E-Paper
Advertisement

భర్తను కాదని ప్రియురాలితో… మతి పోగొడుతున్న ఇద్దరమ్మాయిల రచ్చ

భర్తను కాదని ప్రియురాలితో… మతి పోగొడుతున్న ఇద్దరమ్మాయిల రచ్చ
Advertisement

Romantic Movie OTT : రొటీన్ సినిమాల కంటే కొంచెం భిన్నంగా, బోల్డ్‌గా ఉండే ఎమోషనల్ సినిమా కావాలనుకుంటే ఇది మీకు పక్కాగా నచ్చుతుంది. ఈ సినిమాలో ఎగిరి గంతేసే పాటలు, విలన్లను కొట్టే ఫైట్లు ఉండవు. ఇద్దరు ఆడవాళ్లు తమ మనసుకు నచ్చినట్టు ప్రేమించుకుంటే ఈ లోకం వాళ్లను ఎలా అణచివేస్తుందో చూపించే ఆసక్తికరమైన కథ ఇది. ఈ సినిమా చాలా సైలెంట్‌గా, సీరియస్‌గా సాగుతుంది కానీ చూస్తున్నంత సేపు అమ్మో, వీళ్ల పరిస్థితి ఏంటనిపించేలా ఉంటుంది. మొత్తానికి తన లైఫ్ తన ఇష్టం అని బతికే ఒక అమ్మాయి కథ ఇది.

ఎక్కడ చూడచ్చు అంటే 

‘డిసోబిడియన్స్’ (Disobedience)సెబాస్టియన్ లెలియో దర్శకత్వం వహించిన ఒక రొమాంటిక్ డ్రామా సినిమా. ఇది నవోమి ఆల్డర్‌మాన్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో రాచెల్ వైజ్, రాచెల్ మెక్ ఆడమ్స్, అలెస్సాండ్రో నివోలా ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలోని హీరోయిన్ రాచెల్ వైజ్ కేవలం నటించడమే కాకుండా, ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. నవోమి ఆల్డర్‌మాన్ రాసిన నవల చదివి, ఆ కథలోని లోతు నచ్చి ఆమె స్వయంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా, విమర్శకుల నుండి, అవార్డు ఫంక్షన్లలో మాత్రం భారీ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Video, Apple TV ప్లాట్‌ఫామ్‌లలో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

లండన్‌లో ఒక కరుడుగట్టిన మతపరమైన కట్టుబాట్లు ఉన్న ఒక ఊరు ఉంటుంది. అక్కడ ఒక పెద్ద మత గురువు కూతురు ఈ రోనిట్. ఆమెకు అక్కడి పద్ధతులు పడక, అందరినీ వదిలేసి న్యూయార్క్ వెళ్లిపోయి తన ఇష్టమొచ్చినట్టు బతుకుతుంటుంది. అయితే హఠాత్తుగా తన తండ్రి చనిపోయాడని తెలిసి, చాల ఏళ్ల తర్వాత మళ్ళీ తన సొంత ఊరికి వస్తుంది. ఆమె రాక ఆ ఊరిలో పెద్ద చర్చకు దారితీస్తుంది, ఎందుకంటే ఆమెను అందరూ ఒక తిరుగుబాటుదారురాలిగా చూస్తారు. ఊరికి వచ్చిన రోనిట్‌కు తన చిన్ననాటి స్నేహితురాలు ఎస్టి కనిపిస్తుంది. అయితే ఎస్టి అప్పటికే రోనిట్ తండ్రి దగ్గర పెరిగిన దోవిద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పద్ధతిగా గృహిణిలా బతుకుతుంటుంది. కానీ రోనిట్‌ను చూడగానే ఎస్టిలో ఫీలింగ్స్ బయటకు వస్తాయి. వీరిద్దరి మధ్య చిన్నప్పటి నుండే ఒక రకమైన సీక్రెట్ ప్రేమ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ ఇద్దరు ఆడవాళ్ల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. వీరిద్దరి సంబంధం బయటపడటంతో ఆ ఊరిలోని పెద్ద మనుషులు, ముఖ్యంగా ఎస్టి భర్త షాక్ అవుతారు. చివరికి వీళ్ళ లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది ? ఎవరు ఎవరితో లైఫ్ లీడ్ చేస్తారు ? అనే విషయాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మట్టి బొమ్మకు ప్రాణం పోసి.. లేనిపోని ముప్పును కొని తెచ్చుకున్న కథ… ఒళ్ళు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×