E-Paper
Advertisement

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి 13 సినిమాలు.. ఆ 5 వెరీ స్పెషల్..డోంట్ మిస్..

This Week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి 13 సినిమాలు.. ఆ 5 వెరీ స్పెషల్..డోంట్ మిస్..
Advertisement

This Week OTT Releases: మరో వారం వచ్చేసింది.. ప్రతి సోమవారం ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు వచ్చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే.. అయితే ఈ వారం థియేటర్లోకి పెద్దగా సినిమాలు రాకపోవడంతో మూవీ లవర్స్ ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. స్టార్ హీరోల సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి ఇక ఓటిటి ప్లాట్ఫామ్ లు కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి.. మరి ఈవారం ఓటీడీలోకి ఎలాంటి సినిమాలు వస్తున్నాయో అన్నది ఆసక్తిగా మారింది.. మరి ఆలస్యం లేకుండా ఓటీటీ సినిమాలు ఏవో చూద్దాం..

ఈ వారం దాదాపు ఓటీటీల్లోకి 13 సినిమాలు రాబోతున్నాయి. ఆది సాయి కుమార్ ‘శంబాల’, హెబ్బా పటేల్ ‘మారియో’, శోభితా ధూళిపాళ ‘చీకటిలో’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘సర్వం మాయ’, ‘ఛాంపియన్ సినిమాలు ఉన్నాయి దీంతో పాటుగా దురంధర్ మూవీ కూడా రాబోతుంది.. గత ఏడాది చివరి నెలలో రిలీజ్ అయిన ఈ సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసాయి… మరి వీటిని మిస్ అవ్వకుండా మీకు ఇష్టమైన ఓటీటీలో చూసేయండి.. ఏయే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

అమెజాన్ ప్రైమ్..

Advertisement

శంబాల – జనవరి 26

దాల్ దాల్ – జనవరి 30

Advertisement

ది రీకింగ్ క్రూవ్- జనవరి 28

నెట్‌ఫ్లిక్స్..

టెక్ దట్ – జనవరి 27

దురంధర్ – జనవరి 30

ఛాంపియన్ – జనవరి 29

బ్రిడ్జ్ ఆర్టన్ సీజన్ 4 -జనవరి 29

జీ5..

దేవ్ ఖేల్ – జనవరి 30

ఆహా..

ష్రింకింగ్ సీజన్ 3 – జనవరి 28

ఈటీవీ విన్..

గొల్ల రామవ్వ- జనవరి 25

Also Read:తాయారు కు కొత్త టెన్షన్.. మహాను అవమానించిన ఆది.. భూషణ్ కు దిమ్మతిరిగే షాక్..

గత వారం ఓటీటీ లోకి వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. అంతేకాదు వెబ్ సిరీస్ లతోపాటుగా సినిమాలు కూడా జనాలను అలరించడానికి రెడీగా ఉన్నాయి.. ముఖ్యంగా బాలీవుడ్ అభిమానులు రణవీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫారం లోకి రాబోతుంది. అలాగే రోషన్ మేక నటించిన చాంపియన్ మూవీ కూడా జనాలకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పటి వరకైతే ఈ సినిమాలు డేట్ ని లాక్ చేసుకున్నాయి. ఈ వారంలో మరికొన్ని సినిమాలు సడన్గా ఓటీడీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది .

ఇకపోతే ఈవారం పాత సినిమాలు రిలీజ్ అయినా.. వచ్చేవారం మాత్రం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. థియేటర్లలో సంక్రాంతి సినిమాలో సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతున్నాయి. వచ్చేవారం సంక్రాంతి సినిమాలు కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి.. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమాలు అక్కడ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటే చూడాలి. ఇక ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ స్టార్ హీరోల సినిమాలు కొన్ని థియేటర్లలోకి రాబోతున్నాయి.. వాటికోసం జనాలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×