BigTV English

Shivani Nagaram: బ్రేకప్ దెబ్బ.. అలాంటి వాడే భర్తగా రావాలంటున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ!

Shivani Nagaram: బ్రేకప్ దెబ్బ.. అలాంటి వాడే భర్తగా రావాలంటున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ!

Shivani Nagaram: లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు తమిళ్ నుండి శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ‘మదరాశి’ సినిమా.. ఇటు తెలుగు నుండి అనుష్క శెట్టి (Anushka Shetty) ‘ఘాటి’ రెండు చిత్రాలు సెప్టెంబర్ 5న ఈ సినిమాతో సహా విడుదల అవ్వగా ఈ రెండు చిత్రాలను కూడా పక్కనపెట్టి లిటిల్ హార్ట్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది. ఇందులో హీరోయిన్ గా నటించి తన నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది శివాని నాగారం.(Sivani Nagaram). ఈ సినిమా కంటే ముందు పలు చిత్రాలలో చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ ఒక్క సినిమాతో కాత్యాయని పాత్ర పోషించి భారీ పాపులారిటీ అందుకుంది.


యూట్యూబ్ ఛానల్స్ కి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న శివాని..

అంతేకాదు ఈ సినిమాలో ఈమె పోషించిన పాత్రకు అలాగే ఇందులో ఈమె పేరుపైన వచ్చిన రెండు పాటలు కూడా భారీ సక్సెస్ అవ్వడంతో తన ఇన్స్టా ఖాతాలో కూడా తన పేరును కాత్యాయని ఆకులగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ తో అందరి దృష్టిలో పడ్డ ఈమె.. పలు యూట్యూబ్ ఛానల్స్ కు హాజరవుతూ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగానే తాజాగా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తన లవ్ బ్రేకప్ గురించి చెబుతూ.. తనకు ఎలాంటి వాడు భర్తగా రావాలో కూడా తెలిపింది.

లవ్ బ్రేకప్ పై శివాని క్లారిటీ..


తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాని నాగారం మాట్లాడుతూ.. “నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ట్యూషన్ లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నాకేమో మ్యాథ్స్ రాదు.. కానీ ఆ అబ్బాయి మ్యాథ్స్ లో టాపర్.. అయితే అబ్బాయికి నేను డైరీ మిల్క్ సిల్క్ బహుమతిగా ఇచ్చి లవ్ ప్రపోజ్ చేశాను. అయితే అతను మాత్రం నేను ఇచ్చిన సిల్క్ చాక్లెట్ తీసుకొని నన్ను రిజెక్ట్ చేశాడు. అలాంటి ఫీలింగ్స్ లేవని, తను నన్ను చెల్లిగా భావిస్తున్నాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. ఇంకా అప్పటినుంచి లవ్ ఫై నాకు ఫీలింగే కలగలేదు..ఇప్పటికీ కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు” అంటూ తెలిపింది.

అలాంటి వాడే భర్తగా రావాలి – శివాని

ఇక తనకు కాబోయే వాడిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయంపై కూడా ఆమె మాట్లాడుతూ.. “అందరిలాగే నేను కూడా అమ్మాయినే కదా అందరికీ ఎలాంటి ఆలోచనలు ఉంటాయో నావి కూడా అలాంటివే. నన్ను బాగా చూసుకోవాలి .చెప్పిన మాట వినాలి. వంట వచ్చి ఉండాలి” అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే శివాని చెప్పిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ప్రస్తుతం సినిమాల పైన దృష్టి పెట్టిన ఈమె.. అటు కెరియర్ లో ఎన్నో స్ట్రగుల్స్ పడ్డట్లు తెలుస్తోంది. ఇకపోతే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు ఈ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకుంది.

ALSO READ:Betting Apps: బాలీవుడ్ వంతు.. ఆ స్టార్ హీరోయిన్స్ కి ఈడీ నోటీసులు!

Related News

Maruthi: సినిమా కోసం ఇంతలా దిగజారకండి.. ఆ డైరెక్టర్‌కు మారుతి చురకలు

Rajinikanth : బాలును ఇళయరాజ పాడొద్దన్నారు, కానీ.. ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నారు

Betting Apps: బాలీవుడ్ వంతు.. ఆ స్టార్ హీరోయిన్స్ కి ఈడీ నోటీసులు!

Sai Tej : సాయి తేజ్ పై ట్రోల్స్, జానీ మాస్టర్ ను ఎందుకు వదిలేసినట్టు

Tollywood Heroine: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్!

Ram Gopal Varma: మంచు మనోజ్ పై వర్మ ఊహించని కామెంట్.. అంత మాట అన్నారేంటి?

Mirai Part 2 : అందుకే నిధి అగర్వాల్ ఐటెమ్ సాంగ్ దాచాం.. మరి వైబ్ సాంగ్ పరిస్థితి ఏమిటీ?

Big Stories

×