E-Paper
Advertisement

TDP On Indigo: ఇండిగో సంక్షోభంలో టీడీపీ పెత్తనమంటూ ఆరోపణలు.. వాస్తవమెంత?

TDP On Indigo: ఇండిగో సంక్షోభంలో టీడీపీ పెత్తనమంటూ ఆరోపణలు.. వాస్తవమెంత?
Advertisement

CM Chandrababu: ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డుతున్నారు. వరుసగా ఏడో రోజు ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. అయితే టీడీపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ సంక్షోభంపై ఏపీ మంత్రి నారా లోకేశ్, సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాంటిదేం లేదని, ఇది కేంద్ర పరిధిలోని విషయమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

మేము మానిటరింగ్ చేయడంలేదు

ఇండిగో సంక్షోభంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడంలేదన్నారు. ఇండిగో సంక్షోభాన్ని కేంద్రమే చూసుకుంటుందని చెప్పారు. సాధ్యమైనంత వరకు కేంద్రమే సమస్య పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ చెప్పారు. ఈ ఇష్యూపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఇండిగో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించలేదన్నారు. పైలట్లకు విశ్రాంతి అవసరమని చెప్పారు. టైం ఇచ్చినా చేయలేకపోయారని తెలిపారు. దీంతో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ఇండిగోపై కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని…తానే మానిటరింగ్ చేయడం లేదన్నారు. ఇండిగో మోనోపాలి వల్లే సమస్యలు వచ్చాయన్నారు చంద్రబాబు.

Advertisement

Also Read: IndiGo Crisis Reason: ఇండిగో సంక్షోభానికి అదే కారణం.. రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన 

టీడీపీ అధికార ప్రతినిధి నోరుజారడంతో

అయితే ఈ వ్యవహారానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడే కారణమంటూ ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ అర్నబ్‌ గోస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ పరిణామాలపై విమానయాన శాఖ మంత్రిని కాకుండా మరెవరిని ప్రశ్నించాలంటూ ప్రశ్నించారు. ఇండిగో సంక్షోభంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్‌నాయుడిపై ప్రశ్నలు కురించారు. ఇండిగో పరిస్థితిని మంత్రి లోకేశ్ పర్యవేక్షిస్తున్నారంటే టీడీపీ అధికార ప్రతినిధి నోరుజారారు. దీంతో ఇండిగోపై సమీక్ష జరపడానికి లోకేశ్ ఎవరంటూ అర్నబ్ నిలదీశారు. దీంతో తదుపరి డిబేట్ కు టీడీపీ ప్రతినిధి హాజరు కాలేదు.

Advertisement

దీంతో స్టూడియోలో ఖాళీ కుర్చీ వేయించి, కేంద్రమంత్రిని కాకుండా ఇంకెవరిని ప్రశ్నించాలంటూ అర్నబ్ మండిపడ్డారు. లక్షల మందిని ఇబ్బంది పెట్టిన మంత్రిని నిలదీయకూడదనడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి, ఇది కేంద్ర పరిధిలోని అంశమని, టీడీపీకి సంబంధం లేదని చెప్పాల్సి వచ్చింది.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×