OTT Movie : సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో వచ్చిన ఒక రొమాంటిక్ మూవీ డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ సినిమాలో ఒక అమ్మాయికి 29 ఏళ్ల వయసులో, ఒక ప్రమాదం తరువాత వయసు పెరగడం ఆగిపోతుంది. ఆ తరువాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ తో ఈ స్టోరీకి శుభం కార్డ్ పడుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఎలా ఉంటుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
అడలైన్ బౌమన్ 1908లో జన్మించిన ఒక అమ్మాయి. 29 ఏళ్ల వయసులో 1937లో ఒక కారు యాక్సిడెంట్‌లో చనిపోతుంది. కానీ ఆమె మీద మెరుపు పిడుగు పడటంతో తిరిగి బతుకుతుంది. ఆ ఘటన తర్వాత ఆమె వయసు పెరగడం ఆగిపోతుంది, ఎప్పటికీ 29 ఏళ్లలాగే ఉంటుంది. ఈ రహస్యం బయటపడకుండా, అడలైన్ ప్రతి పదేళ్లకొకసారి తన అడ్రెస్ ను మార్చుకుంటూ, కొత్త పేర్లతో, కొత్త ఊళ్లలో జీవిస్తుంటుంది. ఆమె తన కూతురు ఫ్లెమ్మింగ్ తో మాత్రమే కాంటాక్ట్‌లో ఉంచుకుంటుంది. ఆమె కూతురు కూడా ఇప్పుడు వృద్ధురాలై ఉంటుంది.
2015లో అడలైన్ సాన్ ఫ్రాన్సిస్కోలో జెన్నీ లార్సన్ అనే పేరుతో లైబ్రేరియన్‌గా పనిచేస్తూ, ఎల్లిస్ జోన్స్ అనే యువకుడిని కలుస్తుంది. ఎల్లిస్ ఆమెపై ప్రేమలో పడతాడు. కానీ అడలైన్ తన సీక్రెట్ కారణంగా అతనితో దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఎల్లిస్, అడలైన్‌ని తన తల్లిదండ్రులు విలియం, కాథీల దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ విలియం, అడలైన్‌ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె 1960లలో అతను ప్రేమించిన అడలైన్ బౌమన్‌లాగే ఉంటుంది. ఆ సమయంలో ఆమె అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. విలియం ఆమె సీక్రెట్‌ని కనిపెడతాడు. కానీ ఎల్లిస్‌కి చెప్పకుండా ఆమెను రక్షిస్తాడు.
అడలైన్, ఎల్లిస్‌తో ప్రేమలో పడినా, తన వయసు రహస్యం కారణంగా అతన్ని వదిలేయాలని నిర్ణయించుకుని పారిపోతుంది. కానీ మళ్లీ ఒక కారు యాక్సిడెంట్‌లో, మెరుపు పిడుగు పడటంతో ఆమె హార్ట్ రీస్టార్ట్ అవుతుంది. ఆమెకు ఇప్పుడు మళ్లీ వయసు పెరగడం మొదలవుతుంది. ఈ సంఘటన తర్వాత, అడలైన్ తన భయాలను వదిలి, ఎల్లిస్‌తో జీవితాన్ని ఎంచుకుంటుంది. తన కూతురు ఫ్లెమ్మింగ్‌తో కలిసి నార్మల్ జీవితం గడపాలని నిర్ణయించుకుంటుంది. ఈ కథ ఇలా ఎండ్ అవుతుంది.
‘The Age of Adaline’ 2015లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ ఫాంటసీ చిత్రం. లీ టోలండ్ క్రీగర్ దర్శకత్వంలో, బ్లేక్ లైవ్లీ (అడలిన్ బౌమన్), మిచీల్ హుయిస్మాన్ (ఎలిస్ జోన్స్), హారిసన్ ఫోర్డ్ (విలియం జోన్స్), ఎల్లెన్ బర్స్టిన్ (ఫ్లెమ్మింగ్), కాథీ బేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2015 ఏప్రిల్ 24న USలో విడుదలై, 1 గంట 52 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో స్ట్రీమింగ్ అవుతోంది.