E-Paper
Advertisement

The President’s Cake OTT: గుండెను మెలిపెట్టే స్టోరీ… ప్రెసిడెంట్ కోరిక కోసం తిప్పలు పడే చిన్నారి… ఎన్నో అవార్డులు గెలిచిన స్టోరీ

The President’s Cake OTT: గుండెను మెలిపెట్టే స్టోరీ… ప్రెసిడెంట్ కోరిక కోసం తిప్పలు పడే చిన్నారి… ఎన్నో అవార్డులు గెలిచిన స్టోరీ
Advertisement

The President’s Cake OTT : రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఒక సినిమా ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్ళింది. ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంటోంది. ఇది 1990ల కాలంలో సద్దాం హుస్సేన్ పాలనలోని ఇరాక్ నేపథ్యంలో సాగుతుంది. అప్పట్లో యుద్ధం, ఆర్థిక ఆంక్షల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్ళు ప్రజలు. అప్పటి ఇరాక్ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ సినిమాలో. కథలో అప్పటి నియంత సద్దాం హుస్సేన్ పుట్టినరోజు సందర్భంగా ఒక కేక్ తయారు చేయాల్సి ఉంటుంది. తొమ్మిదేళ్ల లామియా ఒకవేళ కేక్ చేయకపోతే ఎలాంటి శిక్ష పడుతుందో అని భయపడుతుంటుంది. ఈ క్రమంలో తిరిగే స్టోరీ గుండెను మెలిపెడుతుంది. ఇందులో నటించిన చిన్న పిల్లలు ప్రొఫెషనల్ యాక్టర్లు కూడా కాదు. సినిమా రియలిస్టిక్ గా ఉండేందుకు, వాళ్లను ఇరాక్ వీధుల్లో వెతికి పట్టుకుని నటించేలా చేశారు. అందుకే సినిమా చూస్తున్నప్పుడు చాలా నేచురల్ గా అనిపిస్తుంది.

ఎక్కడ చూడచ్చు అంటే

2025 లో వచ్చిన ఈ ఇరాకీ డ్రామా సినిమా పేరు ‘ది ప్రెసిడెంట్స్ కేక్’ (The President’s Cake). ఈ సినిమాకు హసన్ హాదీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా దర్శకుడు హసన్ హాదీ స్వయంగా ఇరాక్ దేశస్థుడు. 1990ల్లో సద్దాం హుస్సేన్ పాలనలో ఆయన చిన్నప్పుడు చూసిన నిజమైన సంఘటనల ఆధారంగానే ఈ కథను రాసుకున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో బనీన్ అహ్మద్ నాయేఫ్, సజాద్ మహమ్మద్ ఖాసీం నటించారు. 2025 కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. ఉత్తమ తొలి చిత్రానికి ఇచ్చే ‘కెమెరా డి ఓర్’ అవార్డుతో పాటు ‘ఆడియన్స్ అవార్డు’ కూడా అందుకుంది. అంతేకాదు 98వ అకాడమీ అవార్డుల్లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఇరాక్ తరపున ఈ సినిమా ఎంపికైంది. ప్రస్తుతం ఈ సినిమా prime videoలో అందుబాటులో ఉంది.

 స్టోరీ ఏమిటంటే 

Advertisement

అప్పట్లో ఇరాక్ దేశంలో సద్దాం హుస్సేన్ అనే గట్టి నియంత ఉండేవాడు. ఆయన పాలనలో యుద్ధాలు, ఆంక్షల వల్ల తిండికి కూడా చాలా కటకటగా ఉండేది. అలాంటి టైంలో, తన పుట్టినరోజు వస్తుందని ఊరంతా పండగ చేయాలని, అందరూ ఆయనకు కేక్ చేసి పెట్టాలని ఆర్డర్ వేస్తాడు. ఒకవేళ కేక్ చేయకపోతే జైల్లో వేస్తారని లేదా చంపేస్తారని ప్రజలంతా ప్రాణభయంతో వణికిపోతుంటారు. ఈ కథలో లామియా అనే తొమ్మిదేళ్ల చిన్న పిల్ల ఉంటుంది. ఆ పిల్లకు వాళ్ల స్కూల్ మాస్టర్ ఒక పని చెప్తాడు. అధ్యక్షుడి పుట్టినరోజు కోసం కేక్ చేసి తీసుకురావాలి, లేదంటే మీ నాన్నని జైలుకు పంపిస్తామని బెదిరిస్తాడు.

ఇంట్లో చూస్తే తినడానికే గతి లేదు, ఇక కేక్ ఎలా చేయాలి? ఆ చిన్న పిల్ల కేక్ చేయడానికి కావాల్సిన పిండి, గుడ్లు, పంచదార కోసం ఆ ఊరంతా అల్లాడిపోతూ తిరుగుతుంది. ఆకలితో తిండి దొరకని ఆ కరువు కాలంలో ఒక చిన్న కేక్ ముక్క కోసం ఆ పిల్ల పడే తపన, ఎదుర్కొనే కష్టాలే ఈ సినిమా. చివరికి ఆ చిన్నారి తన తండ్రిని కాపాడుకోవడానికి ఆ కేక్ ఎలా తయారు చేసింది ? ఆ క్రమంలో ఆమెకు ఎదురైన భయంకరమైన పరిస్థితులు ఏంటి ? అనేదే ఈ గుండెల్ని పిండేసే కథ.

Advertisement

Read Also :  ఓటీటీలోకి వచ్చేస్తున్న అనిర్బన్ చక్రవర్తి డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చో తెలుసా ?

Related News

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

Big Stories

Advertisement
×