Illu Illalu Pillalu Today Episode September 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆనందరావు శ్రీవల్లిని చూడటానికని ఇంటికి వస్తాడు. ఆ చెంబు ని తొలగించే పని నేను చేస్తాను ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే నన్ను ఇంట్లో ఉండేలా చెయ్యు అని ఆనందరావు అంటాడు. శ్రీవల్లి తండ్రి మాటను కాదనలేక అలానే అని అంటుంది. మొత్తానికి శ్రీవల్లి ఆనందరావు అనుకున్న విధంగా ఇంట్లో రాత్రి ఉండిపోవడానికి అందరూ ఒప్పుకుంటారు. ఇక తిరుపతి ఆ అమ్మాయి గురించి అని ఆలోచిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. ఆ అమ్మాయి నా సర్వస్వం ఆ అమ్మాయి నా జీవితం అంటూ గొప్పలు చెప్పుకుంటూ పాటలు పాడుతూ ఉంటాడు. తిరుపతి పెళ్లి పెళ్లి అట్టు గోల చేస్తున్నారని చూసిన రామరాజు ఏంట్రా నీ గోల అంటూ అరుస్తాడు. ఎలాగైనా సరే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తిరుపతి అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆ చెంబు మేటర్ ఎలాగైనా తేల్చాలని ఆనంద్ రావు సడన్గా ఆ ఇంటికి వస్తాడు. అమ్మాయిని చూడడానికి ఆ ఇంటికి వచ్చాను అని చెప్తాడు. పొద్దయింది కదా మీరు ఇక్కడే ఉండండి అని రామరాజు అంటాడు. ముందుగా శ్రీవల్లి ఆనందరావు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంట్లో ఉండేందుకు ఒప్పుకుంటాడు. ధీరజ్ వాళ్ళ నాన్న దగ్గర లక్ష రూపాయలు తీసుకొని చందుకి ఇవ్వాలని ఫిక్స్ అవుతాడు. ప్రేమ మాత్రం కళ్యాణ్ చెప్పినట్లుగా బయటకు వస్తుంది. వీధులన్నీ కాళ్లు అరిగేలా పరుగులు పెడుతుంది ప్రేమ.
కళ్యాణ్ ఫోన్ చేసి నాకోసం నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావ్ అయినా నువ్వు టెన్షన్ లో కూడా చాలా అందంగా ఉన్నావ్.. అంటూ కోపం తెప్పించేలా మాట్లాడతాడు..ప్రేమ రాత్రిపూట రోడ్డు మీద తిరగడం చూసిన ధీరజ్ ఏమైంది నువ్వు ఈ టైంలో ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతాడు. ఏదో పెద్ద సమస్య ఉన్నట్టుంది అదేంటో నాకు చెప్పు అని అంటాడు. కానీ ప్రేమ మాత్రం నీకెందుకు చెప్పాలి రా నువ్వేమైనా పట్టించుకుంటున్నావా అని అంటుంది. ఇక ధీరజ్ ఎంత చెప్తున్నా సరే ప్రేమ వినదు దానితో ప్రేమను చెంప పగలగొడతాడు..
ప్రేమను ధీరజ్ కొట్టడం విశ్వా చూస్తాడు నా కళ్ళ ముందరే నా చెల్లిని కొడతావా అంటూ ధీరజ్ పై గొడవకు దిగుతాడు. ఇద్దరూ అలా గొడవ పడడం చూసిన ప్రేమ విశ్వాన్ని కొడుతుంది. వాడు నిన్ను కొట్టాడు అన్నయ్యగా నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొడతావా అని అడుగుతాడు.. అన్నయ్య అయితే ఏంటి అని ప్రేమ అంటుంది. ఆ మాట వినగానే విశ్వంకి ఫ్యూజులు అవుట్ అవుతాయి. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ ధీరజ్ లు కూడా ఇంటికి వెళ్లి పోతారు.
ఇక రాత్రి అవడంతో తిరుపతి ఒంటరిగా ఎన్ని రోజులు ఇలా పడుకోవాలో ఆ అమ్మాయి పక్కన పడుకునే రోజు ఎప్పుడొస్తుందో అంటూ పక్క వేసుకుని పడుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద్ రావు నీకు తోడుగా నేను పడుకుంటాను అని అంటాడు. నేను అలాంటి వాడిని కాదన్నాయ్ అని తిరుపతి అంటాడు. అదేం లేదు తమ్ముడు నువ్వేం ఫీల్ అవ్వకు నీకు తోడుగా ఈ అన్నయ్య ఉన్నాడు నువ్వేం బాధపడకు అని అంటాడు. మా చెంబు ని నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో నీ పక్కన పడుకొని ఈరోజు చూడాలి అని అంటాడు.
తిరుపతి మెల్లగా నిద్రలోకి జారుకున్న తర్వాత ఆనందరావు తన పనిని మొదలు పెడతాడు. ఆ చెంబు ని రాత్రంతా కష్టపడి కట్ చేసి తిరుపతి చేయించి బయటికి తీస్తాడు. ఉదయం అందరూ చూస్తే దొరికిపోతానని అనుకుంటాడు అప్పుడే తలుపులు తెరవడం చూసిన ఆనందరావుకు టెన్షన్తో తడిచిపోతుంది. వచ్చింది శ్రీవల్లి అని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. ఇక ఆ చెంబు ని బయటపడేసి మళ్లీ ఏమీ తెలియనట్లు వెళ్లి తిరుపతి పక్కన పడుకుంటాడు. చెంబు లోంచి నా చెయ్యి బయటకు వచ్చేసింది అని సంబరపడిపోతాడు.
Also Read: గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
విశ్వకు పెళ్లి సంబంధం చూశామని సేన భద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తుంటారు. అప్పుడే ఇంట్లోకి వచ్చినా విశ్వం నీ కోపంగా ఉండడం చూసి షాక్ అవుతారు. ఆ ధీరజ్ గాడు ప్రేమను నడిరోడ్డుపై కొట్టాడు. నా రక్తం మరిగిపోయింది. వాడిని కొడితే ప్రేమ నన్ను కొట్టి వెళ్ళిపొమ్మని చెప్పింది. ఎలా చూసుకున్నాము.. అసలు ప్రేమని ఒక్క దెబ్బ అయినా ఒక్క మాటైనా అన్నామా ఏదో ఒకటి చేసి ఆ ధీరజ్ గాడికి ఆ రామరాజు గారికి బుద్ధ చాలా చేస్తాను అని విశ్వం అంటాడు.. భద్ర ఆ రామరాజుకి బుద్ధి వచ్చేలా ఏదో ఒకటి నేను చేస్తాను రా అని మనసులో అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..