E-Paper
Advertisement

పురిటి నొప్పులతో గర్భిణీ.. వేటాడే షార్క్‌లు! నెట్‌ఫ్లిక్స్‌లో విధ్వంసం.. ఈ రేంజ్ థ్రిల్లర్ ఎప్పుడూ చూసుండరు!

పురిటి నొప్పులతో గర్భిణీ.. వేటాడే షార్క్‌లు! నెట్‌ఫ్లిక్స్‌లో విధ్వంసం.. ఈ రేంజ్ థ్రిల్లర్ ఎప్పుడూ చూసుండరు!
Advertisement

Thrash Movie : థ్రిల్లర్ లందు సర్వైవల్ థ్రిల్లర్స్ వేరయా .. అన్నట్టుగా సినిమాల్లో పాత్రలు బతకడానికి చేసే పోరాటం ఆడియన్స్ ని ఎంతలా ఎగైటింగ్ కి గురి చేస్తాయో చెప్పక్కర్లేదు. అదిగో అలాంటి ఓ క్రేజీ సర్వైవల్ థ్రిల్లర్ ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తుంది. అదే ‘ట్రాష్’ (Thrash). సరిగ్గా మూడు రోజుల క్రితం, అంటే ఏప్రిల్ 10, 2026న ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. నిజానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, కొన్ని అనుకోని రీజన్స్ తో డైరెక్ట్ గా డిజిటల్ లోకి వదిలేశారు. అయితే ఈ సినిమా కేవలం ఇంగ్లిష్ ఆదియోలోనే కాకుండా తెలుగు ఆడియన్స్ కోసం తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ చేయడం విశేషం.

also read:దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. ఊపిరి బిగబట్టే సస్పెన్స్! OTTలో మిస్ అవ్వకూడని 7 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే!

Advertisement

నిండు గర్భిణీగా ఉన్న ఓ మహిళ ప్రాణభయంతో

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కథ అంతా ఒక తీర ప్రాంత పట్టణంలో సాగుతుంది. ఒక్కసారిగా విరుచుకుపడిన అధిక వర్షం  ఊరంతా చెరువులా మారిపోతుంది. అయితే అసలైన ట్విస్ట్ ఏంటంటే, ఆ వరద నీటితో పాటు సముద్రం నుండి నరభక్షక షార్క్‌లు పట్టణ వీధుల్లోకి ప్రవేశిస్తాయి. కంటికి కనిపించిన వారిని వేటాడుతున్న ఆ షార్క్‌ల మధ్య, నిండు గర్భిణీగా ఉన్న ఓ మహిళ ప్రాణభయంతో పోరాడటం ఈ సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు పురిటి నొప్పులు, మరోవైపు తనను మింగేయాలని చూస్తున్న షార్క్‌లు.. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి ఆమె తన బిడ్డను ఎలా కాపాడుకుంది అన్నది దర్శకుడు టామీ విర్కోలా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. సాధారణంగా షార్క్ సినిమాలు అంటే సముద్రం మధ్యలోనో లేదా బోటులోనో జరుగుతాయి, కానీ ఇక్కడ మన ఇంట్లోకి, మనం నడిచే వీధుల్లోకి షార్క్‌లు వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు టామీ విర్కోలా. ఇక ఇందులో నటించిన ఫోబ్ దైనేవర్, డిజిమోన్ హౌన్సౌ తమ అద్భుతమైన నటనతో ఈ సినిమాను మరో రేంజ్ కి తీసుకుపోయారు.

Advertisement

మొదలైన 48 గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్

టెక్నికల్ పరంగా చూస్తే, ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ మరియు సౌండ్ డిజైన్ టాప్ నాచ్. ముఖ్యంగా నీటిలో షార్క్‌లు కదిలేటప్పుడు వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ ప్రేమికులకు అసలైన మజాను పంచుతుంది. ఇక ఈ ‘ట్రాష్’ స్ట్రీమింగ్ ఏప్రిల్ 10 మొదలవగా మొదలైన 48 గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించడం విశేషం. అలా ఈరోజు అంటే ఏప్రిల్ 13, 2026 నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ వాచ్డ్ మూవీగా నిలిచిందంటే సినిమా ఆడియన్స్ ని ఎంతలా అలరిస్తుందో అర్థమైతుంది. సో మీకు గనుక వెన్నులో వణుకు పుట్టించే సీన్స్‌తో సాగే ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను చూడాలంటే ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లోకి లాగిన్ అయిపోండి.

also read:OTT Thriller: క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. మలయాళీ ‘డైమండ్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో!

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×