E-Paper
Advertisement

స్టూడెంట్‌తో టీచర్ రిలేషన్… బాబోయ్ అంత ఓపెన్ గా ఎలా తీశారు ?

స్టూడెంట్‌తో టీచర్  రిలేషన్… బాబోయ్ అంత ఓపెన్ గా ఎలా తీశారు ?
Advertisement

Psycho Thriller OTT : సైకో థ్రిల్లర్ సినిమాలు సైలెంట్ గా మొదలయ్యి, వైలెంట్ గా మారే తీరు థ్రిల్లర్ ప్రియులకు మంచి కిక్ ఇస్తుంది. అందుకే అలాంటి సినిమాలను తెగ ఇష్టపడుతుంటారు మూవీ లవర్స్. ఈ టామ్ అండ్ జెర్రీ స్టోరీలో వచ్చే కీలక మలుపులు ట్విస్టులు మెయిన్ హైలెట్ అని చెప్పవచ్చు. మరి మీరు కూడా ఇలాంటి సినిమాల కోసమే వెతుకుతుంటే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ సైకో థ్రిల్లర్ స్టోరీ ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఎక్కడ చూడవచ్చు అంటే?

ఈ సైకో థ్రిల్లర్ పేరు (The Piano Teacher 2001). ప్రస్తుతం భారతదేశంలో ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ నేరుగా స్ట్రీమింగ్‌కు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అయితే కొన్ని దేశాల్లోని Apple TV లో లేదా Amazon Prime Videoలో దీన్ని రెంట్‌కి తీసుకుని చూసే ఛాన్స్ మాత్రం ఉంది. ఇక మనం దేశంలో ఈ మూవీని చూడాలి అనుకునేవారు ‘MUBI’ వంటి వెబ్‌సైట్లలో ఈ చిత్రాన్ని చూడవచ్చు.

Advertisement

ఈ సినిమా 2001లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రిక్స్ (Grand Prix) అవార్డుతో పాటు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులను కూడా గెలుచుకుంది. 1983లో ఎల్‌ఫ్రీడ్ జెలినెక్ రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో ఇసాబెల్లె హుప్పెర్ట్ యాక్టింగ్ హైలెట్. అయితే ఇందులో ఉన్న బ్లడీ బ్లడ్ బాత్మ్ ఘోరమైన హింస, భయంకరమైన దృశ్యాల వల్ల దీనికి ‘R’ రేటింగ్ ఇచ్చారు. అంటే ఈ మూవీ పెద్దలకు మాత్రమే. కాబట్టి గుండె గట్టిగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడగలరు అని గుర్తు పెట్టుకోండి.

కథలోకి వెళ్తే… 

ఈ మూవీ స్టోరీ వియన్నాలో నివసిస్తున్న మ్యూజిక్ టీచర్ ఎరికా చుట్టూ తిరుగుతుంది. ఆమె చూడడానికి చాలా పద్ధతిగా, కఠినమైన క్రమశిక్షణతో ఉండే టీచర్ లా కన్పిస్తుంది. అయితే ఇదంతా కేవలం బయటి ప్రపంచం కోసమే. ఆ టీచర్ నిజ స్వరూపం తెలిస్తే మాత్రం గుండె ఆగిపోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆమెలో ఒక సైకో దాగి ఉంటుంది. చిన్నప్పటి నుండి తన తల్లి పెత్తనం వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతూ పెరుగుతుంది. అందుకే ఆమె సైకోలా మారుతుంది.

Advertisement

Also Read : భర్తను కాదని ప్రియురాలితో… మతి పోగొడుతున్న ఇద్దరమ్మాయిల రచ్చ

రాత్రిపూట ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లడం, తన శరీరాన్ని తానే బ్లేడ్లతో కోసుకోవడం వంటి పనులు చేస్తుంది. ఈ క్రమంలోనే వాల్టర్ అనే ఒక కుర్రాడు ఆమె నిజ స్వరూపం తెలియక ఇష్టపడుతున్నాను అంటూ వెంటపడతాడు. అదే అదనుగా ఎరికా కూడా అతన్ని దగ్గరకు తీస్తుంది. అలాగే తనకున్న వింత కోరికలను అతనికి చెప్తుంది. అలా వారిద్దరి మధ్య మొదలైన సంబంధం చివరికి చాలా హింసాత్మకంగా మారుతుంది. మరి ఆ సైకో అమ్మాయి నుంచి వాల్టర్ తప్పించుకున్నాడా ? చివరికి క్లైమాక్స్ ఏంటి ? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×