E-Paper
Advertisement

నిద్ర లేచి చూస్తే పక్కనే శవం… ఊహించని మలుపులతో కేక పెట్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్

నిద్ర లేచి చూస్తే పక్కనే శవం… ఊహించని మలుపులతో కేక పెట్టిస్తున్న క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Murder Mystery OTT : ఓటీటీలో థ్రిల్లర్ సిరీస్ లను ఎక్కువగా చూస్తుంటారు ప్రేక్షకులు. వాటిని చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు ఒక మర్డర్ మిస్టరీ తైవానీస్ సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాం. మర్డర్ మిస్టరీ సిరీస్ అంటే మామూలుగా ఉండదు, ఫుల్ సస్పెన్స్‌తో సాగుతుంది. ఇది కేవలం ఒక హత్య చుట్టూ తిరిగే మిస్టరీ మాత్రమే కాకుండా, ఒకే అపార్ట్‌మెంట్‌లో మనుషుల మధ్య ఉండే సీక్రెట్స్ , కుట్రలను ఓ రేంజ్ లో చూపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని మలుపులను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

ఎక్కడ చూడచ్చు అంటే

2024లో వచ్చిన ఈ తైవానీస్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘నన్ ఏ మర్డర్ స్టోరీ’ (Not a Murder Story). ఈ వెబ్ సిరీస్ ప్రముఖ రచయిత లీ టోంగ్‌హావో రాసిన నవల ఆధారంగా రూపొందింది. దర్శకుడు కో చెన్-నీన్ ఈ సిరీస్ ను గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో చూపించారు. ముఖ్యంగా హీరోగా నటించిన లియు క్వాన్-టింగ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తం 8 ఎపిసోడ్లతో తైవాన్ చిత్ర పరిశ్రమలో 2024లో వచ్చిన ఉత్తమ క్రైమ్ థ్రిల్లర్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఇది Catchplay+, iQIYI, Netflix లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో హీరో ఒక యాక్టర్ కావాలని తెగ ట్రై చేస్తుంటాడు, కానీ ఛాన్సులు రాక అష్టకష్టాలు పడుతుంటాడు. ఒకరోజు పొద్దున్నే లేచి చూసేసరికి పక్కింటి ఫ్లైట్ అటెండెంట్ అయిన లిన్ మెంగ్ అనే అమ్మాయి బెడ్‌రూమ్‌లో ఉంటాడు. అయితే పక్కనే ఆ పిల్ల శవమై పడి ఉంటుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో అతనికి ఏమాత్రం గుర్తుండదు. కానీ తను చంపలేదని గట్టి నమ్మకం. ఇప్పుడు పోలీసులకి దొరికితే తన లైఫ్, కెరీర్ అంతా గోవిందా అని ఫిక్స్ అయిపోతాడు. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కాలని, ఆ శవాన్ని ఎవరికీ అనుమానం రాకుండా సర్దేస్తాడు. అది మర్డర్ లాగా కాకుండా, ఎవడో దొంగతనం చేయడానికి వచ్చి చంపేసినట్టు సీన్ క్రియేట్ చేస్తాడు.

కానీ ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్నోళ్లంతా ఒకరిని మించి ఒకరు కిలాడీలు. ఒక్కొక్కడికి ఒక్కో సీక్రెట్ ఉంటుంది. హీరో ఒక పక్క పోలీసులకి దొరక్కుండా తప్పించుకుంటూనే, అసలు ఆ అమ్మాయిని చంపిన ఆ ముదురు ఎవరో కనిపెట్టాలని వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో హీరోకి తన గర్ల్‌ఫ్రెండ్ గురించి, ఆ అపార్ట్‌మెంట్ వాసుల గురించి దిమ్మతిరిగే నిజాలు తెలుస్తాయి. అందరూ పైకి పద్ధతిగా కనిపిస్తారు కానీ, లోపల అందరూ తేడాగా ఉంటారు. ఆ అమ్మాయి చావు వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? హీరో తనని తాను సేవ్ చేసుకున్నాడా? లేదా బుక్కైపోయాడా? అనే విషయాలను ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : పాతికేళ్లయినా దొరకని భర్త ఆచూకీ… నియంత పాలనలో నలిగిపోయిన జీవితం… గుండెల్ని పిండేసే రియల్ స్టోరీ

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×