E-Paper
Advertisement

OTT Movie : భూమి అంతం… జనాలంతా కొత్త గ్రహంపైకి… గూస్ బంప్స్ తెప్పించే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : భూమి అంతం… జనాలంతా కొత్త గ్రహంపైకి… గూస్ బంప్స్ తెప్పించే సై-ఫై థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఇప్పటివరకు వచ్చిన టాప్ 5 స్పేస్ మూవీల్లో ఒకటిగా ఓ చైనీస్ మూవీ రికార్డులు సృష్టించింది. ఇది థియేటర్లలో విడుదలై $700 మిలియన్లను కలెక్ట్ చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఈ కథలో భూమిని మరో సోలార్ సిస్టమ్ లోకి తరలించాల్సి ఉంటుంది. ఇక్కడ సూర్యుడి వల్ల పెను ప్రమాదం రానుండటంతో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ ప్రయాణం కూడా ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ప్రపంచానికి ఇలాంటి దుస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి ? అని ప్రేక్షకులు కూడా ఆలోచనలో పడతారు. మరి ఇలాంటి సినిమాను మిస్ చేసుకోకుండా ఓ లుక్ వేయండి. మూవీ చాలా బాగుంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2019లో వచ్చిన ఈ చైనీస్ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘ది వాండరింగ్ ఎర్త్’ (The Wandering Earth). డైరెక్టర్ ఫ్రాంట్ గువో తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఇందులో వూ జింగ్ (లియు పీకియాంగ్), చ్వీ హ్వూక్ (లియు కి), లీ గ్వాంగ్‌జీ (వాంగ్ లీ), జావో జిన్మై (హాన్ దువోదువో) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2019 ఫిబ్రవరి 5న థియేటర్స్‌లో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. 125 నిమిషాల రన్‌ టైమ్ తో ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో డబ్బింగ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సైంటిస్టులు ఒక కొత్త విషయం కనిపెడతారు. 50 ఏళ్లలో సూర్యుడు యర్రగా మండుతూ , మరింత పెద్దదిగా మారి భూమి మొత్తం కాలిపోతుందని సైంటిస్టులు కనుగొంటారు. ప్రపంచం మొత్తం ఒక్కటై ఒక భారీ ప్లాన్ అమలు చేయాలని అనుకుంటుంది. భూమిని సోలార్ సిస్టమ్ నుంచి బయటికి తీసుకెళ్లి, వేరే స్టార్ సిస్టమ్‌కి తరలించడం ఇప్పుడు సైంటిస్టులు ముందు ఉన్న లక్ష్యం. భూమి మీద 10,000 గ్రహాంతర రాకెట్ ఇంజన్లు పెట్టి, భూమి మొత్తాన్ని ఒక భారీ స్పేస్‌షిప్‌లా మార్చేస్తారు. అంతే కాదు భూమి కింద 35 లక్షల మంది మాత్రమే బతకడానికి ఒక భారీ అండర్‌గ్రౌండ్ సిటీని కడతారు.

OTT Movie : పూర్వీకుల ఇంట్లో పిల్ల మిస్సింగ్… తల్లిని టెన్షన్ పెట్టే టైం లూప్… ఫ్యూజులు అవుటయ్యే హర్రర్ మూవీ

Advertisement

ఈ ప్రయాణం 2500 ఏళ్ల పాటు ఉంటుంది. మొదట జూపిటర్ దగ్గరకు జర్నీ వెళ్తుంది. భూమి జూపిటర్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక్కసారిగా పెద్ద డేంజర్ వస్తుంది. జూపిటర్ గ్రావిటీ భూమిని లాక్కుంటూ ఉంటుంది. ఇంజన్లు ఆఫ్ అయిపోతాయి, భూమి జూపిటర్ అట్మాస్ఫియర్‌లోకి క్రాష్ అయిపోతుంది. ఇక 100 గంటల్లోనే భూమి మొత్తం నాశనం అయిపోతుంది. చివరి 30 నిమిషాలు ఫుల్ టెన్షన్ ఉంటుంది. చివరికి సైంటిస్టులు భూమిని కాపాడతారా ? మరో సోలార్ సిస్టమ్ కి తరలిస్తారా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×