E-Paper
Advertisement

Telangana Liquor Sales: తెలంగాణ లిక్కర్ కిక్.. డిసెంబర్‌లో 5 వేల కోట్లకు పైనే, గడిచిన నాలుగు రోజులు

Telangana Liquor Sales: తెలంగాణ లిక్కర్ కిక్.. డిసెంబర్‌లో 5 వేల కోట్లకు పైనే, గడిచిన నాలుగు రోజులు
Advertisement

Telangana Liquor Sales: తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. డిసెంబర్ నెలలో ఐదు వేల కోట్ల రూపాయల పైచిలుకు అమ్మకాలు సాగాయి. గడిచిన నాలుగు రోజులు అయితే లిక్కర్ అమ్మకాలు రూ. 1200 కోట్లు పైమాటేనని చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎక్సైజ్‌ శాఖకు కాసుల పంట పండింది.

డిసెంబర్‌ నెల  తెలంగాణలో లిక్కర్ కిక్

Advertisement

తెలంగాణలో లిక్కర్ అమ్మకాలు కొత్త రికార్డు క్రియేట్ చేసింది. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో అమ్మకాలు పెరుగుతాయి. ఈసారి రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు పెరగడానికి రకరకాల కారణాలు లేకపోలేదు. డిసెంబర్‌లో కొత్త మద్యం పాలసీ వచ్చింది. దీనికితోడు సర్పంచ్ ఎన్నికలు రావడం  మరొక కారణంగా చెబుతున్నారు.

మద్యం కొత్త పాలసీ రావడంతో లిక్కర్ డిపోల నుంచి మద్యం స్టాక్ ఎప్పటికప్పుడు బయటకు వెళ్లింది.  చివరినెల డిసెంబర్‌లో అదిరిపోయే కిక్‌‌తో ముగింపు పలికింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2023 మద్యం పాలసీ తర్వాత డిసెంబర్‌‌‌‌లో కేవలం రూ.4,291 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి రూ. 5, 150 కోట్లకు చేరింది.

Advertisement

రికార్డు స్థాయిలో అమ్మకాలు.. నాలుగురోజుల్లో రూ.1200 కోట్లు

డిసెంబర్​ నెలలో చివరి నాలుగు రోజులు ఊహించని విధంగా లిక్కర్ అమ్మకాలు జోరందుకున్నాయి. డిసెంబర్ 28 నుంచి 31 వరకు దాదాపు రూ. 1,230 కోట్ల అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. లిక్కర్ షాపుల్లో క్షణం తీరిక లేకుండా వ్యాపారం సాగినట్టు తెలుస్తోంది.

పాత ఏడాదికి గుడ్ బై చెబుతూ న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు మద్యంప్రియులు భారీగా పార్టీలు చేసుకున్నారు. కొంత సమయాన్ని పొడిగించింది.  బీర్లు, విస్కీలు, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. డిసెంబర్ 28న-రూ.182 కోట్లు, 29న- 282 కోట్లు, 30న-375 కోట్లు, 31న రూ.400 కోట్ల పైగా మద్యం డిపోల నుంచి వైన్ షాప్ లకు సరకు చేరింది.

ALSO READ: న్యూ ఇయర్ వేళ రెచ్చిపోయిన మందుబాబులు, హైదరాబాద్ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

అయితే డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనికితోడు ప్రత్యేక ఈవెంట్లకు పర్మిషన్​ ఇవ్వడంతో అమ్మకాలు పెరిగినట్టు సమాచారం. చలికాలం కావడంతో బీర్ల సేల్స్ తగ్గుతాయని తొలుత భావించారు.  దాదాపు 28 లక్షల కేస్ లు అమ్మకాలు జరిగినట్టు తెలిపారు.

కొత్త పాలసీ వచ్చిన తర్వాత  డిసెంబర్ నెలలో ఎక్సైజ్ అధికారులు మద్యం షాపులను నిత్యం తనిఖీలు చేస్తూనే ఉన్నారు.  కొత్త స్టాక్ అమ్ముతున్నారా? పాత స్టాక్‌తో నెట్టుకుంటూ వచ్చేస్తున్నారా? నకిలీ మద్యం అమ్మతున్నారా? అనే కోణంలో తనిఖీలు చేపట్టారు. మద్యం షాపుల ఓనర్లు సైతం..  నార్మల్‌గా ప్రతీరోజూ అమ్మకాలు కంటే న్యూ ఇయర్ కావడంతో అమ్మకాలు రెట్టింపు అయ్యాయని చెప్పుకొచ్చారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×