OTT Movies : దెయ్యాల సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు.. ఈమధ్య హారర్ జానర్ లో వస్తున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఓటీటీలోకి సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తూనే ఉంటాయి. థియేటర్లలోకి వచ్చిన సినిమాలు కొన్ని ఇక్కడ మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా వచ్చే సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. తాజాగా పిశాచాలకు మనుషులకు మధ్య జరిగే పెద్ద యుద్ధం లాంటి స్టోరితో ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ పేరు ‘ తుంబాడ్’. ఈ మూవీ స్టోరీ? స్ట్రీమింగ్ వివరాలను తెలుసుకుందాం..
స్టోరీ విషయానికొస్తే..
ఈ తుంబాడ్ మూవీ మొత్తం మహారాష్ట్ర లో తుంబాడ్ అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులోనూ ఓ మోస్తరుగా ఆడింది. ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ ఇచ్చింది. మనిషికి రుచి మరిగిన రాక్షసి బావిలో ఉండి లెక్కలేనంత బంగారం ఇచ్చే కథతో ఈ మూవీ తెరకెక్కింది.. గజ, కాళీ, శంకర్ అనే ముగ్గురు వ్యక్తులు కామిని అనే డాక్టర్‌ని కిడ్నాప్ చేస్తారు. ఆమెను వాళ్ళ బాస్ దగ్గరికి తీసుకొని వస్తారు. కామినేని కిడ్నాప్ చేయించడానికి నైనా మరొకరిని పంపించి ఉంటుంది. అయితే ఆ వెళ్లిన వ్యక్తి మాయమైపోతారు. అప్పటినుంచి ఈ స్టోరీలో ఎన్నో ట్విస్టులు మొదలవుతాయి. ఇక అతనేమయ్యాడో తెలుసుకోవడానికి డాక్టర్ ను కిడ్నాప్ చేస్తారు. కానీ ఆమె తనకేం తెలియదని చెప్తుంది. అయితే అతను నిధి కోసం తమిళనాడు వెళ్లి ఉంటాడని తెలుసుకుంటారు.
ఒక గ్రామానికి వెళ్తే అక్కడ తన ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటారు. రాత్రి అయితే ఆ గ్రామంలోని వాళ్లంతా దెయ్యాలుగా మారిపోతారు. ఆ ఊర్లో ఎటు తిరిగిన ఏ మూల చూసినా కూడా అందరూ దెయ్యాలుగానే కనిపిస్తుంటారు.. ఆ ఊర్లో మత్తమ్మ అనే ఒక దెయ్యం వేసే ప్రశ్నకు సమాధానం చెప్తే ఆ ఊరు నుంచి బయటపడొచ్చు లేదంటే మాత్రం అక్కడే దెయ్యాలుగా మారిపోతారని అక్కడ చెబుతుంటారు. ఒకప్పుడు మత్తమ్మ బాయి తవ్విస్తూ ఉండగా ప్రమాదవశాత్తూ ఒక మనిషి అందులో పడిపోతాడు. దానికి బదులుగా బావి నుంచి బంగారం బయటికి వస్తుంది. ఇది తెలుసుకున్న మత్తమ్మ అత్యాశతో తన భర్తని కూడా ఆ బావిలో పడేస్తుంది. దానికి బదులుగా మళ్లీ బంగారం వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఊరిలో వారందరిని చంపి బంగారం తీసుకుందామని ప్లాన్ వేస్తుంది.. ఊర్లో ఉన్న వాళ్లందర్నీ చంపేస్తుంది వాళ్ళందరూ దెయ్యాలుగా మారిపోతారు. వాళ్లని కూడా చంపేస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఈ మూవీ స్టోరీని మిస్ అవ్వకుండా ఓటీటీలో చూడాల్సిందే..
నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ( Netflix )..
థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ మూవీ కూడా మధ్యలో కొంచెం బోర్ కొట్టినా స్టార్టింగ్ సీన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. అలాగే చివరి అర్ధగంట అయితే ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఈ మూవీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఓటీటీ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.. ఈ మధ్య ఇక్కడ బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..