E-Paper
Advertisement

Maruva Tarama Trailer : రష్మిక డైరెక్టర్ మెచ్చిన ‘మరువ తరమా’ ట్రైలర్… ఎలా ఉందంటే?

Maruva Tarama Trailer : రష్మిక డైరెక్టర్ మెచ్చిన ‘మరువ తరమా’ ట్రైలర్… ఎలా ఉందంటే?
Advertisement

Maruva Tarama Trailer: ఫీల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు. ఎంగేజింగ్ స్టోరీ ఉండాలే కానీ ఈ జానర్లో వచ్చే సినిమాలకు స్టార్ క్యాస్ట్ తో కూడా పనుండదు. ఇప్పటిదాకా అలా వచ్చి, ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీల చేత శభాష్ అనిపించుకున్న కథలెన్నో. అలాంటి సినిమాల లిస్ట్ లో చేరబోతోంది ‘మరువ తరమా’. ఈ సినిమా ట్రైలర్ పై రష్మిక డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘మరువ తరమా’ ట్రైలర్ పై ప్రశంసలు

చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మరువ తరమా’. ఇందులో హరీష్ ధనుంజయ, అవంతిక హరి నల్వాల, అతుల్య చంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ అందమైన ప్రేమకథను సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై రమణ మూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్.వి.విజయ్‌కుమార్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 28న థియేటర్లలో ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ట్రైలర్‌ ను రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. ‘మరువ తరమా’ మూవీకి విజయ్ బుల్గానిన్, అరిష్ ఈ మూవీకి సంగీతం అందించారు. రుద్ర సాయి సినిమాటోగ్రాఫర్‌, కేఎస్ఆర్ ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టారు. .

స్టార్ డైరెక్టర్ సపోర్ట్

Advertisement

ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ పై రష్మిక మందన్న డైరెక్టర్, నటుడు రాహుల్ రవీంద్రన్ ప్రశంసలు కురిపించారు. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీతో రాహుల్ రవీంద్రన్ ఇటివలే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డైరెక్టర్ ‘మరువ తరమా’ మూవీ ట్రైలర్ ను చూసి, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ట్రైలర్ ఫ్రెష్ విజువల్స్, మంచి మ్యూజిక్ తో అట్రాక్టివ్ గా ఉందని, ట్రైలర్ పరంగా చూస్తే ఎమోషనల్ గా అనిపిస్తోందని అన్నారాయన. ఈ మూవీ కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని, సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకున్నారు రాహుల్. కాగా ట్రైలర్ లో వచ్చే డైలాగులన్నీ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అలాగే హీరో జర్నీ ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి మదర్ సెంటిమెంట్ తో ఆకట్టుకునేలా ట్రైలర్ ను కట్ చేశారు. మరి ఆ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

Advertisement

Read Also : మార్షల్ ఆర్టిస్ట్ కు అప్పనంగా పోలీస్ జాబ్… క్రిమినల్స్ కు దబిడి దిబిడే… యాక్షన్ ప్రియులకు పక్కా కిక్కిచ్చే మూవీ

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×