E-Paper
Advertisement

Netflix Upcoming Series : సంచులు సంచులుగా దొరికే డబ్బులు… మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు… ఓటీటీలో అదరగొట్టబోతున్న హీస్ట్ థ్రిల్లర్

Netflix Upcoming Series : సంచులు సంచులుగా దొరికే డబ్బులు… మైండ్ బ్లాక్ చేసే ట్విస్టులు… ఓటీటీలో అదరగొట్టబోతున్న హీస్ట్ థ్రిల్లర్
Advertisement

Netflix Upcoming Series : నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మరో తుర్కిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాబోతోంది. ట్రైలర్ తోనే ఈ సిరీస్ ఆసక్తి రేపుతోంది. ఇందులో ముగ్గురు వ్యక్తులకు కోట్ల రూపాయల డబ్బు సంచులు దొరుకుతాయి. ఆ తరువాత గర్ల్ ఫ్రెండ్స్ , మాఫియా ఎంట్రీ తో స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ తుర్కిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మరి కొద్ది గంటల్లో స్ట్రీమింగ్ కి వస్తోంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ దొరికినట్టే. ఇది ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ తుర్కిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది టౌన్’ (The Town). ఇది ఉముత అరస్, బెర్క్ ఫర్స్ డైరెక్షన్ లో రూపొందింది. ఇది నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఓకాన్ యాలబిక్, ఓజ్గుర్చాన్ చెవిక్, ఓజాన్ డోలునాయ్ లీడ్ రోల్స్ లో నటించారు. తుర్కిష్ థ్రిల్లర్ 2025 డిసెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ తుర్కిష్ ఒరిజినల్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చాలా కాలంగా ఒకరికొకరు దూరంగా ఉన్న ఇద్దరు సోదరులు, వారి చిన్ననాటి స్నేహితుడు ఊహించని పరిస్థితుల్లో కలుసుకుంటారు. ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య చిన్నప్పటి నుంచి బలమైన బాండింగ్ ఉంటుంది. వాళ్ళు తిరిగి కలిసినప్పుడు, అనుకోకుండా వారికి పెద్ద మొత్తంలో దొంగ సొమ్ము దొరుకుతుంది. ఒక రోజు రోడ్డు పక్కన ఒక కారు అక్సిడెంట్ జరిగి ఉంటుంది. వాళ్లు అక్కడికి వెళ్లి చూస్తే… బ్యాగ్‌లో కోట్ల రూపాయల మాఫియా డబ్బు ఉంటుంది. ఈ అదృష్టం వారి జీవితాలను పూర్తిగా మార్చివేస్తుంది. డబ్బు దొరికిన తర్వాత ప్రశాంతంగా ఉన్న జీవితాలు, ఒక్కసారిగా ప్రమాదకరమైన ఆటలా మారిపోతాయి. ఈ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి, ఎవరికి తెలియకుండా ఎలా దాచాలి అనే విషయాలపై వారి మధ్య విభేదాలు మొదలవుతాయి.

Read Also : ప్రాణాంతక వైరస్ నుంచి తప్పించుకోవడానికి పరుగులు… ఈ అమ్మాయి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

Advertisement

ఈ క్రమంలో వీళ్ళంతా అప్పటివరకు తమకు తెలియని నేర ప్రపంచంలోకి అడుగుపెడతారు. తమ కలలను సాకారం చేసుకోవాలనే కోరిక, వాటిని సాధించడానికి వీళ్ళు చేసే పనులతో సిరీస్ ఉత్కంఠంగా నడుస్తుంది. మధ్యలో వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవుతారు. అలాగే మాఫియా గ్యాంగ్ వాళ్లని హంట్ చేయడం మొదలెడుతుంది. చివరికి ఆ డబ్బు వల్ల వీళ్ళ సమస్యలు తీరుతాయా ? మాఫియా గ్యాంగ్ నుంచి వీళ్ళు బయటపడతారా ? అనే విషయాలను, ఈ తుర్కిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×