BigTV English
Advertisement

OTT Movies : అమ్మాయిలను టార్గెట్ చేసే సైకో.. ఓటీటీలో మెంటలెక్కిస్తున్న థ్రిల్లర్ మూవీ..డోంట్ మిస్..

OTT Movies : అమ్మాయిలను టార్గెట్ చేసే సైకో.. ఓటీటీలో మెంటలెక్కిస్తున్న  థ్రిల్లర్ మూవీ..డోంట్ మిస్..

OTT Movies : ప్రతి నెల కొత్త సినిమాలు ఎక్కువగా విడుదల అవుతుంటాయి. అయితే కొత్త సినిమాలు హిట్ టాక్ ను అందుకుంటే మాత్రం నెల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అదే విధంగా ప్రతి వారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి హారర్, క్రైమ్ థ్రిల్లర్ మూవీలు స్ట్రీమింగ్ అవుతున్నాయి..ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమ్మాయిలను టార్గెట్ చేసే ఒక సైకో కిల్లర్ స్టోరీతో మూవీ వచ్చింది. ఆ సినిమా పేరేంటి? స్టోరీ? స్ట్రీమింగ్ పార్ట్నర్ గురించి వివరంగా తెలుసుకుందాం..


మూడు ఓటీటీల్లోకి మూవీ..

ప్రతి హారర్ మూవీ డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలాంటి స్టోరీతో తో వచ్చిన మూవీ స్నో మ్యాన్.. ఈ మూవీ మొత్తం అమ్మాయిల మిస్సింగ్ ను చేదించడం పైనే ఉంటుంది. 2017 ఆక్టోబర్ లో విడుదలైన ఈ మూవీకి టోమస్ ఆల్ఫ్రెడ్‌సన్ దర్శకత్వం వహించారు. మైఖేల్ ఫాస్‌బెండర్ (హ్యారీ హోల్), రెబెక్కా ఫెర్గూసన్ (కాట్రిన్ బ్రాట్), షార్లెట్ గెయిన్స్‌బర్గ్ (రాకెల్), వాల్ కిల్మర్ (గెర్ట్ రాఫ్టో), జె.కె. సిమ్మన్స్ (ఆర్వే స్టోప్) పలువురు కీలక పాత్రలో నటించారు.. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు మూడు ఓటీటీల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, ఆపిల్ టీవీ ఓటీటీల్లోకి వచ్చేసింది.. ప్రస్తుతం క్రైమ్ స్టోరీ మూవీ చూడాలని అనుకొనేవారు ఈ చిత్రాన్ని ఆస్వాదించండి..


Also Read: బావిలో పిశాచి.. వామ్మో గుండెల్లో వణుకు పుట్టించే సీన్లు.. క్లైమాక్స్ లో మైండ్ బ్లాంక్..

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీలో సైకో కిల్లర్ పెళ్ళైన అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నాడు.. అయితే అతను ప్లాన్ చేసి పకడ్బందీగా హత్యలు చేస్తుంటాడు. అంతేకాదు కిల్లర్ బాధితుల వద్ద స్నోమ్యాన్‌ను, తన కాలింగ్ కార్డ్‌గా వదిలివేస్తుంటాడు. అంటే పోలీసులకు క్లూలు ఇచ్చి మరీ మర్డర్స్ చేస్తాడన్నమాట.. నార్వే రాజధాని ఒస్లోలో ఈ సీరియల్ కిల్లర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అక్కడ ఒక బ్రిలియంట్ పోలీసాఫీసర్ ఉంటాడు. అయితే ఆయన ప్రేయసి తో బ్రేకప్ అవడంతో ఒంటరిగా మిగిలిపోతాడు. ఇక ఆయన మందుకు బానిస అవుతాడు. అదే సమయంలో నగరంలో కొందరు మహిళలు వరుసగా అదృశ్యమవుతారు. ఇలా కనిపించకుండా పోయిన మహిళల ఇంటివద్ద స్నోమ్యాన్ బొమ్మ ఒకటి ఉంటుంది. బాధితుల స్కార్ఫ్ చుట్టి ఉంటుంది. ఇలా ప్రతి క్రైమ్ సీన్ వద్ద స్నోమ్యాన్ బొమ్మ కనిపిస్తుంది.. మహిళల అదృశ్యం వెనకాల బలమైన కారణం ఏదో ఉందని పోలీసులు గుర్తిస్తారు.. అయితే బాధితులందరూ వివాహిత మహిళలేనని, వీళ్ళంతా వైవాహిక జీవితంలో అసంతృప్తి తో ఉంటారన్న విషయాలు తెలుస్తాయి.. మరి ఆ సైకో కిల్లర్ అస్సలు  పెళ్లయిన ఆడవాలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నది సినిమా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది.. మరి పోలీసులు ఈ కేసుని ఛేదించారా? ఇప్పటివరకు ఎంత మంది మహిళలను అతను చంపేశారు అనేది పోలీసులు కనిపెట్టారా? అసలు ఈ మూవీ స్టోరీ ఎండ్ ఎక్కడవుతుందనేది తెలియాలంటే కచ్చితంగా మిస్ అవ్వకుండా ఓటీటీల్లో మూవీని తప్పక చూడాలి..

Related News

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

OTT Movie : ఒకే మనిషిని పట్టి పీడించే 4 దెయ్యాలు… దెబ్బకు మనోడి లైఫ్ సెట్టు… ఇలాంటి హర్రర్ మూవీని అస్సలు చూసుండరు భయ్యా

OTT Movie : రోగం ఉన్నోడితో ఒకరాత్రి గడిపే హీరోయిన్… ఆమె గట్స్ కు దండం పెట్టాలి మావా

OTT Movie : టెంపుల్‌లో కోనేరు మిస్టరీ… ఆ వాటర్ తాగితే పరలోకానికే… కనిపెట్టిన డాక్టర్‌కు బుర్రబద్దలయ్యే షాక్

OTT Movie : ఫారెస్ట్ రేంజర్ పదవిని పోగొట్టుకుని ఆర్మీ కోసం పాకులాట.. ఆటలోకి దిగాక ఫ్యూజులు ఔటయ్యే షాక్… మెంటల్ మాస్ ట్విస్టులు

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

OTT Movie : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

Big Stories

×