E-Paper
Advertisement

సంగారెడ్డిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రభంజనం

సంగారెడ్డిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రభంజనం
Advertisement

TG ECET: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సంగారెడ్డి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE) విభాగం విద్యార్థులు TG ECET–2026లో రాష్ట్ర స్థాయిలో విశిష్ట ర్యాంకులు సాధించి కళాశాల ఖ్యాతిని మరింత పెంచారు. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ పరీక్షలో ECE విభాగానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

ర్యాంకులు సాధించిన విద్యార్థులు

పుట్టి విష్ణు వర్ధన్ – ECE బ్రాంచ్ స్టేట్ ర్యాంక్ 16, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 34
నక్కా సుశ్విత్ – ECE బ్రాంచ్ స్టేట్ ర్యాంక్ 130, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 315
దోసవారి రోహిత్ – ECE బ్రాంచ్ స్టేట్ ర్యాంక్ 189, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 519

భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ..

Advertisement

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జానకి దేవి గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలు మరియు తెలుగు మాధ్యమం నుంచి వచ్చిన విద్యార్థులకు ఇంగ్లీష్ మాధ్యమంలో పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా బోధించడం, వారి భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసే విధంగా అధ్యాపకులు నిరంతరం కృషి చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. అలాగే ECE విభాగాధిపతి డాక్టర్ సి.హెచ్. విద్యాసాగర్ గారు నాయకత్వంలో విభాగ అధ్యాపకులు ప్రత్యేక కోచింగ్, అదనపు తరగతులు, సందేహ నివృత్తి కార్యక్రమాలు, మాక్ టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Also Read: సర్వేలో టాప్ రికార్డ్.. ఫస్ట్ ప్లేస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందంలో..

Advertisement

– డాక్టర్ సి.హెచ్. విద్యాసాగర్ – హెచ్.ఓ.డి., ECE
– ఆర్.కె. విద్యాసాగర్ – సీనియర్ లెక్చరర్, ECE
– టి. మంజుల – లెక్చరర్, ECE
– బి. గోపాల్ రావు – లెక్చరర్, ECE
– జి. సదానందం – లెక్చరర్, ECE
– ఉమాశంకర్ – లెక్చరర్, ECE

ప్రిన్సిపాల్ శ్రీమతి జానకి దేవి..

వారి అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల, విద్యార్థులపై చూపుతున్న శ్రద్ధే ఈ ఫలితాలకు కారణమని తెలిపారు. అంతేకాకుండా, ప్రతి విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఫలితాల్లో కూడా ECE విభాగం కళాశాల గౌరవాన్ని నిలబెడుతూ అత్యుత్తమ ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేస్తోందని, రాష్ట్ర స్థాయిలో చెప్పుకునే విధంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విభాగంగా ECE నిలిచిందని ప్రిన్సిపాల్ శ్రీమతి జానకి దేవి పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తమ విజయానికి ప్రిన్సిపాల్ గారి ప్రోత్సాహం, హెచ్.ఓ.డి. గారి మార్గదర్శకత్వం, అధ్యాపకుల నిరంతర సహకారం, ప్రత్యేక శిక్షణే ప్రధాన కారణమని తెలిపారు. ఈ సందర్భంగా వారు మొత్తం ECE అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విజేతలను అభినందిస్తూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సంగారెడ్డి భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Also Read: గండిపేట భూ కబ్జా కేసులో సంచలనం.. జీవోల కోసం 4కోట్లు..!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×