E-Paper
Advertisement

Rinku Singh: వెంటిలేటర్ పైన‌ తండ్రి..అర్ధాంతరంగా టీమిండియాను వీడిన రింకూ సింగ్

Rinku Singh:  వెంటిలేటర్ పైన‌ తండ్రి..అర్ధాంతరంగా టీమిండియాను వీడిన రింకూ సింగ్
Advertisement

Rinku Singh: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 దశలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా జట్టును అర్ధాంతరంగా రింకూ సింగ్ ( Rinku Singh ) వీడాడు. సూపర్ 8 లో భాగంగా జింబాబ్వేతో టీమిండియా ఫిబ్రవరి 26వ తేదీన మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్, అర్ధాంతరంగా టీమిండియా జట్టును వీడారు. లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ర సింగ్ ( Khanchandra Singh ) నోయిడాలోని ( Noida) ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన ఉన్నారని తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో టీమిండియాను వదిలి ఇంటికి వెళ్లారట రింకూ సింగ్. దీంతో రింకూ సింగ్ స్థానంలో సంజు శాంసన్ ( Sanju Samson) తుది జట్టులోకి వస్తాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Ind T20i wc 2026-WC 2011: గంభీర్ అంధ భ‌క్తుల వెర్రి ప్ర‌చారం..2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హిస్ట‌రీ, 2026లో రిపీట్ అవుతుందంటూ ఓవరాక్ష‌న్‌

వెంటిలేటర్ పైన‌ తండ్రి..అర్ధాంతరంగా టీమిండియాను వీడిన రింకూ సింగ్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా టీమ్ ఇండియా జట్టును ఫినిషర్ రింకూ సింగ్ అర్ధాంతరంగా వీడారు. రింకు సింగ్ తండ్రి గత కొన్ని రోజులుగా లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనది ప్రస్తుతం ఫోర్త్ స్టేజ్ అని తెలుస్తోంది. దీంతో రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ర సింగ్ ( Khanchandra Singh )ని నోయిడా లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

ఏ క్షణమైనా ఆయన మృతి చెందే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు ఇప్పటికే తేల్చి చెప్పారట. అయితే చివరి క్షణంలో అయినా తన తండ్రితో ఉండాలని రింకూ సింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 ) ఉన్నప్పటికీ కూడా టీమిండియా జట్టును రింకూ సింగ్ వీడినట్లు చెబుతున్నారు. హుటా హటిన నోయిడాకు చెన్నై నుంచి బయలుదేరారు రింకూ సింగ్. ఈ హెల్త్ ఎమర్జెన్సీ ( Health Emergency) నేపథ్యంలో ఇవాళ చెన్నై స్టేడియంలో టీమిండియా ప్లేయర్లతో రింకూ సింగ్ ప్రాక్టీస్ కూడా చేయలేదట.

రింకూ సింగ్ స్థానంలో టీమిండియాలోకి సంజు శాంస‌న్ ?

Advertisement

తన తండ్రి హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో టీమిండియా ( Team India) నుంచి తప్పుకున్నాడు రింకూ సింగ్ ( Rinku Singh). దీంతో అతని స్థానంలో టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ కు అవకాశం ఇచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) సిద్ధమైనట్లు చెబుతున్నారు.

Also Read:  Hardik Pandya-Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×