E-Paper
Advertisement

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా
Advertisement

Psychological Mystery Thriller: మామూలుగా ఒక ఇంట్లో మర్డర్ జరిగితే ముందుగా అనుమానం ఎవరిపై వస్తుంది ? ఇంట్లో వాళ్ళపై మాత్రం కాదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మాత్రం తల్లి చావుకు తండ్రే కారణం అని గట్టిగా నమ్ముతుంది మన హీరోయిన్. ఆ సినిమానే తాజాగా ఓటీటీలోకి వచ్చిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా ‘ది ట్రూథర్స్’ (The Truthers). ఓ హత్య కేసులా స్టార్ట్ అయ్యే ఈ సినిమా, తరువాత ఎవరు చెప్పేది నిజం ? ఎవరు భ్రమల్లో జీవిస్తున్నారు ? అనే కన్ఫ్యూజన్ తో పాటు ప్రతి పాత్రపై అనుమానం కలిగించేలా కథ సాగుతుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

బెర్లిన్‌లో డీజేగా నివసించే అమ్మాయి ఇందులో హీరోయిన్. ఆమె పేరు రూత్. చాలా రోజులుగా తల్లిదండ్రులకు ఆమె దూరంగా ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు తన తల్లి లూసియా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిందనే వార్త వింటుంది. వెంటనే స్వగ్రామానికి చేరుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను ఎక్కువగా కలవరపెట్టేది తల్లి మరణం మాత్రమే కాదు… తన తండ్రి మార్టిన్ ప్రవర్తన కూడా. ఎప్పుడూ అటకపై గదిలో ఒంటరిగా ఉంటూ ప్రపంచాన్ని ఏదో రహస్య శక్తులు కంట్రోల్ చేస్తున్నాయి అంటూ మాట్లాడటం రూత్‌ కు కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది.

Advertisement

తల్లి మరణించిన తీరు, తండ్రి ప్రవర్తన… ఈ రెండూ కలిసి రూత్ మనసులో ఒక పెద్ద అనుమానాన్ని నాటుతాయి. అమ్మను చంపింది నాన్నేనా? అనే ప్రశ్న ఆమెను వెంటాడడంతో కథ టర్న్ అవుతుంది. పోలీసులపై మాత్రమే ఆధారపడకుండా తానే నిజం ఏంటో కనిపెట్టాలని డిసైడ్ అవుతుంది. ఇంట్లోనే ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, గతంలో జరిగిన సంఘటనలను కలుపుకుంటూ తన స్టైల్ లో దర్యాప్తు మొదలుపెడుతుంది.

కానీ ఇన్వెస్టిగేషన్ లో ఎంత లోతుగా వెళ్తే అంతగా కొత్త సందేహాలు ఎదురవుతాయి. మరోవైపు మార్టిన్ మాత్రం ఊరిలో కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కేసు వెనుక భారీ ఫార్మాస్యూటికల్ కంపెనీ హస్తం ఉందని బలంగా నమ్ముతుంటాడు. అందరూ అతన్ని పిచ్చివాడిలా చూస్తారు. కానీ అతను చెబుతున్న ప్రతి విషయం నిజంగానే భ్రమేనా ? లేక అందరికీ కనిపించని నిజాన్ని అతడే చూస్తున్నాడా ? అనే ప్రశ్న కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.

Advertisement

రూత్ తన తండ్రిని అనుమానిస్తూనే దర్యాప్తు కొనసాగిస్తుంది. అదే సమయంలో ఒక్కో ఆధారం బయటపడే కొద్దీ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. లూసియా మరణానికి అసలు కారణం ఎవరు ? మార్టిన్ నిజంగానే భ్రమ పడుతున్నాడా ? లేక అతను చెప్పిన కుట్ర వెనుక నిజం దాగి ఉందా ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను డోంట్ మిస్. చివరి వరకు అసలు నిజాన్ని దర్శకుడు దాచిపెట్టిన విధానం థ్రిల్లర్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది.

తెలుగులో ఉందా ?

‘ది ట్రూథర్స్’కు దర్శకుడు రోజర్ గ్వాల్ దర్శకత్వం వహించారు. స్క్రీన్‌ప్లేలో వచ్చే చిన్న చిన్న క్లూలు చివర్లో పెద్ద ట్విస్టులకు దారి తీయడం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. జూలై 24 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ స్పానిష్ థ్రిల్లర్‌ స్పానిష్, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంది. తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.

Read Also: అమ్మాయి అందంగా ఉందని సొళ్ళు కారిస్తే అరాచకం… తండ్రిని చంపమంటూ షరతు

Tags

Related News

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

ప్రాణంగా చూసుకున్న పాపనే చంపి ఫ్రిడ్జ్ లో… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ సిరీస్

దురదృష్టవంతుడి చేతిలో విశ్వవినాశనాన్ని ఆపే బాధ్యత… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ సిరీస్

బ్యాచిలర్ పార్టీకని వెళ్ళి దిక్కుతోచని చిక్కుల్లో… కట్ చేస్తే బట్టల్లేకుండా బీచ్ లో

లోన్ రాబందుల రెక్కలు విరిచే ఆపద్భాంధవుడు… హార్డ్ హిట్టింగ్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×