E-Paper
Advertisement

హర్రర్ మూవీ లవర్సా… హాట్‌స్టార్‌ లో ఉన్న టాప్ 5 చిత్రాలను అస్సలు మిస్ అవ్వకండి

హర్రర్ మూవీ లవర్సా… హాట్‌స్టార్‌ లో ఉన్న టాప్ 5 చిత్రాలను అస్సలు మిస్ అవ్వకండి
Advertisement

JioHotstar Horror Movies : ప్రతి సన్నివేశం మీ గుండె వేగాన్ని పెంచుతుంటే, తెరపై ఏం జరగబోతోందో ఊహించడం కష్టంగా ఉంటే… ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడే హారర్ సినిమాలలో అసలైన వినోదం ఉంటుంది. ఇలా భయం, ఉత్కంఠ, సీక్రెట్స్ వంటి అంశాల పవర్ ఫుల్ కలయికతో రూపొందిన చిత్రాల కోసం ఓటీటీలో వెతుకున్నారా ? అవన్నీ ఒకే ఓటీటీలో ఉంటే ఎలా ఉంటుంది. ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌లో ఉన్న ఈ బెస్ట్ హర్రర్ సినిమాలు మీ కోసమే. ఈ చిత్రాలలో దెయ్యాల సంఘటనలు, అతీంద్రియ శక్తుల భయం, దాగి ఉన్న రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. కేవలం జంప్ స్కేర్స్ మాత్రమే కాకుండా, బలమైన కథనం, అద్భుతమైన సినిమాటోగ్రఫీ వంటివి ఉండడం ఈ చిత్రాల ప్రత్యేకత. “ది ట్రైన్ ఆఫ్ డెత్” నుండి “ది బ్లాక్ ఫోన్” వరకు హాట్ స్టార్ లో ఉన్న ఈ చిత్రాలను మీ వాచ్ లిస్ట్‌లో చేర్చుకోవడం మరిచిపోవద్దు.

ది ట్రైన్ ఆఫ్ డెత్ (The Train of Death)

ఇదొక ఇండోనేషియన్ హారర్ చిత్రం. ప్రయాణికులకు పీడకలగా మారిన ఒక రైలు ప్రయాణం గురించి ఉంటుంది స్టోరీ అంతా. ట్రైన్ ముందుకు నడుస్తున్న కొద్దీ భయంకరమైన సంఘటనలు, మరణాలు చోటుచేసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రంలోని ఉత్కంఠభరితమైన, భయంకరమైన వాతావరణం ప్రేక్షకులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది.

ది మీడియం (The Medium)

Advertisement

థాయ్‌లాండ్‌ లోని అత్యంత పాపులర్ హారర్ చిత్రాలలో “ది మీడియం” మూవీ ఒకటి. డాక్యుమెంటరీ తరహా చిత్రం ఇది. అతీంద్రియ శక్తి ఆవహించిన మహిళ శరీరం చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ చిత్రంలోని భయంకరమైన సన్నివేశాలతో పాటు సస్పెన్స్ రాత్రిపూట పీడకలల్లా వెంటాడతాయి.

సెడ్యూసర్ (Seducers)

సైకలాజికల్ హారర్ చిత్రాలను ఇష్టపడే వారికి “సెడ్యూసర్” బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఈ చిత్రంలోని సస్పెన్స్, హారర్ మాత్రమే కాదు సైకలాజికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అవి ప్రేక్షకులను చివరి వరకు ఆలోచింపజేయడం ఖాయం.

ది బ్లాక్ ఫోన్ (The Black Phone)

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న హాలీవుడ్ హారర్ చిత్రం “ది బ్లాక్ ఫోన్”. ప్రమాదకరమైన కిడ్నాపర్ చేత అపహరించబడిన ఒక యువకుడి కథ ఈ చిత్రం. తాళం వేసిన గదిలోని ఒక పాత ఫోన్ అకస్మాత్తుగా మోగడంతో స్టోరీ షురూ అవుతుంది. ఈ చిత్రం సస్పెన్స్, హారర్‌ల అద్భుతమైన సమ్మేళనంగా మారుతుంది.

Also Read : ఈ ఏడాది ఓటీటీలో అదరగొడుతున్న వెబ్ సిరీస్ లు.. వీకెండ్ లో చూస్తే మాజానే వేరు

అదర్స్ (others)

హారర్ జానర్‌ లోని ఉత్తమ చిత్రాలలో ఒకటి, నికోల్ కిడ్‌మన్ నటించిన మూవీ ‘అదర్స్’. పాత ఇంట్లో నివసించే ఒక మహిళ, ఆమె పిల్లల చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. ఆ ఇంట్లో జరిగే వింత వింత సంఘటనలు క్రమంగా ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసే రహస్యాలుగా మారతాయి. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే హారర్ ప్రియులు వణికిపోతారు.

Tags

Related News

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

మనుషులంటేనే పడని మిస్టీరియస్ మనిషి… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

Big Stories

Advertisement
×