E-Paper
Advertisement

OTT Movie : భర్త ఉండగా మరో అబ్బాయితో… ఇద్దరమ్మాయిల అంతుచిక్కని క్రైమ్ కథ

OTT Movie : భర్త ఉండగా మరో అబ్బాయితో… ఇద్దరమ్మాయిల అంతుచిక్కని క్రైమ్ కథ
Advertisement

OTT Movie : రోడ్ ట్రిప్ సినిమాలు చూసే కొద్ది చూడాలనిపిస్తుంటాయి. అందులోనూ థ్రిల్లర్ సినిమాల ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఫెమినిస్ట్ రెవల్యూషన్‌కి గుండె చప్పుడుగా చెప్పుకుంటారు. 90స్ లో వచ్చిన ఈ సినిమా 6 ఆస్కార్‌ నామినేషన్స్ సాధించింది. అందులో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కాలీ ఖూరీకి అవార్డు వరించింది. ఈ సినిమాతోనే బ్రాడ్ పిట్ సూపర్ స్టార్ అయ్యాడు. ఈ కథ రోడ్ ట్రిప్ కి వెళ్లే ఇద్దరమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్ సీన్ చూస్తే మతి పోతుంది. ఈ రోడ్ అడ్వెంచర్ మూవీ ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

1991లో విడుదలైన ఈ అమెరికన్ రోడ్ అడ్వెంచర్ క్రైమ్ మూవీ పేరు ‘థెల్మా & లూయిస్’. ఫెమినిస్ట్ సినిమా చరిత్రలో ల్యాండ్‌మార్క్ ఫిల్మ్. రిడ్లీ స్కాట్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే కాలీ ఖూరీ అందించారు. ఆమె ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ ని కూడా అందుకున్నారు. ఇందులో సుసాన్ సరాండన్, జీనా డేవిస్, హార్వీ కీటెల్, బ్రాడ్ పిట్ లీడ్ రోల్స్ లో నటించారు. 2 గం 10 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 7.6/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. భారతదేశంలో హిందీ, తెలుగు, తమిళ్ డబ్బింగ్ వెర్షన్స్ లో కూడా ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

థెల్మా అనే వివాహిత ఒక కంట్రోలింగ్ హస్బెండ్ డారిల్‌తో బతుకుతుంటుంది. రిలాక్స్ కోసం ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ లూయిస్ తో ఒక వీకెండ్ ట్రిప్‌కి ఒక థండర్‌ బర్డ్ కారులో బయలుదేరుతుంది. మొదటి రాత్రే వీళ్ళు ఒక రోడ్‌సైడ్ బార్‌లో ఆగి డ్రింక్స్ తాగుతారు. థెల్మా హార్లాన్ అనే వ్యక్తితో డాన్స్ చేసి పార్కింగ్‌లో రేప్ అటెంప్ట్‌కి గురవుతుంది. లూయిస్ గన్ తీసి వచ్చి రక్షిస్తుంది కానీ హార్లాన్ వల్గర్‌గా మాట్లాడగానే వాడిని కాల్చి చంపేస్తుంది. ఇక పోలీసులకు చెప్పకుండా మెక్సికో వైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు.

Read Also : జాంబీలుగా మారే సైంటిస్ట్ ఫ్యామిలీ… ఊరు ఊరంతా వల్లకాడు … ఇదెక్కడి అరాచకం భయ్యా

Advertisement

ఈ సమయంలో రోడ్ మీద వెళ్తున్న జె.డి అనే ఒక సెక్సీ యువకుడిని (బ్రాడ్ పిట్)ని ఎక్కించుకుంటారు. థెల్మా జె.డితో ఒక రాత్రి గడిపి తన లైఫ్‌లో మొదటిసారి నిజమైన సుఖాన్ని అనుభవిస్తుంది. కానీ జె.డి. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు మొత్తం దొంగిలించి పారిపోతాడు. డబ్బు లేకుండానే ఇద్దరూ ముందుకు సాగుతారు. ఈ సంఘటనతో థెల్మా పూర్తి రెబల్ గా మారిపోతుంది. వల్గర్ గా బిహేవ్ చేసిన ఒక ట్రక్ డ్రైవర్ ని గన్‌తో బెదిరించి ట్యాంకర్ ను పేల్చేస్తుంది. పోలీసులు హెలికాప్టర్లతో వీళ్ళని చేజ్ చేస్తారు. ఇక క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. లూయిస్-థెల్మా కారులోనే కౌగిలించుకుని స్మైల్ చేస్తూ లోయలోకి దూకేస్తారు. స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన ఒక ఐకానిక్ ఎండింగ్ తో ఈ కథ ముగుస్తుంది.

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×