BigTV English

OTT Movie : తల్లీ కూతుర్లు మిస్సింగ్… 30 ఏళ్ల గతంలోకి ఎలా ? మైండ్ ను మడతపెట్టే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : తల్లీ కూతుర్లు మిస్సింగ్… 30 ఏళ్ల గతంలోకి ఎలా ?  మైండ్ ను మడతపెట్టే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : టైమ్ ట్రావెల్ సినిమాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తెలుగులో 1991 లో బాలయ్య నటించిన సినిమా ఒక మరచిపోలేని అనుభూతిని ఇచ్చింది.  అందులో టైమ్ మెషీన్ చేసే అద్భుతాలు, అప్పట్లో కొత్తగా అనిపించాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ కూడా టైమ్ లూప్ లో జరుగుతుంది. ఇందులో ఒక దెయ్యం కూడా ఎంట్రీ ఇస్తుంది. ఈ సిరీస్ ట్విస్టులతో పిచ్చెక్కిస్తుంది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హారర్ మిస్టరీ సిరీస్ పేరు ‘డోంట్ కం హోమ్’ (Don’t Come Home). దీనికి వూట్టిదానై ఇంతరకసెట్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2024 అక్టోబర్ 31 నెట్‌ఫ్లిక్స్‌లో ఆరు ఎపిసోడ్‌లతో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో వోరనుచ్ భిరోంభక్ది (వరీ), పిచపా ఫంతుంచింద (ఫా), సిండీ సిరిన్య బిషప్ (పనిడా), ప్లోయ్‌పాఫాస్ ఫోంకాయేవ్సివాపోర్న్ (మిన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి IMDbలో 7.2/10 రేటింగ్ ఉంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

సీజన్ 1 స్టోరీ వరీ అనే మహిళ, ఆమె 5 ఏళ్ల కూతురు మిన్ చుట్టూ తిరుగుతుంది. వరీ తన శాడిస్ట్ భర్త నుండి తప్పించుకోవడానికి, ఫాంగ్ న్గా, తాయ్‌లాండ్‌లోని తన పుట్టినింటికి, తన కూతురు మిన్ తో కలసి పారిపోతుంది. ఈ మాన్షన్ ను సినో అనే యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు. వరీ తల్లి పనిడా ఒక సైంటిస్ట్, టైమ్ ట్రావెల్ మెషిన్‌పై ప్రయోగాలు చేస్తూ ఉండేది. ఇప్పుడు ఈ మాన్షన్‌లోకి వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత, మిన్ కి దెయ్యాలు కనబడుతుంటాయి. ఒక రాత్రి ఆమె క్లోసెట్‌లోకి వెళ్లి కనిపించకుండాపోతుంది. వరీ పోలీసు ఇన్‌స్పెక్టర్ ఫా సహాయంతో, మిన్‌ను వెతకడం మొదలుపెడుతుంది.

ఈ ఇన్వెస్టిగేషన్ సమయంలో మాన్షన్‌లో దాగి ఉన్న టైమ్ ట్రావెల్ మెషిన్ బయటపడుతుంది. ఇది పనిడా తన కుటుంబాన్ని కారు ప్రమాదంలో కోల్పోయిన తర్వాత మళ్లీ వాళ్ళను కలవడానికి రూపొందించింది. కథ షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే, మిన్, వరీ ఒకే వ్యక్తి. మిన్ 2024లో క్లోసెట్ ద్వారా 1991 కి టెలిపోర్ట్ అవుతుంది. పనిడా ఆమెను వరీగా పెంచుతుంది. ఈ వరీ పెరిగి, పెళ్ళి చేసుకుని, మిన్ అనే కూతురును కంటుంది. ఇప్పుడు భర్త శాడిజం వల్ల ఈ మాన్షన్‌కు వస్తుంది. ఇక్కడ టైమ్ లూప్ కొనసాగుతుంది. పనిడాతో జరిగిన గొడవలో, యాసిడ్ పడి వరీ ముఖం కాలిపోయి మరణిస్తుంది. ఆమె ఆత్మ మిన్‌ను వెతుకుతూ దెయ్యంగా మారుతుంది. చివరికి ఇన్‌స్పెక్టర్ ఫా ఈ కేసును ఎలా డీల్ చేస్తుంది. టైమ్ లూప్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? మిన్ ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : ఆ దెయ్యాన్ని చూస్తే నాలుగు రోజుల్లో చస్తారు… ఈ హర్రర్ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే

Related News

OTT Movie : 33 సంవత్సరాల టైమ్ ట్రావెల్ … తమ్ముడికోసం అన్న షాకింగ్ రిస్క్ … ఫ్యామిలీతో చూసేయచ్చు

OTT Movie : భార్య కంటికి చిక్కే భర్త లవ్ లెటర్… ఆమె ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : సొంత కూతురితో ఆ పని కోసం అబ్బాయిని వెతికే తండ్రి… మైండ్ బెండింగ్ మలయాళ స్టోరీ

Virgin Boys: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన వర్జిన్ బాయ్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : ఇండియన్ స్పైగా వెళ్లి, పాక్ ఆర్మీ ఆఫీసర్ కు భార్యగా… ఈ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

OTT Movie: అక్క అంటూనే.. టీనేజ్‌లో అలాంటి పని చేసే అబ్బాయి, ఆ కథతోనే సినిమా తీసి.. ఫుల్ కామెడీ భయ్యా!

Big Stories

×