Thriller Movie OTT : గేమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ? చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతీ ఒక్కరూ ఆటలు ఆడడానికి ఆసక్తిని చూపిస్తారు. మరి అలా ఆటలు ఆడుతూనే డబ్బులు సంపాదించొచ్చు అంటే… ఎన్ని పనులున్నా పక్కన పారేసి ఆడతారు. కానీ అదే ఆట డెడ్లీ డెత్ గేమ్ లా మారితే ? ‘స్క్విడ్ గేమ్’ లాంటి భయంకరమైన గేమ్ లో తెలియకుండానే చిక్కుకుంటే పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. మరి ఇంత ఇంటెస్టింగ్ స్టోరీతో వచ్చిన ఆ థ్రిల్లర్ మూవీ ఏంటి? ఎక్కడ చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.
2013లో విడుదలైన హిందీ థ్రిల్లర్ ‘టేబుల్ నం. 21’ (Table No. 21). దర్శకుడు అదిత్య దత్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజీవ్ ఖండేల్వాల్ (వివాన్ అగస్తి), టీనా డేసాయ్ (సియా అగస్తి), పరేష్ రావల్ (మిస్టర్ ఖాన్ – గేమ్ హోస్ట్) ధ్రువ్ గణేష్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. 108 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా 2013 జనవరి 4న థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. IMDbలో 7.2 రేటింగ్ ఉన్న ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో మైండ్ బెండింగ్ ట్విస్టులే కాదు షాకింగ్ క్లైమాక్స్ కూడా ఉంటుంది.
Read Also : తీరని కోరికలను తీర్చుకోవడానికి తిరిగి జన్మించే ఆత్మ… చిన్న పిల్లాడిగా పునర్జన్మ… సీను సీనుకో ట్విస్ట్
కథ వివాన్ అగస్తి (రాజీవ్ ఖండేల్వాల్), సియా అగస్తి (టీనా డేసాయ్) అనే దంపతుల చుట్టూనే సాగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన ఈ జంటకు అందరిలాగే ఆర్థిక ఇబ్బందులు, రొటీన్ సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఆన్‌లైన్ కాంటెస్ట్ గెలిచి, ఫిజీకి ఫ్రీ వెకేషన్ ట్రిప్ ను గెలుచుకుంటారు. ఇంకేముంది రయ్యిమని త్రిప్పుకు వెళ్లిపోతారు. వెళ్ళినదే తడవుగా ఫిజీలో లగ్జరీ రిసార్ట్ లో రూమ్ తీసుకుంటారు. అక్కడ మిస్టర్ ఖాన్ (పరేష్ రావల్) అనే మిస్టీరియస్ మనిషి ఈ జంటకు పరిచయం అవుతాడు. లైవ్ గేమ్ షోకి ఆ జంటను స్వయంగా ఇన్వైట్ చేస్తాడు. వాళ్ళ కోసం టేబుల్ నం. 21ను రిజర్వ్ చేసి పెడతాడు. ఈ గేమ్ ఆడాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. గేమ్ రూల్స్ ఏంటంటే… 21 ప్రశ్నలు అడుగుతారు. వాటిని అబద్దం చెప్పకూడదు. అంటే అన్ని నిజాలే చెప్పాలి.
సరైన జవాబు చెప్పినప్పుడల్లా ఒక టాస్క్ లేదా లెవెల్ పూర్తి చేస్తారు. ఒకవేళ ఇందులో గానీ అన్ని నిజాలే చెప్పి గెలిస్తే 21 కోట్లు ప్రైజ్ మనీ దక్కుతుంది. అబద్దం చెప్తే చస్తారు. అలాగని మధ్యలో గేమ్ ను క్విట్ చేయలేరు. మొదట గేమ్ ఫన్ గా షురూ అవుతుంది. కానీ రానురానూ పర్సనల్ గా టార్గెట్ చేసే ప్రశ్నలు, ఇబ్బందులో పడేసే టాస్క్ లు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే గతంలో వివాన్ కాలేజీలో ర్యాగింగ్ ఇన్సిడెంట్, ఒక అబ్బాయి సూసైడ్ కేసు బయటకు వస్తుంది. మరి ఆ తరువాత ఏమైంది ? వివాన్ గతం ఏంటి ? సూసైడ్ చేసుకున్న వ్యక్తి ఎవరు? అతని చావుకు ఈ గేమ్ కు లింకు ఏంటి ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే మూవీని చూడాల్సిందే.