ కలిసి బాబీ గ్లాస్ క్రిమినల్ సామ్రాజ్యాన్ని విదేశాల్లో విస్తరించే పనిలో ఉన్నారు. కానీ బాబీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పరిస్థితులను ప్రమాదకరంగా మారుస్తాయి.

Advertisement

తమ బిజినెస్‌ ను కాపాడుకోవాలంటే అతనితోనే ఉండాలా, లేక స్వయంగా నియంత్రణలోకి తీసుకోవాలా అనే చిక్కులో ఎడ్డీ, సుసీ పడతారు. ఈసారి కథ బ్రిటన్ నుంచి ఇటలీ సరస్సుల ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కొత్త ప్రత్యర్థులు, భారీ డీల్స్, ద్రోహాలు, డబ్బు కోసం జరిగే పవర్ గేమ్స్ కథను మరింత వేగంగా నడిపిస్తాయి. అదే సమయంలో ఎడ్డీ, సుసీ మధ్య ఉన్న సంబంధం కూడా కొత్త మలుపులు తీసుకుంటుంది. అసలు ఎవరు ఎవరిని నమ్మాలి ? బాబీ సామ్రాజ్యం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది ? ఎడ్డీ కోరుకుంటున్న అధికారానికి చివరికి ఎంత మూల్యం చెల్లించాలి ? అనేదే సిరీస్ లో చూసి తెలుసుకోవాల్సిన కథ.

Also Read : ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

గై రిచీ, ఎరాన్ క్రీవి, నిక్ రోలాండ్ దర్శకత్వం వహించిన ఈ సీజన్‌ లో థియో జేమ్స్, కాయా స్కోడెలారియో, డేనియల్ ఇంగ్స్, రే విన్‌స్టోన్, గియాంకార్లో ఎస్పొసిటోతో పాటు హ్యూ బోన్నెవిల్, బెెనెడెట్టా పోరాకోలి, మిచెల్ మొరోన్ తదితరులు నటించారు. మొత్తం 8 ఎపిసోడ్లు ఒకేసారి Netflixలో విడుదలయ్యాయి. భారత్‌లో ఇంగ్లీష్‌ తో పాటు హిందీ, తమిళం ఆడియో కూడా అందుబాటులో ఉంది. కానీ తెలుగులో మాత్రం లేదు. వీకెండ్ ఈ హై-వోల్టేజ్ థ్రిల్లర్ ను చూడడం మరచిపోవద్దు.

 

Tags

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×