E-Paper
Advertisement

రెండేళ్ల కొడుకు ముందే తల్లి దారుణ హత్య… ఈ మినీ సిరీస్ ను డోంట్ మిస్

రెండేళ్ల కొడుకు ముందే తల్లి దారుణ హత్య… ఈ మినీ సిరీస్ ను డోంట్ మిస్
Advertisement

True Crime Mini Series on OTT : వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చే కొన్ని వెబ్ సిరీస్‌ లు మనల్ని తీవ్రంగా కదిలిస్తాయి. అలాంటి ఒక సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఆ సిరీస్ పేరు The Witness. జూన్ 4న విడుదలైన ఈ మినీ సిరీస్ చూసిన వాళ్లు షాక్‌తో పాటు బాధ, కోపం, జాలి అన్నీ ఒకేసారి ఫీల్ అవుతున్నారు. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

1992 జూలై 15వ తేదీ… లండన్‌ లోని వింబుల్డన్ కామన్ అనే అందమైన పార్క్. 23 ఏళ్ల యువతి రాచెల్ నికెల్ తన 2 ఏళ్ల కొడుకు అలెక్స్‌ ను తీసుకుని మార్నింగ్ వాక్ కు వెళ్తుంది. ఎప్పటిలాగే వాళ్లిద్దరూ ఆనందంగా ఉంటారు. అయితే అక్కడికి ఒక అపరిచితుడు వచ్చి రాచెల్‌ పై దారుణమైన దాడి చేసి, ఆమెను క్రూరంగా హత్య చేసేస్తాడు. ఆ భయంకర దృశ్యాన్ని తన కళ్లారా చూసిన ఏకైక వ్యక్తి ఆ చిన్నారి అలెక్స్ మాత్రమే. ఆ సమయంలో అలెక్స్ కి ఇంకా 2 ఏళ్లే కాబట్టి సరిగ్గా మాట్లాడలేడు. కేవలం కొన్ని మాటలు, సంకేతాలు మాత్రమే చెప్పగలడు. ఇది పోలీసు దర్యాప్తును చాలా క్లిష్టంగా చేస్తుంది.

Advertisement

రాచెల్ భర్త ఆండ్రే ఈ వార్త విన్న వెంటనే దిగ్భ్రాంతికి గురవుతాడు. భార్యను కోల్పోయిన దుఃఖంతో పాటు, తన కొడుకు మానసిక స్థితి చూసి ఆయన పడే బాధ రెట్టింపవుతుంది. అలెక్స్ రాత్రులు నిద్రపోలేక, భయంతో అరవడం, తల్లిని గుర్తు చేసుకుని ఏడవడం వంటివి చేస్తాడు. ఇలా ఆ చిన్న పిల్లవాడు తీవ్ర ట్రామాకు గురవుతాడు. ఆండ్రే తన కొడుకును రక్షించుకోవడానికి లండన్ వదిలి ఫ్రాన్స్‌కు వెళ్లిపోతాడు. పోలీసులు భారీ ఒత్తిడిలో దర్యాప్తు చేస్తారు. కానీ వాళ్ళు రాంగ్ రూట్ లో వెళతారు. ఒక నిరపరాధి కొలిన్ స్టాగ్ అనే వ్యక్తిని తప్పుడు ఆధారాలతో అరెస్టు చేసి, కేసును ముగించేస్తారు. ఈ తప్పిదం కారణంగా నిజమైన నేరస్తుడు తప్పించుకుంటాడు. సంవత్సరాలు గడుస్తాయి. ఆండ్రే తన కొడుకుతో కొత్త జీవితం మొదలు పెడతాడు. కానీ రాచెల్ హత్య కేసు మాత్రం క్లోజ్ కాదు. చివరికి ఎన్నో సంవత్సరాల తర్వాత నిజమైన నేరస్తుడిని పట్టుకుని ఆ కుటుంబానికి న్యాయం చేశారా ? ఆ చిన్నారి అలెక్స్ జీవితం ఎలా మారింది ? తండ్రి-కొడుకు ఇద్దరూ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ? అనేది ఈ 3 ఎపిసోడ్‌ల సిరీస్‌లో చాలా ఎమోషనల్‌ గా చూపించారు.

Also Read : ఓటీటీలో దుమ్మురేపుతున్న 2500 కోట్ల హర్రర్ థ్రిల్లర్… ఇంకా చూడలేదా ?

3 ఎపిసోడ్‌లు

Advertisement

మొత్తం కేవలం 3 ఎపిసోడ్‌ లు మాత్రమే ఉన్న మినీ సిరీస్ ఇది. ఒక్కసారిలోనే చూడడం ముగించేసుకోవచ్చు. కానీ చూసిన తర్వాత మనసు విరిగిపోతుంది. నిజ ఘటన ఆధారంగా రూపొందినందున ఇంకా ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. పోలీసు వైఫల్యాలు, కుటుంబం మీద పడిన భారం చూసి చాలా మందికి కోపం వస్తుంది. అదే సమయంలో ఆ చిన్నారి పట్ల జాలి కలుగుతుంది. IMDbలో ఈ సిరీస్‌కు 6.7 రేటింగ్ ఉంది. నటన, డైరెక్షన్ బాగున్నాయి. రియల్ స్టోరీస్ ఇష్టపడే వాళ్లు, క్రైమ్ డాక్యు డ్రామాలు చూసేవాళ్లు తప్పకుండా చూడాలి. నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడు అందుబాటులో ఉంది. ఒంటరిగా చూడకండి, ఎందుకంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సిరీస్ మీకు ఎప్పటికీ మర్చిపోని అనుభవం ఇస్తుంది. జాలి, ఆగ్రహం, న్యాయం కోసం ఆశ.. అన్నీ కలిపి ఉన్న పవర్ ఫుల్ సిరీస్ The Witness.

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×