E-Paper
Advertisement

Thriller movie OTT: దొంగ పని చేస్తూ కోట్ల రూపాయలు… లైఫ్ సెటిల్ అయిపోయే స్కెచ్… క్రేజీ సీన్లు

Thriller movie OTT: దొంగ పని చేస్తూ కోట్ల రూపాయలు… లైఫ్ సెటిల్ అయిపోయే స్కెచ్… క్రేజీ సీన్లు
Advertisement

Thriller movie OTT : నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ‘ది మాస్టర్‌మైండ్’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గత ఏడాది వచ్చిన ఈ సినిమా 1972లో అమెరికాలోని వోర్సెస్టర్ ఆర్ట్ మ్యూజియంలో జరిగిన రియల్ దొంగతనం ఆధారంగా రూపొందింది. ఆ సమయంలో పికాసో, రెమ్రాంట్ వంటి గొప్ప చిత్రకారుల పెయింటింగ్స్‌ను దొంగిలించారు. ఈ సినిమా 1970ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. వియత్నాం యుద్ధం సమయంలో అప్పటి రాజకీయ పరిస్థితులు కథలో చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇది సాధారణ దొంగతనం సినిమాల్లాగా కాకుండా, చాలా నిదానంగా సాగే హీస్ట్ సినిమా. అంటే హడావిడి తక్కువ, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

కెల్లీ రీచార్డ్ట్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ హీస్ట్ మూవీ పేరు ‘ది మాస్టర్‌మైండ్’ (The Mastermind). ఇందులో జోష్ ఓ’కానర్, అలానా హైమ్, హోప్ డేవిస్, జాన్ మాగారో, గాబీ హాఫ్‌మన్, బిల్ క్యాంప్ నటించారు. ఈ చిత్రం 2025 మే 23న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించి, అక్కడ పామ్ డి’ఓర్ కోసం పోటీ పడింది. ఆ తరువాత అక్టోబర్ 17న యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా MUBI, Prime Video ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

సినిమా కథ

Advertisement

1970ల నాటి అమెరికా నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. వియత్నాం పై అమెరికా యుద్ధం చేస్తున్న సమయంలో ఒక మ్యూజియం నుండి పెయింటింగ్స్‌ను దొంగిలించడానికి, ప్లాన్ వేసే ఒక ఫ్యామిలీ మ్యాన్ తో కథ మొదలవుతుంది. జేమ్స్ బ్లెయిన్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని జేబీ అని కూడా పిలుస్తుంటారు. అతను తన ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి ఒక వింతైన ప్లాన్ వేస్తాడు. ఒక మ్యూజియంలో ఉన్న విలువైన పెయింటింగ్స్‌ను దొంగిలించి, వాటిని అమ్మి సెటిల్ అవ్వాలనుకుంటాడు. అయితే ఇది సాధారణ యాక్షన్ సినిమాల్లాగా తుపాకులు, ఫైటింగ్‌లతో సాగే దొంగతనం కాదు. ఒక సామాన్యుడు తన తెలివితేటలతో, చాలా నిమ్మదిగా ప్లాన్ చేసే యాంటీ హీస్ట్ కథ.

జేబీ ప్లాన్ వేయడం వరకు బాగానే ఉంటుంది కానీ, ఆ దొంగతనం అమలు చేసే క్రమంలో అతను పడే టెన్షన్, అతని కుటుంబ పరిస్థితులు కథను ఆసక్తికరంగా మారుస్తాయి. పెద్దగా హడావిడి లేకుండా, కేవలం మాటలు, చిన్న చిన్న సంఘటనలతో సినిమా సాగుతుంది. చివరికి అతను ఆ పెయింటింగ్స్‌ను దొంగిలించాడా ? ఆ దొంగతనం అతని జీవితాన్ని ఎలా మార్చింది? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : మ్యూజిక్ రాపర్ అవ్వాలనుకునే పిజ్జా బాయ్… మాట్లాడే బాతుతో కష్టాలు… ప్రతి ఎపిసోడ్ సరదాగా

Related News

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

Big Stories

Advertisement
×