E-Paper
Advertisement

ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే వరుస హత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీ… అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్

ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే వరుస హత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీ… అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్
Advertisement

Thriller Series OTT : ఓటీటీలో ఒక తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుస హత్యల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఓటీటీలో బాగా ట్రెండ్ కూడా అయింది. ఈ సిరీస్‌లో ఫోరెన్సిక్ డీటెయిల్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. శవాల మేకప్, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ చూసేటప్పుడు మనకి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అందుకే ఈ సిరీస్ మొదటి సీజన్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ రావడంతో, రెండో సీజన్‌కు తీయడం జరిగింది. ఇది కూడా ఊహించని రీతిలో సూపర్ హిట్ అయింది. దీనికి ఐయండిబిలో 7.3 రేటింగ్ కూడా ఉంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి మంచి మజా ఇచ్చే సిరీస్ ఇది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

2020లో వచ్చిన ఈ తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది విక్టిమ్స్ గేమ్’ (The Victims’ Game). ఇందులో జోసెఫ్ చాంగ్, హ్సు వీ-నింగ్, షి-హ్సియన్ వాంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంది. అలాగే హీరో కూతురి పాత్రలో నటించిన మూన్ లీ తన పెర్ఫార్మెన్స్‌తో అందరినీ షాక్ కి గురిచేసింది. ఆమె నటనకు గానూ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ బెల్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ న్యూకమర్’ అవార్డు కూడా వరించింది. ఇక సీజన్ 2 కోసం దాదాపు నాలుగేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. 2024లో వచ్చిన ఈ పార్ట్ 2 మొదటి దానికంటే పవర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో జపనీస్ స్టార్ నటుడు డీన్ ఫుజియోకా ప్రాసిక్యూటర్‌గా కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇందులో ఫాంగ్ అనే ఒక ఫోరెన్సిక్ ఆఫీసర్ ఉంటాడు. ఆయనకి లోకంతో పెద్దగా సంబంధం ఉండదు, తన పని తాను చేసుకుపోయే రకం . ఒకరోజు ఒక వింతైన హత్య కేసు వస్తుంది. ఆ డెడ్ బాడీని చూసి ఆధారాలు వెతుకుతుంటే, అక్కడ తనకి ఎప్పుడో దూరమైపోయిన తన కూతురి వేలిముద్రలు కనిపిస్తాయి. తన కూతురు ఒక సీరియల్ కిల్లర్ అయి ఉంటుందా లేక ఈ గొడవలో చిక్కుకుపోయిందా అని భయం పట్టుకుంటుంది అతనికి. పోలీసులకి ఈ విషయం తెలిస్తే తన కూతుర్ని అరెస్ట్ చేస్తారని, ఆ నిజాన్ని దాచిపెట్టి తనే రహస్యంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు.

ఈ క్రమంలో అతనికి ఒక రిపోర్టర్ తగులుతుంది. ఆవిడకి బ్రేకింగ్ న్యూస్ కావాలి, ఇతనికి తన కూతురు ఎక్కడుందో తెలియాలి. ఇద్దరూ కలిసి ఈ కేసుల గుట్టు విప్పడం మొదలుపెడతారు. అయితే ఇక్కడ జరిగేవి మామూలు హత్యలు కావు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా చనిపోతుంటారు, కానీ అది ఆత్మహత్యలా లేక హత్యలా అన్నట్టుగా ఉంటుంది. ఆ గొలుసుకట్టు చావుల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఫాంగ్ కూతురుకు ఈ హత్యలతో సంబంధం ఉందా ? అసలు ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి ? అనే విషయాలతో ఈ సిరీస్ ఉత్కంఠగా సాగుతుంది.

Advertisement

Read Also : వరుస హత్యలతో వణికిపోయే రాత్రి… భయానికి అర్థం మార్చే సరికొత్త మిస్టరీ

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×