E-Paper
Advertisement

OTT Movie : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : థ్రిల్లర్ డ్రామాలు, సస్పెన్స్‌ఫుల్ కథలు… ఎమోషనల్ డెప్త్, ఊహించని ట్విస్ట్‌లతో నిండి ఉండే సినిమాలు ఎంగేజింగ్ గా ఉండి, ఆడియన్స్ ను స్క్రీన్ లకు కట్టిపడేస్తాయి. ఇప్పుడు 2025లోనే రిలీజ్ అయిన అలాంటి ఒక గ్రిప్పింగ్ తమిళ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫ్రెండ్స్ గ్రూప్ మిస్టీరియస్ డెత్, ఫియర్, కవర్-అప్ కాన్సెక్వెన్సెస్‌ వంటి అంశాలు మెండుగా ఉంటాయి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Yaadhum Ariyaan (2025) 96-నిమిషాల తమిళ థ్రిల్లర్ మూవీ. ఎం. గోపి రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2025 జూలై 18న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. OTTలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ఈ మూవీలో తంబి రామయ్య (సోప్పన సుందరం), అప్పు కుట్టి (మని మేనేజర్), వి. దినేష్ (జీవన్), బ్రానా (షాలు), ఆనంద్ పాండి (ప్రభు), ష్యామల్ (షిబి), ఉరియాడి అనందరాజ్ (పర్ఫెక్ట్ రామకృష్ణ), రాజా కుమారి (రాజి) తదితరులు నటించారు. థియేటర్లలో సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం మంచి ఆదరణే దక్కించుకుంటోంది.

స్టోరీలోకి వెళ్తే 

Advertisement

కథ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వారి గర్ల్‌ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ జంటలు రిలాక్స్ అవ్వడానికి ఒక ఫారెస్ట్‌లోకి వెళ్లి, ఒక ఐసోలేటెడ్ ఫారెస్ట్ బంగ్లాలో ఓ రాత్రి గడుపుతారు. ఆరోజు రాత్రి ఒక గర్ల్‌ఫ్రెండ్ తన బాయ్‌ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు మిస్టీరియస్‌గా చనిపోతుంది. గ్రూప్‌లో అసలేం జరిగిందో తెలియక భయం, కన్ఫ్యూజన్ పెరుగుతుంది. ఒక్కరికి కూడా ఆమె ఎలా, ఎందుకు చనిపోయిందో తెలియదు. బాడీ అక్కడే ఉండడంతో టెన్షన్ పెరుగుతుంది. పైగా హెల్ప్ చేయడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు.

దీంతో మిగిలిన ముగ్గురూ కలిసి ఇన్సిడెంట్‌ను కవర్ అప్ చేయాలని నిర్ణయిస్తారు. కానీ ఆ చాయిస్ వాళ్ళను మరింత టెర్రిఫైయింగ్ కాన్సెక్వెన్సెస్ వైపు నడిపిస్తుంది. నెమ్మదిగా అసలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అనే అనుమానాలు ఒక్కొక్కరిలో మొదలవుతాయి. తమలో తామే ఒకరిపై ఒకరు అనుమాన పడడం మొదలు పెడతారు. క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్‌తో ముగుస్తుంది. మరి క్లైమాక్స్ ఏంటి? అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : సైకో నుంచి మనుషుల్ని తినే మనిషి వరకు… ఒకే సినిమాలో 6 స్టోరీలు… గుండె గుభేల్మన్పించే హర్రర్ మూవీ

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×