BigTV English

OTT Movie : పిల్లలు పుట్టరని తెలిసి దూరం పెట్టే ప్రియుడు… ఆమె ఇచ్చే ట్విస్టుకు బుర్రపాడు… ఇక జన్మలో అమ్మాయిల జోలికి వెళ్ళడు

OTT Movie : పిల్లలు పుట్టరని తెలిసి దూరం పెట్టే ప్రియుడు… ఆమె ఇచ్చే ట్విస్టుకు బుర్రపాడు… ఇక జన్మలో అమ్మాయిల జోలికి వెళ్ళడు

OTT Movie : లవ్ స్టోరీలు వినడానికి, చూడటానికి ఆసక్తికరంగా ఉంటాయి. అయితే కొన్ని లవ్ స్టోరీలు మరీ విచిత్రంగా ఉంటాయి. మన చుట్టుపక్కల కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అలా ఎలా అని అందరూ ఆలోచనలో పడుతుంటారు. అలాంటి ఒక రొమాంటిక్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ప్రేమకోసం ఒకజంట కట్టుకున్నవాళ్లను వదులుకోవాలనుకుంటారు. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ తో అందరూ షాక్ అవుతారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


కథలోకి వెళ్తే

అబ్రిల్ ఒక ఫ్లైట్ అటెండెంట్. మాన్యుయెల్ ఒక వైన్‌మేకర్. వీళ్ళిద్దరూ ఒక విమానంలో కలుసుకుంటారు. తక్షణమే ఒకరిపట్ల ఒకరు ప్రేమలో పడతారు. వీళ్ళ మధ్య ఉన్న తీవ్రమైన కెమిస్ట్రీ వారిని ఒక రాత్రి గడపడానికి దారితీస్తుంది. కానీ విధి వారిని వేరు చేస్తుంది. ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ సమస్య వల్ల మాన్యుయెల్ ఆగిపోతాడు. వీళ్ళిద్దరూ కాంటాక్ట్ కూడా కోల్పోతారు. ఏడు సంవత్సరాల తర్వాత ఇద్దరూ అనుకోకుండా కలుస్తారు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ కుటుంబాలతో జీవిస్తుంటారు. అబ్రిల్ ఒక స్టేజ్ డాన్సర్‌గా, మాన్యుయెల్ వైన్ బిజినెస్‌లో స్థిరపడి ఉంటారు. కానీ పాత పరిచయం మళ్లీ బుసలు కొడుతుంది. ఇంతకు ముందుకంటే ఇప్పుడు వీళ్ళు మరింత దగ్గరవుతారు.

ఇప్పుడు తమ ప్రేమను అనుసరించాలా లేక వారి కుటుంబాలకు విధేయత చూపాలా అనే డైలమాలో పడతారు. ఇప్పుడు అబ్రిల్, మాన్యుయెల్ మధ్య ఉన్న అట్రాక్షన్ తీవ్రంగా ఉంటుంది. కానీ ఈ సంబంధం కంటిన్యూ అయితే ఫ్యామిలీని బాధపెట్ట వలసి వస్తుంది. మాన్యుయెల్ తన భార్య పిల్లల జీవితాన్ని వదిలిపెట్టడానికి సంకోచిస్తాడు. కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతారు. ఈ కథ ఒక బిట్టర్‌స్వీట్ క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితాలను శాశ్వతంగా మార్చేస్తాయి. అబ్రిల్, మాన్యుయెల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? ఫ్యామిలీలను వదిలేస్తారా ? ప్రేమలో మునిగిపోతారా ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ సినిమాని చూసి తెలుసుకోండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘The Red Thread’ 2016లో విడుదలైన అర్జెంటీనా రొమాంటిక్ చిత్రం. డానియెలా గోగ్గి దర్శకత్వంలో చైనా సువారెజ్ (అబ్రిల్), బెంజమిన్ వికునా (మాన్యుయెల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం చైనీస్ పురాణంలోని “రెడ్ థ్రెడ్ ఆఫ్ ఫేట్” ఆధారంగా తెరకెక్కింది. 2016 మే 19న విడుదలై, 1 గంట 40 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.5/10 రేటింగ్ ని పొందింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : అమ్నీసియాతో గతాన్ని మర్చిపోయే అమ్మాయి… ఆమెను చంపడానికి కాచుక్కూర్చునే కిల్లర్లు… క్రేజీ క్రైమ్ సిరీస్

OTT Movie : అబ్బాయిలను రెచ్చగొట్టి ఆ పని చేసే టీనేజర్… పని కానిస్తూ పరలోకానికి క్లయింట్… ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూడాల్సిన మూవీ

OTT Movie : ప్రియుడి కొడుకుతోనే యవ్వారం… వృద్ధాప్యం దరిచేరని అమ్మాయి అరాచకం… సింగిల్ గా చూడాల్సిన మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : ఓడలో భీకర మారణకాండ… పోలీసులను బురిడీ కొట్టించే కేటుగాడు… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : వాలెంటైన్స్ డే రోజు వరుస హత్యలు… సింగిల్ గా ఉంటే ఈ సైకో చేతిలో చావే… గుండె గుభేల్మన్పించే కిల్లర్ మూవీ

Big Stories

×