E-Paper
Advertisement

పగతో రగిలే తల్లులు… చచ్చినోన్ని బతికించి తీర్చుకొనే భయంకరమైన ప్రతీకారం… ఓటీటీలో తెగ భయపెడుతున్న థ్రిల్లర్ సిరీస్

పగతో రగిలే తల్లులు… చచ్చినోన్ని బతికించి తీర్చుకొనే  భయంకరమైన ప్రతీకారం… ఓటీటీలో తెగ భయపెడుతున్న థ్రిల్లర్ సిరీస్

Thriller Series OTT : ఓటీటీలో ఒక తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను ప్రేక్షకులను తెగ భయపెడుతోంది.  ఈ స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తమ కూతుర్ల చావుకు కారణమైన వ్యక్తి చనిపోయినా కూడా మళ్ళీ క్షుద్ర పూజ చేసి బతికించి, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో వచ్చే ఒక్కో ఎపిసోడ్ ఇచ్చే థ్రిల్ మాటల్లో అయితే చెప్పలేము. దీని విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తాయి. సిరీస్ ను చూస్తే ఆ ఫీలింగ్ యమ క్రేజీగా ఉంటుంది. దీనికి ఐయండిబిలో 7/10 రేటింగ్ కూడా ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో స్ట్రీమింగ్ 

ఈ తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది రిసరెక్టెడ్’ (The Resurrected). ఇందులో ఆసియా చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ నటీనటులు నటించారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి షూ కీ చాలా కాలం తర్వాత ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమెతో పాటు మరో ప్రముఖ నటి లీ సింజే నటించడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సిరీస్‌ను గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకులు లెస్టే చెన్, హ్సు చావో-జెన్ రూపొందించారు. ఇది 2025 అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో 9 ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

సిటీలో ఒక పెద్ద టెలికాం స్కామ్ జరుగుతుంది. వేల కోట్లు కొట్టేసి ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేస్తాడు చాంగ్ షి అనే వ్యక్తి. వాడి వల్ల ఇద్దరు తల్లుల కూతుళ్లు బలైపోతారు. పోలీసుల వల్ల న్యాయం జరగదని ఆ తల్లులు డిసైడ్ అవుతారు. అయితే ఆ స్కామ్ చేసిన చాంగ్ షి ఉరిశిక్ష పడి చనిపోతే, వీళ్లు ఒక తాంత్రికుడి సాయంతో వాడి శవాన్ని మళ్లీ బతికిస్తారు. వాడు కేవలం ఏడు రోజులు మాత్రమే బతికి ఉంటాడు, ఆ లోపు వాడి దగ్గర అసలు నిజాలు బయటపెట్టడమే వీళ్ల ప్లాన్. ఆ ఏడు రోజులు ఆ ఇద్దరు తల్లులు వాడిని ఒక సీక్రెట్ ప్లేస్‌లో బంధించి నరకం చూపిస్తారు. నువ్వు ఒక్కడివే ఈ స్కామ్ చేయలేదు, నీ వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలు ఎవరని వాడిని ఉతికి ఆరేస్తారు.

ఇక వాడు చెప్పే ఒక్కో నిజం బయటపడుతుంటే, అసలు కథ అడ్డం తిరుగుతుంది. మనం అనుకున్నదానికంటే ఈ స్కామ్ వెనుక చాలా పెద్ద నెట్‌వర్క్ ఉందని అర్థమవుతుంది. చచ్చినోడిని బతికించి మరీ నిజాలు చెప్పించడం అనే కాన్సెప్ట్ చుట్టూ కథ చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఇక ప్రతీకారం తీర్చుకునే క్రమంలో వీళ్ళు రాక్షసుల్లా మారిపోతారు. చివరకు ఆ స్కామ్ వెనుక ఉన్న అసలు ముఠాని ఎలా పట్టుకున్నారు, ఆ ఏడు రోజుల తర్వాత ఆ బతికిన శవం ఏమైంది ? వీళ్ళు తమ రివేంజ్ ను కంప్లీట్ చేశారా ? అనే విషయాలతో ఈ సిరీస్ ఉత్కంఠభరితమైన ముగింపును ఇస్తుంది.

Read Also : వరుస హత్యలతో వణికిపోయే రాత్రి… భయానికి అర్థం మార్చే సరికొత్త మిస్టరీ

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×