E-Paper
Advertisement

Podarillu Today Episode : తాయారు కు కొత్త టెన్షన్.. మహాను అవమానించిన ఆది.. భూషణ్ కు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : తాయారు కు కొత్త టెన్షన్.. మహాను అవమానించిన ఆది.. భూషణ్ కు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Podarillu Today Episode January 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా హారికతో మాట్లాడుతుంది. అమ్మ నాన్న ఎలా ఉన్నారు వదినా అని అడుగుతుంది. నువ్వు వెళ్లిపోవడంతో పరువు పోయిందని మీ నాన్న చనిపోవడానికి ఏవో మాత్రలు వేసుకున్నాడు. ఆయన పరిస్థితి క్రిటికల్ గానే ఉంది అనే డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకు మహా నువ్వు ఇలా చేశావు అని హారిక అడుగుతుంది. ప్రతాప్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న మహా తన తండ్రి కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాధపడకమ్మా మీ నాన్నకి ఏమీ కాదు అని మాధవ్ అంటాడు. అయితే అందరు కూడా మహని వాళ్ళ నాన్నను చూడడానికి వెళ్ళమని చెప్తారు. కన్నా నువ్వేం బాధపడకు వదిన మీ నాన్నకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు. ఇది విన్న వ్యక్తి అక్కడికి వెళ్లి వేరేలా చెప్పాలని రమణయ్య దగ్గరికి వెళ్లి మీ కోడలు వెళ్ళిపోతుంది  రమణయ్య చెప్పిందే నిజమైంది అని అనగానే అతను చాలా సంతోషంగా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా నా కోడలు వెళ్లిపోవడం ఏంటి అని నారాయణ గొడవకు దిగుతాడు. అదిగో కార్ వస్తుంది ఒకసారి చూడు. నీ కోడలు నీ కొడుకు వస్తున్నారు చూడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు.. అప్పుడే చక్రి మహా కారులో ఏడుస్తూ రావడం చూస్తాడు నారాయణ.. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నారాయణను ఎగతాళి చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నారాయణ తన కోడలు వెళ్ళిపోయింది ఏంటో తెలుసుకోవాలని వస్తాడు.. అప్పుడే ఎదురుగా వచ్చిన తాయారు పగలబడి నవ్వుతుంది.. నా శాపం ఊరికి పోలేదు. ఇప్పటికైనా అర్థమైందా? ఆ ఇంటిని మూడు భాగాలు చేసి మాకు చెరోక భాగం ఇవ్వు ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని తాయారు అంటుంది.. మా కోడల సంగతి పక్కన పెట్టు మీ ఆయన దుబాయ్ లో వేరొకదాన్ని తగులుకున్నాడు అంట కదా అని తయారుకు లేనిపోని అనుమానాలు వచ్చేలా చేస్తాడు నారాయణ.. ఇక్కడ వాడు నీ కొంప కొల్లేరు చేస్తున్నాడు పోయి అది చూసుకో ముందు అని అంటాడు.. ఆడికి అంత సీన్ లేదు నేను ఏంటో వాడికి తెలుసు అని తాయారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

మహా నేను ఇలా చేసి మా నాన్నకు దూరం కావడానికి కారణం మీరే అని అనగానే.. చక్రి కారు ఆపేసి షాక్ అయ్యి అలాగే ఉండిపోతాడు.. ఏంటండీ అంత మాట నే సరే ఏంటండి నేనేం చేశాను అని చక్రి అంటాడు.. ఇలా రోడ్డు మీద ఏడుస్తూ ఉంటే ఎవరైనా చూస్తే నేను మిమ్మల్ని ఏడిపిస్తున్నానని అనుకుంటారు. మీరు ఏడవకండి అని చక్రి అంటాడు.. ఇక తర్వాత కారెందుకు ఆపేసారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొని వెళ్ళండి అని మహా అంటుంది. మీ నాన్నకు ఏమి కాలేదు ఏదైనా అయితే మీ వదిన ఫోన్ చేస్తుంది కదా అని అంటాడు.. అప్పుడే చక్రీకి ఒక ఫోన్ వస్తుంది.. ఇది మీరు అనుకున్న ఫోన్ కాదు వేరే ఫోన్ అని అంటాడు చక్రి.. స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఫోన్ చేసి మీ మ్యారేజ్ సర్టిఫికెట్ వచ్చింది. వీరిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒకసారి సంతకం పెట్టాలి అని అంటాడు.. అలాగే సార్ తప్పకుండా తీసుకొస్తానని చక్రి అంటాడు.

ఇక తర్వాత మహా తన ఇంటికి వెళ్తుంది.. ఇక్కడున్న వాళ్ళందరూ మహానీ వింతగా చూస్తారు.. ఆ తర్వాత లోపలికి వెళ్తుంటే ఆది వచ్చి అడ్డుకుంటాడు.. నువ్వు ఎవరు ఇక్కడికి రావడానికి నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందని వచ్చావు అని ఆది మాట్లాడుతాడు.. ఒక్కసారి నాన్నను చూసి వెళ్ళిపోతాను అది అని ఎంతగా బ్రతిమిలాడుతున్నా సరే నీ వల్లే ఇదంతా జరిగింది. నాన్న ఇప్పుడు చావు బతుకులో ఉండడానికి కారణం నువ్వే అని అంటాడు.. మీరు అలా అనకండి ఒక్కసారి మీ నాన్నగారిని చూసి వెళ్ళిపోతుంది అని చక్రి అనగానే ఇంతకీ నువ్వు ఎవర్రా చెప్పడానికి అని ఆది చక్రిని కొడతాడు.. ఏంటండీ పోలీస్ స్టేషన్ నుంచి చూస్తున్నాను నన్ను కొడుతున్నారేంటి నేనేం చేశాను మధ్యలో అని చక్రి అంటాడు. ఇక అందరూ కలిసి ఆది, చక్రియలను కొట్టుకోకుండా ఆపుతారు..

Advertisement

ఆ తర్వాత ఇకనుంచి వెళ్లిపోండి అని అనగానే మహా చక్రి ఇద్దరు వెళ్ళిపోతుంటారు.. అప్పుడే అక్కడికి వచ్చిన భూషణ్ ని చూసి మహా షాక్ అవుతుంది. ఇదంతా జరగడానికి కారణం నువ్వే నిన్ను అని చక్రీ మీదికి కొట్టడానికి వస్తాడు భూషణ్. అసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని మహా అంటుంది. నీకు ఇప్పటికీ మించిపోయింది లేదు ఇప్పటికి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను మనిద్దరం పెళ్లి చేసుకొని కెనడాకి వెళ్ళిపోదామని భూషణ్ అంటాడు. నువంటేనే నాకు అసహ్యం. అలాంటిది నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావా? ఇంక వీడితో మాటలు అనవసరం మనం వెళ్దాం పదండి అని అనగానే భూషణ్ వెళ్ళండి మీ నాన్న చావు బతుకులో ఉన్నాడు చూడండి అని అంటాడు..

Also Read :శ్రీవల్లి పై ప్రేమకు డౌట్.. నిజం కక్కేసిన శ్రీవల్లి.. రామరాజు ఎమోషనల్..

మహా హాస్పిటల్ కి వెళుతుంది. వాళ్ళ నాన్నని బెడ్ పై చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను వచ్చేసాను నాన్న లేవు నాన్న అని ఏడుస్తుంది. అది చూసిన లలిత ఎందుకే నువ్వు మళ్ళీ వచ్చావు చచ్చాడో బతికాడో చూడ్డానికి వచ్చావా అని అంటుంది.. నేను మీ కూతురు అమ్మ నేను ఏ తప్పు చేయలేదు ఎందుకు మీరు నన్ను అంతగా ఇది చేస్తున్నారు అని మహా అడుగుతుంది. నువ్వే తప్పు చేయకపోతే మరి ఇదేంటి అని లలిత అంటుంది. పులి లాంటి నా భర్తని ఇలా బెడ్ పై పడేలా చేశావు. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో ఆయనకు స్పృహ వచ్చి నిన్ను చూసాడంటే కచ్చితంగా బాధపడతాడు ఆయన మాకు దక్కడు అని బాధపడుతుంది లలిత. హారిక మహాను తీసుకొని బయటికి వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×