E-Paper
Advertisement

OTT Movie : పెళ్లి జంటను విడగొట్టే ఫొటోగ్రాఫర్… ఒక్క తప్పుతో గందరగోళం… నవ్వుకోవడానికి మరికొన్ని గంటలే

OTT Movie : పెళ్లి జంటను విడగొట్టే ఫొటోగ్రాఫర్… ఒక్క తప్పుతో గందరగోళం… నవ్వుకోవడానికి మరికొన్ని గంటలే
Advertisement

OTT Movie : ఓటీటీలోకి ప్రతి వారం సినిమాలు వస్తూనే ఉన్నాయి. వీటిని ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. అయితే కొన్ని స్టోరీలు థియేటర్లలో కంటే ఓటీటీలో ట్రెండ్ అవుతుంటాయి. ఆకట్టుకునే కంటెంట్ ఉన్నా కూడా, వీటిని డిజిటల్ స్ట్రీమింగ్ లో చూడటానికే ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ అనే తెలుగు మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ఆడియన్స్ నుంచి దీనికి అంతగా రెస్పాన్స్ రాలేదు. ఫ్యామిలీ కంటెట్ తో వచ్చిన ఈ లో బడ్జెట్ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. దీని స్ట్రీమింగ్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ సినిమా దూసుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అంటే

రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ సినిమా 2025 నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడని ఈ సినిమాలో ‘ సిన్ ‘ ఫేమ్ తిరువీర్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా జీ5, ఓటీటీప్లేలో 2025 డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. సందీప్ అగరం, అశ్మితా రెడ్డి బసాని నిర్మించిన ఈ సినిమా, ఐయండిబిలో 8.4/10 రేటింగ్ పొందింది.

Advertisement

Read Also : రచయిత భార్య మిస్సింగ్… వింత శక్తితో పూనకాలు… ‘కాంతారా’ లాంటి సినిమా

స్టోరీ ఏమిటంటే

శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న ఊర్లో రాజు (థిరువీర్) అనే ఫోటోగ్రాఫర్ ఉంటాడు. ఎప్పటినుంచో తన స్టూడియోలో ప్రీ-వెడ్డింగ్ షూట్స్ చేయాలని కలలు కంటూ ఉంటాడు. అతని ఫ్యామిలీ సపోర్ట్ తో జీవితం గడిచిపోతుంటుంది. చిన్న చిన్న ఫోటోలు తీస్తూ బండి లాగుతుంటాడు. అయితే ఒక రోజు ఆ ఊరిలో ఆనంద్ అనే వ్యక్తి తన పెళ్లికి ప్రీ-వెడ్డింగ్ వీడియో షూట్ చేయమని రాజు స్టూడియోకి వస్తాడు. దీంతో రాజు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఆనంద్ పెళ్లి సౌందర్యతో జరగబోతుంటుంది. వెడ్డింగ్ షూట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతుంది. అయితే ఇక్కడే స్టోరీ మలుపు తిరుగుతుంది. అన్ని ఫుటేజ్ ఉన్న మెమరీ కార్డ్ మిస్ అవుతుంది. ఇక అక్కడి నుంచి గందరగోళం మొదలవుతుంది. రాజు, ఆనంద్ ఫ్యామిలీ, స్థానికులు కలిసి కార్డ్ వెతకడంలో ఫుల్ బిజీ అవుతారు. ఇంతలో ఈ పెళ్లికి కూడా కష్టాలు మొదలవుతాయి. ఇక్కడ కామెడీతో పాటు, ఎమోషనల్ సీన్స్ కూడా వస్తాయి. క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఇది స్టోరీకి హైప్ తెస్తుంది. చివరికి ఆ మెమరీ కార్డ్ దొరుకుతుందా ? ఎవరైనా దానిని దాచారా ? అసలు ఈ పెళ్లి జరుగుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Advertisement

 

 

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×