E-Paper
Advertisement

జంత‌ర్ మంత‌ర్ టు పార్ల‌మెంట్‌.. తెలంగాణ గ‌ల్లీ నుంచి ఢిల్లీ జెన్‌-జీకి ప్ర‌తిపాద‌న‌..!

జంత‌ర్ మంత‌ర్ టు పార్ల‌మెంట్‌.. తెలంగాణ గ‌ల్లీ నుంచి ఢిల్లీ జెన్‌-జీకి ప్ర‌తిపాద‌న‌..!
Advertisement

అక్క‌డ రాహుల్ జెన్‌-జీకి స్నేహ‌మ‌స్త‌మందించాడు. కాక్రోచుల‌తో క‌లిసి ఉద్య‌మాలు నిర్మిద్దాం రండి.. అని పిలుపునిచ్చాడు. ధ‌ర్మేంద్ర రాజీనామా అంశం.. అది జెన్‌-జీ విజ‌య‌మంత్రం అని కీర్తించి అభినందంన‌లు తెలిపి..త‌మ పార్టీ త‌ర‌పున ప్ర‌తిపాద‌న పంప‌గా.. ఇక్క‌డ రేవంత్‌రెడ్డి ఏకంగా వారిని పార్ల‌మెంటుకు పంపే ప్ర‌తిపాద‌నే చేశారు.

ఇవాళ హైద‌రాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ నిర్వ‌హించిన కాంగ్రెస్‌.. జెన్‌-జీ ఉద్య‌మానికి సంఘీభావం తెలుపుతూనే.. వారు సాధించిన విజ‌యానికి అభినంద‌న‌లు తెలిపింది. ఈ ఉద్య‌మంలో అమ‌రుల‌కు నివాళుల‌ర్పించింది. కేసులు ఎత్తేయాల‌ని ఈ వేదిక‌గా డిమాండ్ చేసింది స‌ర్కార్‌. ఆ కుటుంబాల‌కు ప‌రిహారం, స‌హ‌కారం అందించాల‌ని కేంద్రాన్ని కోరింది.

Advertisement

అనంత‌రం రేవంత్ రెడ్డి ఈ ర్యాలీ వేదిక‌గా మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు. ఇక్క‌డి అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాల నిర్వ‌హ‌ణ ద్వారా ఇక‌పై అసెంబ్లీ, లోక్‌స‌భ‌ల‌కు ఎన్నిక‌య్యేందుకు 25 ఏండ్ల అర్హ‌త వ‌య‌స్సును 21 ఏండ్ల‌కే చేస్తాన‌న్న ఆయ‌న‌.. ఇది మిగిలిన రాష్ట్రాల‌కు కూడా రోల్ మోడ‌ల్‌గా ఉండాల‌న్నారు.

అయితే జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద పోరాటం చేసి.. ఫ‌లితం సాధించిన జెన్-జీ ఉద్య‌మ‌కారులు.. మోడీ మెడ‌లు వంచి.. ధ‌ర్మేంద్ర రాజీనామా చేయాల్సిన అనివార్య‌త‌ను తెచ్చిపెట్టిన కాక్రోచ్ పార్టీ నేత‌లు.. అక్క‌డి నుంచి తిరిగి ఇళ్ల‌లోకి కాదు వెళ్లాల్సింది.. పార్ల‌మెంటుకు అన్నారు.

Advertisement

యువ‌తే విద్యాశాఖ మంత్రిగా ఉంటే.. ఈ లీకులు ఉండ‌వ‌ని, వారికి స‌రైన అవ‌గాహ‌న ఉండి.. ప్ర‌భుత్వంలో భాగంగా బాధ్యాతాయుతంగా ప‌నిచేయ‌గ‌లుగుతార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. జెన్‌-జీ యువ‌త‌నే విద్యాశాఖ మంత్రిగా చేసే బాధ్య‌త త‌నదేన‌న్నాడు రేవంత్‌. రాహుల్‌ను ప్ర‌ధానిని చేస్తాన‌న్న ఆయ‌న‌.. ఇండి కూట‌మి నేత‌ల‌తో మాట్లాడి.. యువ‌త‌లోంచి ఒక‌రిని విద్యాశాఖ మంత్రిగా చేసేందుకు ఒప్పిస్తాన‌ని హామీ ఇచ్చారు.

ఈ విజ‌యం చారిత్రాత్మ‌క‌మ‌ని, నియంతృత్వ పోక‌డ‌ల‌తో ఉన్న మోడీ ప్ర‌భుత్వం మెడ‌లు వంచ‌గ‌లిగిందంటే.. యువ‌త శ‌క్తి ఇవాళ దేశానికి మ‌రోసారి చాటి చెప్పిన‌ట్ట‌య్యింద‌న్నారు. యువ‌త‌తో క‌లిసి ప‌నిచేసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంద‌న్నారు. జంత‌ర్ మంత‌ర్ పోరాటం మీది.. విజ‌య‌మూ మీదే.. కానీ ఈ విజ‌యం జంత‌ర్ మంత‌ర్ వ‌ద్దే ముగిసిపోవ‌ద్దు.. పార్ల‌మెంటు గ‌డ‌ప తొక్కాలె… ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం కావాలె..!అని ఆయ‌న పిలుపునిచ్చారు.

రేప‌టి ఎన్నిక‌లకు యువ‌త రెడీగా ఉండాల‌ని కోరారు. విద్యామంత్రిగా జెన్‌-జీ కాబోతున్నాడ‌ని కూడా ప్ర‌క‌టించారు ఈ వేదిక‌గా.

Related News

కాక్రోచులకు అండగా కాంగ్రెస్‌.. విద్యార్థి ఉద్య‌మాల‌కు వెన్నుద‌న్నుగా ఉంటాం!

ఎప్పుడు త‌గ్గాలో తెలుసుకున్నాడు.. కానీ నెగ్గ‌లేదు! అభిమానుల‌కు మింగుడు ప‌డ‌ని మోడీ నిర్ణ‌యం..

హ‌మ్మ‌య్య‌.. ఊపిరిపీల్చుకున్న టాలీవుడ్‌.. మ‌న సెల‌బ్రిటీలు తేలుకుట్టిన దొంగ‌లు..!

బొద్దింక‌ల చేత‌జిక్కి … చేతులు కాలాక ఆకులు.. బద్నాం చేసిన పంతం..!

సారొస్తారు..! జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తారు…అవసరమైతేనే..!

కాక్రోచుల ఆందోళ‌న వెనుక అరాచ‌క‌శ‌క్తులు..? ఈట‌లేమంటారో??

ATMలో కార్డ్ ఇరుక్కుపోతే అసలు ఏమవుతుంది?

Big Stories

Advertisement
×